MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update : ఐఎండీ రెయిన్ అలర్ట్.. మరో 3 రోజులు.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..

Weather Update : ఐఎండీ రెయిన్ అలర్ట్.. మరో 3 రోజులు.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..

Andhra Pradesh Weather : తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాలకు మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని భారత వాతావరణ శాఖ (IMD)హెచ్చరిస్తోంది. తిరిగి వర్షాలు ఎప్పుడు మొదలవనున్నాయో తెలుసా?

1 Min read
Author : Rajesh K
Published : Aug 02 2025, 06:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాతావరణం ఎలా ఉంటుందంటే?
Image Credit : Getty

వాతావరణం ఎలా ఉంటుందంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాలకు మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని భారత వాతావరణ శాఖ (IMD)హెచ్చరిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తెలంగాణ మీదుగా ఉత్తర, పశ్చిమ దిశగా కదులుతూ నెమ్మదిగా బలహీనపడుతోంది. దీని ప్రభావంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసినా, తదుపరి కొన్ని రోజులు వర్షాలు తగ్గే అవకాశం ఉంది.

25
మేఘావృత వాతావరణం
Image Credit : Getty

మేఘావృత వాతావరణం

నేడు తెలుగు రాష్ట్రాల్లో తరచుగా మేఘావృత వాతావరణం, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. కానీ, తుపాను గాలులు గంటకు 40-50కిమీ వేగంతో వీయే అవకాశం ఉంది, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

Related Articles

Related image1
Telugu States Weather Updates : తెలుగు రైతుల ఎదురుచూపులకు ఈ మూడ్రోజుల్లో తెరపడేనా?
Related image2
Telangana Weather : మాన్ సూన్ బ్రేక్ ... తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఏంటి?
35
తెలంగాణ వాతావరణ పరిస్థితి
Image Credit : Getty

తెలంగాణ వాతావరణ పరిస్థితి

తెలంగాణలోని హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా. ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడి స్థితిలో ఉండే అవకాశముంది.

45
ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితి
Image Credit : Getty

ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితి

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఆగస్టులో 8 నుండి 15 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఇంకా, ఆగస్టు 5 లేదా 6నుంచి వర్షాలు పెరుగుతాయనీ, ఆగస్టు 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు వాతావరణ శాఖ వెల్లడించింది.

55
ముందస్తు జాగ్రత్తలు
Image Credit : Getty

ముందస్తు జాగ్రత్తలు

తాజా వర్షపాతం సూచనల నేపథ్యంలో ప్రజలు స్థానిక వాతావరణ శాఖ బులెటిన్లు గమనిస్తూ ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ దూరాల ప్రయాణాలకు వెంటనే బయలుదేరడం లేదా మానుకోవడం ఉత్తమం.   ముఖ్యంగా అలర్ట్ జోన్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేయడం బెటర్. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
వాతావరణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
Telugu States Weather Updates : తెలుగు రైతుల ఎదురుచూపులకు ఈ మూడ్రోజుల్లో తెరపడేనా?
Recommended image2
Telangana Weather : మాన్ సూన్ బ్రేక్ ... తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved