Pakistani soldiers killed by BLA: పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. 22 మంది పాక్ సైనికులు హతమయ్యారని సమాచారం. అలాగే, ఆరుగురు బీఎల్ఏ ఫైటర్స్ సైతం మరణించారనీ, పాక్‌లో కొన్ని పట్టణాలపై బీఎల్ఏ పట్టు సాధించినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Pakistani soldiers killed by BLA: భారత్ తో ఉద్రిక్తల మధ్య పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. 22 మంది పాక్ సైనికులు హతమయ్యారని సమాచారం. అలాగే, ఆరుగురు బీఎల్ఏ ఫైటర్స్ సైతం మరణించారనీ, పాక్‌లో కొన్ని పట్టణాలపై బీఎల్ఏ పట్టు సాధించినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
తాజా వివరాల ప్రకారం.. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మధ్య మరోసారి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో 22 మందికి పైగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. అలాగే, ఎల్బీఏ సైన్యంలోని ఆరుగురు మరణించారు. భారత్ తో ఉద్రిక్తల మధ్య పాకిస్తాన్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.
అంతకుముందు, తుర్బత్ జిల్లా డన్నుక్ ప్రాంతంలో ఏప్రిల్ 29 రాత్రి 3:30 గంటలకు మొదలైన ఈ దాడి తెల్లవారేవరకూ కొనసాగింది. ఈ కాల్పుల్లో 13 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లు ఎల్బీఏ ప్రకటించింది. ఎబ్లీఏ ప్రతినిధి జియాండ్ బలూచ్ ప్రకారం.. పాక్ సైన్యం తమను చుట్టుముట్టేందుకు ప్రయత్నించిందనీ, దీంతో తాము ధీటుగా ఎదుర్కొన్నామని తెలిపారు. దాడిలో పాక్ సైనికుల కాన్వాయ్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు పేర్కొన్నారు.
కాగా, బలూచిస్తాన్ పోస్ట్ ప్రకారం.. మంగచూర్ టౌన్లో రాత్రి నుండి హెలికాప్టర్లు, డ్రోన్ల సంచారం భారీగా పెరిగింది. ఈ ఎయిర్ పట్రోల్స్ కేవలం పర్యవేక్షణ కోసమే కాదు, త్వరలోనే మిలిటరీ ఆపరేషన్‌కు కూడా రూపకల్పన అవుతుందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ పాలన యంత్రాంగం మంగచూర్ పట్టణంలో కర్ఫ్యూను విధించింది. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని హెచ్చరించింది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవలి దాడులు బలూచ్ స్వాతంత్య్రాన్ని కోరుతూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) ప్రారంభించిన ఉద్యమం క్రమంలో వరుస దాడుల కొనసాగింపుగా భావిస్తున్నారు. ఈ దాడులు ప్రత్యేకించి చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) పేరిట బలూచిస్తాన్‌లో జరుగుతున్న మిలిటరీకరణ, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా సాగుతున్నాయి.
గతంలో బీఎల్ఎఫ్ (BLF) ఒక ప్రకటనలో.. "బలూచిస్తాన్ అంతటా అభివృద్ధి పేరిట విదేశీ శాసకులు రహదారులు నిర్మిస్తున్నారు. ఇవి తమ సైనిక బలగాల సంచారానికి ఉపయోగపడేలా ఉన్నా.. వనరుల దోపిడీని వేగవంతం చేసేందుకు ఉద్దేశించినవి" అని తెలిపింది.
