MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana Formation Day 2025 : తెలంగాణ ఉద్యమం గురించి తప్పక తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు

Telangana Formation Day 2025 : తెలంగాణ ఉద్యమం గురించి తప్పక తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు

తెలంగాణ అవతరణ దినోత్సవం 2025 సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన టాప్ 5 విశేషాలకు తెలుసుకుందాం. 

2 Min read
Arun Kumar P
Published : May 31 2025, 11:02 AM IST| Updated : May 31 2025, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు
Image Credit : our own

తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు

Telangana : తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. స్వరాష్ట్ర సాధనకోసం 1969 నుండి పోరాటాన్ని ప్రారంభిస్తే 2014లో ఆ కల నెరవేరింది... అంటే నాలుగు దశాబ్దాలకుపైగా పోరాట పలితమే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం. 

తెలంగాణ సాధనకోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి.. ఈ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేసారు... ఎన్నో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి... ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువెనక చాలా స్టోరీ దాగివుంది. మరో రెండ్రోజుల్లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకాలంనాటి టాప్ 5 విషయాల గురించి తెలుసుకుందాం.

26
 1. తొలిదశ తెలంగాణ ఉద్యమం (1969)
Image Credit : our own

1. తొలిదశ తెలంగాణ ఉద్యమం (1969)

భారత స్వాతంత్య్ర తర్వాత బాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు చేపట్టింది ఆనాటి జవహార్ లాల్ నెహ్రూ ప్రభుత్వం. ఈ క్రమంలోనే 1953 లో మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది... తర్వాత 1956 లో తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఆంధ్రలో కలిపేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసారు. ఈ సమయంలోనే ఇరుప్రాంతాల హక్కుల పరిరక్షణ కోసం పెద్దమనుషుల ఒప్పందం వంటివి జరిగాయి.

అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు రాజకీయంగా బలంగా ఉండటంతో తెలంగాణ హక్కులకు భంగం కలిగింది. దీంతో 1969 లో హక్కుల పరిరక్షణ కోసం మొదలైన ఉద్యమం కాలక్రమేణా స్వరాష్ట్ర ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమంలో దాదాపు 369 మంది యువకులు ప్రాణాలు అర్పించారు.

Related Articles

Related image1
Telangana Formation day : హైదరాబాద్ పేరులో ఈ హైదర్ ఎవరు?
Related image2
Telangana Formation day: తెలంగాణ‌కు ఆ పేరు ఎలా వ‌చ్చింది.? దీని వెన‌కాల చారిత్రాక నేప‌థ్యం ఏంటి
36
2. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు
Image Credit : our own

2. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు

తెలంగాణ ఉద్యమం ఉదృతమైనా సరైన నాయకత్వం లేక బలహీనంగా కనిపించేది. కానీ 2001 లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టిడిపి నుండి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఉద్యమ పార్టీని స్థాపించారు. దీంతో తెలంగాణలో మలిదశ ఉద్యమం ప్రారంభమయ్యింది. 'నీళ్లు, నిధులు, నియామకాలు' నినాదంతో కేసీఆర్ నాయకత్వంలో భారీ ఉద్యమం సాగింది.

46
3. కేసీఆర్ నిరాహారదీక్ష
Image Credit : our own

3. కేసీఆర్ నిరాహారదీక్ష

తెలంగాణ రాష్ట్ర సాధానకోసం ఆనాటి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిరహారదీక్ష చేపట్టారు. 'తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో' అన్న నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. దీంతో తెలంగాణ ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగిసిపడింది. చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో 2009 డిసెంబర్ 9న కేసీఆర్ దీక్షను విరమించారు.

56
4. చిదంబరం ప్రకటన :
Image Credit : ANI

4. చిదంబరం ప్రకటన :

“తెలంగాణ రాష్ట్రం రూపొందించేందుకు ప్రక్రియ ప్రారంభించాం” అంటూ ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న ప్రకటించారు...దీంతో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.. ఈ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ఆందోళనలు పెరిగాయి... ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసారు. దీంతో వెనక్కితగ్గిన కేంద్ర డిసెంబర్ 23న మరో ప్రకటన చేసింది. దీంతో తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

66
5. సకలజనుల సమ్మె
Image Credit : Twitter/ AKA Tharun

5. సకలజనుల సమ్మె

తెలంగాణ సాధన కోసం రాజకీయ, వ్యాపార, ఉద్యోగ పక్షాలన్ని ఏకమయ్యాయి... సెప్టెంబర్ 13న సమ్మె చేపట్టి తెలంగాణను స్తంభింపచేసాయి. ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేసారు. ప్రజలు కూడా ఈ సమ్మెకు మద్దతుగా నిలిచారు. దీంతో ఏకంగా 42 రోజులపాటు ఉద్యోగుల సమ్మె కొనసాగింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టిసి, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

ఇలా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగివచ్చింది. 2013 లో కేంద్ర కేబినెట్ తెలంగాణ ఏర్పాటును ఆమోదించింది. 2014 లో పార్లమెంట్ లో తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
భారత రాష్ట్ర సమితి
హైదరాబాద్
Latest Videos
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved