MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tips
  • Smartphone: ఫోన్ బ్యాట‌రీ ఎందుకు ఉబ్బుతుంది.? ఉబ్బితే ఏం చేయాలి.?

Smartphone: ఫోన్ బ్యాట‌రీ ఎందుకు ఉబ్బుతుంది.? ఉబ్బితే ఏం చేయాలి.?

Smartphone: స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన కొద్దీ బ్యాటరీ సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వాటిలో ఒకటి బ్యాటరీ ఉబ్బడం. చాలాసార్లు ఫోన్ సరిగ్గా పనిచేస్తున్నట్టే కనిపించినా, వెనుక భాగంలో బంప్ ఏర్పడుతుంది. ఇంత‌కీ ఫోన్ బ్యాట‌రీ ఎందుకు ఉబ్బుతుందో ఆలోచించారా? 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 15 2025, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాటరీ ఉబ్బడానికి కారణాలు
Image Credit : Generated by google gemini AI

బ్యాటరీ ఉబ్బడానికి కారణాలు

నేటి ఫోన్లలో లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఇవి లోపల రసాయన పూతతో నిండి ఉండే పలుచని లోహం, ప్లాస్టిక్ పొరలతో తయారవుతాయి. ఈ పొరలు ప్రత్యేకమైన ఎలక్ట్రోలైట్ జెల్‌లో ఉంటాయి. కాలక్రమంలో ఈ జెల్ క్షీణించి వాయువుగా మారుతుంది. ఆ వాయువు లోపల ఒత్తిడి పెంచి, బ్యాటరీ ప్యాక్ ఉబ్బేలా చేస్తుంది. దీనివల్లే ఫోన్ వెనుక భాగంలో వాపు కనిపిస్తుంది.

25
ప్రమాదాలను నిర్లక్ష్యం చేయకండి
Image Credit : Generated by google gemini AI

ప్రమాదాలను నిర్లక్ష్యం చేయకండి

బ్యాటరీ వాపు చిన్న సమస్యలా అనిపించినా, ఇది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఉబ్బిన బ్యాటరీ ఎక్కువ ఛార్జ్ అయితే, పేలిపోవడం లేదా మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా బ్యాట‌రీ ఉబ్బిన ఫోన్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఉప‌యోగించ‌కూడ‌దు.

Related Articles

Related image1
UPI New Rules: ఫోన్‌పే చేసే వారికి అల‌ర్ట్‌.. సెప్టెంబ‌ర్ 15 నుంచి కీల‌క మార్పులు. పండగే పండగ..
Related image2
Zodiac signs: ఒక్క నెల ఆగితే ఈ 3 రాశుల వారి జీవితం మార‌డం ఖాయం.. న‌క్ష‌త్రం మార‌నున్న శ‌ని గ్ర‌హం
35
వీటికి దూరంగా ఉండాలి.
Image Credit : Generated by google gemini AI

వీటికి దూరంగా ఉండాలి.

* ఉబ్బిన బ్యాటరీని ఛార్జ్ చేయకండి.

* ఇంట్లో మీరే రిపేర్ చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌కండి.

* గ్యాస్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో బ్యాట‌రీకి రంధ్రం చేయ‌డం లాంటివి చేయ‌కండి. ఇలా చేస్తే బ్యాటరీ పేలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

45
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Generated by google gemini AI

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* బ్యాటరీ ఉబ్బినట్లు గమనించిన వెంటనే ఫోన్‌ను ఆఫ్ చేయండి.

* సురక్షితమైన, గాలి ప్రసరణ ఉండే ప్రదేశంలో ఉంచండి.

* వీలైనంత వరకు బ్యాటరీని డిశ్చార్జ్ అయ్యేలా వదిలేయండి.

* దగ్గరలోని అధికారిక సర్వీస్ సెంటర్ లేదా నిపుణుడి సహాయం తీసుకుని బ్యాటరీని మార్చించండి.

55
బ్యాట‌రీ ఉబ్బ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి.?
Image Credit : Generated by google gemini AI

బ్యాట‌రీ ఉబ్బ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి.?

* బ్యాట‌రీ ఉబ్బ‌కుండా ఉండాలంటే ఎప్పుడూ ఒరిజినల్ ఛార్జర్ వాడాలి.

* ఫోన్‌ని ఎక్కువ సేపు ఛార్జింగ్‌లో పెట్టకూడదు.

* అధిక వేడి తాకకుండా జాగ్రత్తపడాలి.

* ఇలా చేస్తే ఫోన్ జీవితకాలం పెరగడమే కాకుండా, మీకు కూడా భ‌ద్ర‌త ల‌భిస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bluetooth vs Wired Earphones.. వీటిలో ఏది బెటర్? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
Recommended image2
వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్
Recommended image3
నాన్ స్టిక్ పాత్రను ఎంతకాలం వాడొచ్చు? వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
Related Stories
Recommended image1
UPI New Rules: ఫోన్‌పే చేసే వారికి అల‌ర్ట్‌.. సెప్టెంబ‌ర్ 15 నుంచి కీల‌క మార్పులు. పండగే పండగ..
Recommended image2
Zodiac signs: ఒక్క నెల ఆగితే ఈ 3 రాశుల వారి జీవితం మార‌డం ఖాయం.. న‌క్ష‌త్రం మార‌నున్న శ‌ని గ్ర‌హం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved