MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tips
  • Ink Stains Remove Tips: పిల్లల యూనిఫామ్‌పై ఇంక్ మరకలా? ఇలా తొలగించండి!

Ink Stains Remove Tips: పిల్లల యూనిఫామ్‌పై ఇంక్ మరకలా? ఇలా తొలగించండి!

పిల్లల స్కూల్ డ్రెస్ పై ఇంక్ మరకలు పడటం సహజం. అవి డ్రెస్ పై అలాగే ఉంటే చూడటానికి అస్సలు బాగుండదు. పిల్లలు కూడా ఆ దుస్తులను వేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వాటిని తొలగించడం ముఖ్యం. ఇంక్ మరకలను ఈజీగా ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం.  

2 Min read
Author : Kavitha G
Published : Aug 07 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Removing Ink Stains from School Uniforms
Image Credit : Asianet News

Removing Ink Stains from School Uniforms

పిల్లల స్కూల్ యూనిఫామ్‌పై పడిన మరకలను తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత రుద్దినా కొన్నిసార్లు ఆ మరకలు పోవు. అయితే కొన్ని పదార్థాలతో వాటిని సులభంగా తొలగించవచ్చు. అవేంటో ఎలా ఉపయోగించాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.  

26
నిమ్మకాయ, ఉప్పు
Image Credit : Getty

నిమ్మకాయ, ఉప్పు

యూనిఫామ్‌పై ఇంక్ మరకలను పూర్తిగా తొలగించడానికి నిమ్మకాయ, ఉప్పు సహాయపడతాయి. నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి మరకలపై రాసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత తేలికగా రుద్ది, ఉతకాలి. ఇలా చేస్తే ఇంక్ మరకలు పూర్తిగా పోతాయి. నిమ్మరసంలో సహజంగా బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వల్ల అవి మరకలను సులభంగా శుభ్రం చేస్తాయి.

Related Articles

Related image1
Tips and Tricks: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి!
Related image2
Tips and Tricks: డోర్‌మ్యాట్‌లు జారకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
36
బేకింగ్ సోడా
Image Credit : our own

బేకింగ్ సోడా

సాధారణంగా చాలామంది బట్టలపై మరకలను తొలగించడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. యూనిఫామ్‌పై ఇంక్ మరకలను తొలగించడానికి కూడా బేకింగ్ సోడాను వాడవచ్చు. మరకలపై బేకింగ్ సోడా రాసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో రుద్ది ఉతకాలి. యూనిఫామ్‌పై ఇంక్ మరకలు పోతాయి.

46
వైట్ వెనిగర్
Image Credit : Getty

వైట్ వెనిగర్

వైట్ వెనిగర్‌లో ఆమ్ల గుణం ఉండటం వల్ల మరకలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. యూనిఫామ్‌పై ఇంక్ మరకలను తొలగించడానికి 2 స్పూన్ల వెనిగర్‌ను 2 స్పూన్ల నీటిలో కలిపి మరకలపై బాగా రుద్దాలి. 15 నిమిషాల తర్వాత మెత్తటి బ్రష్‌తో రుద్ది ఉతకాలి. మరకలు పోతాయి.

56
టూత్ పేస్ట్
Image Credit : Getty

టూత్ పేస్ట్

టూత్ పేస్ట్ కేవలం పళ్లు శుభ్రం చేయడానికే కాదు.. మరకలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. యూనిఫామ్‌పై ఇంక్ మరకలను తొలగించడానికి వాటిపై కొద్దిగా టూత్ పేస్ట్ రాసి, 15 నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్ది ఉతకితే సరిపోతుంది.  

66
నెయిల్ పాలిష్ రిమూవర్
Image Credit : our own

నెయిల్ పాలిష్ రిమూవర్

గోళ్లపై ఉన్న నెయిల్ పాలిష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్ ఎలా తొలగిస్తుందో, అదే విధంగా ఇంక్ మరకలను కూడా తొలగిస్తుంది. కాటన్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి మరకలపై అప్లై చేస్తే సరిపోతుంది.

పిల్లల యూనిఫామ్‌పై ఇంక్ మరకలను తొలగించడానికి సానిటైజర్‌ను నేరుగా వాడవచ్చు. సానిటైజర్ ని మరకలపై పోసి బాగా ఆ తర్వాత బ్రష్‌తో మెల్లగా రుద్ది శుభ్రం చేయాలి.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
చిన్నారుల సంరక్షణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bluetooth vs Wired Earphones.. వీటిలో ఏది బెటర్? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
Recommended image2
వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్
Recommended image3
నాన్ స్టిక్ పాత్రను ఎంతకాలం వాడొచ్చు? వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
Related Stories
Recommended image1
Tips and Tricks: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి!
Recommended image2
Tips and Tricks: డోర్‌మ్యాట్‌లు జారకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved