Trump travel ban: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. 7 దేశాలకు పరిమిత ప్రవేశ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆ దేశాలు ఏవి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Trump travel ban: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు మరో షాక్ ఇచ్చారు. దేశ భద్రత కారణాలతో పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అమెరికాలోకి మొత్తం 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించడమే కాకుండా, మరో 7 దేశాల పౌరులపై పరిమితులను విధించారు. ఈ నిబంధనలు జూన్ 9 సోమవారం తెల్లవారుజామున 12:01 గంటలకు అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. 

ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలు ఇవే

  1. అఫ్ఘానిస్తాన్
  2. మయన్మార్
  3. చాద్
  4. రిపబ్లిక్ ఆఫ్ కాంగో
  5. ఈక్వటోరియల్ గినియా
  6. ఎరిట్రియా
  7. హైతీ
  8. ఇరాన్
  9. లిబియా
  10. సోమాలియా
  11. సూడాన్
  12. యెమెన్

పాక్షిక ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలు

  1. బురుండి
  2. క్యూబా
  3. లావోస్
  4. సియరా లియోన్
  5. టోగో
  6. తుర్క్‌మెనిస్తాన్
  7. వెనిజువెలా

ట్రావెల్ బ్యాన్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ట్రంప్ ఏం చెప్పారు?

ట్రావెల్ బ్యాన్ ఆదేశం అమలులోకి రాబోతున్న నేపథ్యంలో ట్రంప్ 2017లో జారీచేసిన మొదటి ట్రావెల్ బ్యాన్‌ను గుర్తు చేస్తోంది, అది అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఈసారి, అమెరికా సుప్రీం కోర్ట్ ఆధారంగా రూపొందించిన కొత్త నిబంధనలతో అంతరాయం లేకుండా అమలు చేయాలని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ ఈ నిర్ణయాన్ని కోలరాడోలో జరిగిన ఒక ఉగ్రదాడి ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రకటించారు. "అమెరికాను రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ధ్యేయం" అని ట్రంప్ చెప్పారు. కోలరాడో ఘటనలో ఈజిప్ట్‌కు చెందిన ఒక వ్యక్తి తాత్కాలిక టూరిస్ట్ వీసాతో వచ్చి దాడికి పాల్పడ్డాడని హోం‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది.

వీసా మిగులు రేటు, పౌర డాక్యుమెంట్ల నిబంధనలు, అమెరికా అధికారులతో సహకారం లేకపోవడం వంటి అంశాలను ఈ దేశాలను ఎంపిక చేయడానికి ఆధారంగా తీసుకున్నారు. ఉదాహరణకు, ఎరిట్రియా లో F, M, J వీసా మిగులు రేటు 55.43 శాతం కాగా, చాద్ లో B1/B2 వీసా మిగులు రేటు 49.54 శాతంగా ఉంది.

ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి?

అఫ్ఘానిస్తాన్ పౌరులపై నిషేధం విమర్శలకు దారి తీసింది. AfghanEvac సంస్థ అధ్యక్షుడు షాన్ వాన్‌డైవర్ మాట్లాడుతూ, "ఇరవై సంవత్సరాలు అమెరికా బలగాలకు తోడుగా ఉన్న దేశాన్ని ఇలా నిషేధించడం నీతి విరుద్ధం" అన్నారు. అయితే, ప్రత్యేక వీసాలు ఉన్న అఫ్ఘన్లకు మినహాయింపులు ఉండనున్నాయి. 

హైతీ వంటి దేశాలపై ట్రావెల్ బ్యాన్ నిషేధం కూడ విమర్శలకు లోనైంది. ఈ దేశంలో రాజకీయ అస్థిరత, గ్యాంగ్ హింస, మానవతా సంక్షోభం కొనసాగుతోంది. ట్రంప్ ప్రకటన ప్రకారం, హైతీ సరైన న్యాయ వ్యవస్థ, భద్రతా సమాచారం వ్యవస్థల్ని కలిగి లేదని పేర్కొన్నారు.

ట్రావెల్ బ్యాన్ లో వీసాలపై పరిమితులు

ఈ ట్రావెల్ బ్యాన్‌లో వీసాలపై పరిమితులు కూడా ఉన్నాయి. B-1, B-2 (బిజినెస్, టూరిజం), F, M, J (విద్యార్థులు, శిక్షణ కోసం వచ్చేవారు వర్గాలకు కీలక నిబంధనలు అమలు చేయనున్నారు.

ట్రంప్ చివరిగా.. “ముస్లిం దేశాల నుంచి వచ్చే ఉగ్రవాదులను అడ్డుకోవడమే ఈ ట్రావెల్ బ్యాన్ ఉద్దేశం. ఇది ఒక సుప్రీం కోర్ట్ అంగీకరించిన విధానం” అని తెలిపారు. అమెరికా భద్రతను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో ట్రంప్ మరోసారి ట్రావెల్ బ్యాన్ విధానాన్ని పునరుద్దరించారు. దీనిపై ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.