MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌టికి వెళ్లండి.. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌టికి వెళ్లండి.. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు, తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు న‌మోద‌వుతున్నాయి. అయితే ఈ వ‌ర్షం ఇప్ప‌ట్లో త‌గ్గ‌ద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 20 2025, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు
Image Credit : ANI

తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు

తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో దక్షిణ, మధ్య జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. 

నగర రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనాల రద్దీతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది. బేగంపేట‌, మియాపూర్ ప్రాంతాల్లో కిలోమీట్ల‌ర మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సాయంత్రం స‌మ‌యంలో వ‌ర్షం కురుస్తుండ‌డంతో ఆఫీసులు, స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

25
మ‌రో ఐదు రోజుల పాటు వ‌ర్షాలు
Image Credit : Sandeep/X

మ‌రో ఐదు రోజుల పాటు వ‌ర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముంది. నేడు, పేరు (20, 21 తేదీల్లో) పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముండటంతో ముందుజాగ్రత్తగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వనపర్తి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related Articles

Related image1
Hyderabad: ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లోకి జిల్లాల బ‌స్సులు రాకుండా కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్
Related image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
35
జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిన
Image Credit : Mudit Jain /X

జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిన

వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో కాప్రా, ఉప్పల్, మల్కాజిగిరి, సరూర్‌నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌లు గంటల తరబడి కొనసాగాయి. వ‌ర్షం కురుస్తున్న స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇంటికే ప‌రిమితం కావాల‌ని పేర్కొంటున్నారు.

45
కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షం
Image Credit : ANI

కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షం

శ‌నిర‌వారం తెలంగాణ‌లో పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 11 సెం.మీ., రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 సెం.మీ., యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కాప్రా ప్రాంతంలో అత్యధికంగా 7.7 సెం.మీ., ఉప్పల్‌లో 6.8 సెం.మీ. వర్షం కురిసింది.

55
ఆంధ్రప్రదేశ్‌లోనూ..
Image Credit : ANI

ఆంధ్రప్రదేశ్‌లోనూ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కార‌ణంగా విశాఖపట్నం సహా ఉత్తరాంధ్రలో మోస్తరు వాన కుర‌వ‌నుంది. అలాగే సాయంత్రం కోస్తా, ఉత్తరాంధ్ర అంతటా మోస్తరు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. రాయ‌ల‌సీమ‌కు కూడా ఈరోజు (ఆదివారం) వ‌ర్ష సూచ‌న ఉంద‌ని అధికారులు తెలిపారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
Hyderabad: ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లోకి జిల్లాల బ‌స్సులు రాకుండా కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్
Recommended image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved