MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Face Glow: ఒక స్పూన్ కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే, మీ ముఖంలో గ్లో రావడం పక్కా..!

Face Glow: ఒక స్పూన్ కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే, మీ ముఖంలో గ్లో రావడం పక్కా..!

కాఫీ పొడితో ఇప్పటి వరకు మీరు కమ్మనైన వేడి వేడి కాఫీ తాగే ఉంటారు. కానీ, ఈ కాఫీ పొడితో ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 14 2025, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Face Glow
Image Credit : our own

Face Glow

ఏదైనా స్పెషల్ డే వస్తే చాలు తాము సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలి అని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఏవైనా వస్తే అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలా మంది పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు. ఫంక్షన్ రోజు మేకప్ వేసుకుంటారు. ఈ రెండూ ఖర్చుతో కూడుకున్నవే. ఈ రెండూ లేకపోయినా.. స్పూన్ కాఫీ పొడి ఉన్నా మీ ముఖం అందంగా మెరిసిపోతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

25
ఫేస్ ప్యాక్ తో మెరిసే అందం..
Image Credit : our own

ఫేస్ ప్యాక్ తో మెరిసే అందం..

కాఫీ పొడితో ఇప్పటి వరకు మీరు కమ్మనైన వేడి వేడి కాఫీ తాగే ఉంటారు. కానీ, ఈ కాఫీ పొడితో ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు. కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. ముఖాన్ని కాంతి వంతంగా, మృదువుగా మార్చడానికి కూడా సహాయపడతాయి.

Related Articles

Related image1
Face Glow: ఈ డ్రింక్ తాగితే ముఖంలో గ్లో పెరగడం పక్కా, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది..!
Related image2
Face Glow: ఈ చిన్న గింజల జెల్ రాస్తే చాలు, ఏ క్రీములు రాయకపోయినా అందంగా మెరిసిపోవచ్చు..!
35
ఫేస్ ప్యాక్ కి కావాల్సిన పదార్థాలు...
Image Credit : social media

ఫేస్ ప్యాక్ కి కావాల్సిన పదార్థాలు...

కాఫీ పౌడర్ – 1 టీస్పూన్

హనీ (తేనె) – 1 టీస్పూన్

పెరుగు – 1 టీస్పూన్ (లేదా) పాలు – 1 టీస్పూన్

కాఫీతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి?

ఓ బౌల్‌లో కాఫీ పౌడర్, తేనె, పెరుగు (లేదా పాలు) వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మంచిగా పేస్టులాగా చేసుకోవాలి. తర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. సున్నితంగా ఫేస్ ని ఈ ప్యాక్ రాస్తూ మసాజ్ చేయాలి. 15 నిమిషాల పాటు దానిని అలానే వదిలేసి.. తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా మసాజ్ చేస్తూ, ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.

45
ఎలా వాడాలి?
Image Credit : freepik

ఎలా వాడాలి?

మీరు ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు మాత్రమే మీ ముఖంపై అప్లై చేసుకోవాలని గుర్తుంచుకోండి. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ను మీ ముఖంపై ఎప్పుడు ఉపయోగించినా, ముందుగా మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోండి. ఆ తర్వాత మాత్రమే ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించండి. దీని నుండి మీకు చాలా తేడా కనిపిస్తుంది. ఏదైనా ప్రయత్నించే ముందు..ప్యాచ్ టెస్టు చేసుకోవడం చాలా ముఖ్యం.

55
ఈ ఫేస్ ప్యాక్ వల్ల ప్రయోజనాలు..
Image Credit : stockPhoto

ఈ ఫేస్ ప్యాక్ వల్ల ప్రయోజనాలు..

ఈ ఫేస్ ప్యాక్ రాయడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది. చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్‌ తగ్గే అవకాశం ఉంటుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మానికి లభిస్తాయి. కనీసం వారానికి రెండు సార్లు వాడితే.. మీకు మంచి ఫలితాలు కనపడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్
Recommended image2
Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు
Recommended image3
Silver Rings: కళ్లు చెదిరే డిజైన్ లో వెండి ఉంగరం.. ఓ లుక్కేయండి
Related Stories
Recommended image1
Face Glow: ఈ డ్రింక్ తాగితే ముఖంలో గ్లో పెరగడం పక్కా, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది..!
Recommended image2
Face Glow: ఈ చిన్న గింజల జెల్ రాస్తే చాలు, ఏ క్రీములు రాయకపోయినా అందంగా మెరిసిపోవచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved