MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Districts News
  • Tirupati
  • Tirupati: ఎయిర్‌పోర్టును త‌ల‌ద‌న్నేలా.. రూ. 500 కోట్ల‌తో తిరుప‌తి బ‌స్ టెర్మిన‌ల్, ఎన్నో అద్భుతాలు

Tirupati: ఎయిర్‌పోర్టును త‌ల‌ద‌న్నేలా.. రూ. 500 కోట్ల‌తో తిరుప‌తి బ‌స్ టెర్మిన‌ల్, ఎన్నో అద్భుతాలు

ప్ర‌తీ రోజూ దేశ న‌లుమూల‌ల నుంచి వేలాది మంది భ‌క్తులు తిరుప‌తికి విచ్చేస్తుంటారు. వీరి కోసం తిరుమ‌ల‌తో పాటు తిరుప‌తిలోనూ నిత్యం ఎన్నో ర‌కాల అభివృద్ధి ప‌నులు చేప‌డుతూనే ఉంటారు. తాజాగా తిరుప‌తిలో కొత్త బ‌స్ స్టేష‌న్ నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఏకంగా రూ. 500 కోట్ల‌తో ఎయిర్‌పోర్టును త‌ల‌పించేలా ఈ బ‌స్ టెర్నిన‌ల్‌ను నిర్మించ‌నున్నారు.  

2 Min read
Author : Narender Vaitla
Published : May 18 2025, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తిరుమలకు వ‌చ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుపతిలో నూతనంగా ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ స్థలంలోనే ఈ భారీ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. మొత్తం రూ.500 కోట్ల వ్యయంతో దీనిని అభివృద్ధి చేయనున్నారు.
 

25

కొత్త బ‌స్టాండ్ విశేషాలు: 

ప్రస్తుత బస్టాండ్ స్థలం – 13.18 ఎకరాలు

నూతన టెర్మినల్ నిర్మాణం – 12.19 ఎకరాల్లో

బేస్‌మెంట్‌ (సెల్లార్) – రెండు అంతస్తులు బైకులు, కార్ల పార్కింగ్ కోసం

గ్రౌండ్ ఫ్లోర్ – బస్టాండ్ (98 ప్లాట్‌ఫామ్‌లు), 50 బస్సుల పార్కింగ్, EV బస్సులకు ఛార్జింగ్ ఏర్పాట్లు. 

1వ, 2వ అంతస్తులు – RTC కార్యాలయాలు, ఫుడ్‌కోర్టులు, షాపులు
 

35
Tirupati

Tirupati

3వ అంతస్తు – భవనం సేవల కోసం (సీసీ కెమెరా నియంత్రణ, విద్యుత్‌ నిర్వహణ)

4 నుంచి 7వ అంతస్తులు – హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు

8 నుంచి 10వ అంతస్తులు – కమర్షియల్ స్పేస్ (బ్యాంకులు, సంస్థల కార్యాలయాలు)

10వ అంతస్తుపై – హెలిప్యాడ్ నిర్మాణం

మొత్తం బిల్ట్-అప్ స్పేస్ – 1.54 లక్షల చదరపు అడుగులు

45

పెట్టుబడి భాగస్వామ్యం:

టెర్మిన‌ల్ నిర్మాణానికి ఆర్టీసీ స్థ‌లాన్ని కేటాయిస్తుంది. అలాగే కొన్ని నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ NHLML అందిస్తుంది. మిగ‌తా మొత్తాన్ని ప్రైవేటు గుత్తేదారు అందించ‌నున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హోటళ్ల, కార్యాలయాల ఆదాయాన్ని RTC, NHLML, గుత్తేదారు మద్య వాటాలుగా పంచుకుంటారు. 

అసౌక‌ర్యం లేకుండా: 

కొత్త బ‌స్టాండ్ నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం లేకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళం డిపో,  అలిపిరి వ‌ద్ద‌, తిరుచానూరు మార్గం వద్ద తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయనున్నారు.

55
tirupati

tirupati

తిరుమల ఆలయాన్ని ప్రతిబింబించే శైలిలో డిజైన్:

ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ తయారీ బాధ్యతను రైట్స్ లిమిటెడ్కు అప్పగించారు. ముఖద్వారం తీరుతిరుమల ఆలయ ఆకృతిని పోలి ఉండేలా రూపొందిస్తున్నారు. అలాగే రైల్వే స్టేష‌న్ నుంచి బస్టాండ్‌కు సులువుగా వెళ్లేందుకు వీలుగా.. సుమారు 1 కిలోమీటరు పొడవైన స్కైవాక్ నిర్మించే ప్రతిపాదన ఉంది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala : వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి అభిషేక దర్శనం.. మీకూ ఈ అదృష్టం దక్కాలంటే ఏం చేయాలో తెలుసా?
Recommended image2
వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైలు
Recommended image3
లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved