MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రూ. 10 వేల‌కే 4 ఎక‌రాల భూమి సొంతం చేసుకునే అవ‌కాశం.. ఎక్క‌డ.? ఎలాగంటే.?

రూ. 10 వేల‌కే 4 ఎక‌రాల భూమి సొంతం చేసుకునే అవ‌కాశం.. ఎక్క‌డ.? ఎలాగంటే.?

Viral News: తెలివి ఉన్నోడు ఎడారిలో కూడా ఇసుక‌ను అమ్ముతాడ‌ని అంటుంటారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు చేసిన ప‌ని దీనికి ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. త‌న పొలాన్ని అనుకున్న ధ‌ర‌కు అమ్మేందుకు ఓ రైతు చేసిన ప‌ని ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 22 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భూమి అమ్మకానికి వినూత్న ఆలోచన
Image Credit : Getty

భూమి అమ్మకానికి వినూత్న ఆలోచన

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన భీమేష్ అనే రైతుకు టేకులపల్లి శివారులో 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనకు అవసరమైన డబ్బు కోసం భూమిని అమ్మాలని నిర్ణయించాడు. కానీ మార్కెట్ ధర సరైన స్థాయిలో రాకపోవడంతో అతడు వినూత్నంగా ఆలోచించాడు. కేవలం రూ.10 వేలు చెల్లించి ఈ 4 ఎకరాల భూమిని గెలుచుకునే అవకాశం కల్పించాడు.

25
లక్కీ డ్రా పద్ధ‌తిలో
Image Credit : gemini

లక్కీ డ్రా పద్ధ‌తిలో

భీమేష్ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఈ లక్కీ డ్రాలో పాల్గొనాల‌నుకునే వారు ఎవరైనా రూ.10 వేలు చెల్లిస్తే, వారికి ఒక టోకెన్ ఇస్తారు. అయితే డ్రా తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. మొత్తం 1500 టోకెన్లు అమ్ముడైన తర్వాతే లక్కీ డ్రా నిర్వహిస్తానని రైతు స్పష్టం చేశాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు డ్రా తేదీ వివ‌రించ‌న‌ని చెప్పుకొచ్చాడు.

Related Articles

Related image1
దీపావ‌ళి రోజు జ‌గ‌న్ వేసుకుంది మహిళల షూసేనా.? అసలు నిజం ఏంటీ.? వీటి ధర ఎంతంటే.?
Related image2
ప్ర‌య‌త్నిస్తే క‌చ్చితంగా గెలిచి తీరుతాం.. కథ పాతదే కానీ జీవితానికి సరిపోయే సందేశం ఉంటుంది
35
సోషల్ మీడియాలో వైరల్‌
Image Credit : our own

సోషల్ మీడియాలో వైరల్‌

ఈ లక్కీ డ్రా ఆఫర్ వివరాలతో కూడిన పెద్ద ఫ్లెక్సీని భీమేష్ తన చేనువద్ద ఏర్పాటు చేశాడు. అందులో భూమి సర్వే నంబర్లు, రూట్ మ్యాప్, పేమెంట్ విధానాలు మొదలైన వివరాలు ఉన్నాయి. స్థానికులు ఆ ఫ్లెక్సీని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది ఈ ఆఫర్ గురించి ఆసక్తిగా చర్చిస్తున్నారు.

45
ప్లాన్ వర్కవుట్ అయితే..
Image Credit : social media

ప్లాన్ వర్కవుట్ అయితే..

గ్రామస్థుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్కీ డ్రా ద్వారా భీమేష్ సాధారణ విక్రయానికి మించిన లాభం పొందవచ్చని అంటున్నారు. ఉదాహరణకు, 1500 మంది రూ.10 వేలు చొప్పున చెల్లిస్తే మొత్తం రూ.1.5 కోట్లు వస్తాయి. ఇది స్థానిక మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ. అందుకే ఈ పద్ధతి అతడికి లాభదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

55
కొన్ని సందేహాలు కూడా..
Image Credit : Asianet News

కొన్ని సందేహాలు కూడా..

అయితే కొందరు ఈ ఆఫర్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రా తేదీ స్పష్టంగా ప్రకటించకపోవడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకపోవడం, భూమి హక్కుల బదిలీపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు అనేక మందిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే భీమేష్ మాత్రం నవంబర్ తొలి వారంలో డ్రా తేదీని ప్రకటిస్తానని చెబుతున్నాడు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
దీపావ‌ళి రోజు జ‌గ‌న్ వేసుకుంది మహిళల షూసేనా.? అసలు నిజం ఏంటీ.? వీటి ధర ఎంతంటే.?
Recommended image2
ప్ర‌య‌త్నిస్తే క‌చ్చితంగా గెలిచి తీరుతాం.. కథ పాతదే కానీ జీవితానికి సరిపోయే సందేశం ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved