MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana: న‌వంబ‌ర్ 3 నుంచి తెలంగాణ‌లో కాలేజీలు బంద్‌.. కార‌ణం ఏంటంటే.?

Telangana: న‌వంబ‌ర్ 3 నుంచి తెలంగాణ‌లో కాలేజీలు బంద్‌.. కార‌ణం ఏంటంటే.?

Telangana: తెలంగాణ‌లో ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలు మ‌రోసారి బంద్ పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌పై గ‌త‌కొన్ని రోజులుగా స‌ర్కారుకు, ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు మ‌ధ్య చ‌ర్చ‌లు న‌డుస్తోన్న విష‌యం తెలిసిందే. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 20 2025, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభుత్వం హామీ ఇచ్చినా నిధులు రాక ఆగ్రహం
Image Credit : AI

ప్రభుత్వం హామీ ఇచ్చినా నిధులు రాక ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. కొన్ని వారాల క్రితం బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ హామీతో తాత్కాలికంగా వెనక్కి త‌గ్గాయి. కానీ ఇప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బ‌కాయిలు చెల్లించ‌క‌పోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపడతామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ప్రకటించింది.

25
అక్టోబర్‌లోనే బంద్‌కు పిలుపు
Image Credit : Getty

అక్టోబర్‌లోనే బంద్‌కు పిలుపు

ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ప్రకారం, అక్టోబర్ 22న ప్రభుత్వం వద్ద అధికారిక నోటీసు సమర్పించనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 25న విద్యార్థి సంఘాలతో చర్చలు, 26న సర్వ సభ్య సమావేశాలు జరపనున్నారు. అలాగే నవంబర్ 1న రాజకీయ పార్టీల నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడతాయని హెచ్చరించారు.

Related Articles

Related image1
Silver Purity: మీరు కొన్న వెండి అస‌లా, న‌కిలీనా.? అయ‌స్కాంతం చెప్పేస్తుంది
Related image2
Post office: రెండేళ్ల‌లో రూ. 60 వేల వ‌డ్డీ.. ఈ స్కీమ్ గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే
35
పాత వివాదం మళ్లీ ముదురుతోంది
Image Credit : Getty

పాత వివాదం మళ్లీ ముదురుతోంది

సెప్టెంబర్ 15న ప్రారంభమైన బంద్ సమయంలో ప్రభుత్వం యాజమాన్యాన్ని చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చల్లో ప్రభుత్వం రెండు విడతల్లో రూ.600 కోట్ల చెల్లింపుకు అంగీకరించింది. మొదటి విడతగా రూ.600 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన మొత్తాన్ని దీపావళి నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో కాలేజీల యాజమాన్యాలు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి.

45
ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కాలేజీల ఏకగ్రీవ నిర్ణయం
Image Credit : our own

ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కాలేజీల ఏకగ్రీవ నిర్ణయం

ఇప్పటివరకు ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ ఈసారి ఇతర వృత్తి విద్యా కళాశాలలు కూడా బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించాయి. ప్రభుత్వం చెల్లింపుల్లో ఆలస్యం చేయడం వలన, పలు కళాశాలలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. విద్యార్థులకు సకాలంలో సౌకర్యాలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

55
రేవంత్ ప్రభుత్వంపై యాజమాన్యాల విమర్శ
Image Credit : X/revanth_anumula

రేవంత్ ప్రభుత్వంపై యాజమాన్యాల విమర్శ

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై రేవంత్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రైవేట్ కాలేజీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, కళాశాలల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని అంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బకాయిలను విడుదల చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ తప్పదని స్పష్టం చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
Silver Purity: మీరు కొన్న వెండి అస‌లా, న‌కిలీనా.? అయ‌స్కాంతం చెప్పేస్తుంది
Recommended image2
Post office: రెండేళ్ల‌లో రూ. 60 వేల వ‌డ్డీ.. ఈ స్కీమ్ గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved