MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • వ‌ద‌ల‌ని ముసురు.. మ‌రో 5 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు

వ‌ద‌ల‌ని ముసురు.. మ‌రో 5 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు

గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ‌లో వ‌రుస‌గా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం కూడా తెలంగాణ వ్యాప్తంగా వాతావ‌రంణం చ‌ల్ల‌గా ఉంటుంద‌ని, వ‌చ్చే 5 రోజులు ప‌లు చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. వివ‌రాల్లోకి వెళితే.. 

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 22 2025, 07:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొన‌సాగుతోన్న రుతుపవన ద్రోణి
Image Credit : Getty

కొన‌సాగుతోన్న రుతుపవన ద్రోణి

తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు 1.5 కి.మీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 27 వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జల్లులు నమోదైనట్లు సమాచారం.

24
ఉరుములు, మెరుపులతో వర్షాలు
Image Credit : Getty

ఉరుములు, మెరుపులతో వర్షాలు

శుక్రవారం మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనథ్‌లో 2.95 సెం.మీ, ములుగు జిల్లా వాజేడులో 2.55, కన్నాయిగూడెంలో 2.33, గట్టులో 1.61, భూపాలపల్లి జిల్లా పలిమెలలో 1.60 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Related Articles

Related image1
ల‌క్ష‌ల్లో జీతం వ‌చ్చే కోర్సులు.. ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Related image2
హైదరాబాద్‌లో ఇంట‌ర్నెట్ వైర్ల‌ను ఎందుకు తెంపేస్తున్నారు? అస‌లేం జ‌రుగుతోంది?
34
వ‌చ్చే 5 రోజులు వ‌ర్షాలు
Image Credit : Gemini AI

వ‌చ్చే 5 రోజులు వ‌ర్షాలు

భారత వాతావరణశాఖ తాజా బులిటెన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్–తెలంగాణల్లో వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా. తమిళనాడు, యానాంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉండగా, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని IMD స్పష్టం చేసింది. కోస్తాంధ్రలో 25, 26 తేదీల్లో భారీ వర్షం, 26, 27 తేదీల్లో కర్ణాటక, కేరళల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.

44
బ‌ల‌మైన గాలులు
Image Credit : Gemini Ai

బ‌ల‌మైన గాలులు

అరేబియా సముద్రంలో గంటకు 47 కిలోమీటర్ల వేగంతో, బంగాళాఖాతంలో 39 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశాలు ఉన్నాయి. ఏపీలో గాలివేగం 13 కి.మీ, తెలంగాణలో 15 కి.మీగా ఉండ‌నుంది. ఉష్ణోగ్రతల పరంగా చూస్తే, ఏపీలో 31–34 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుండగా, తీర ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు, తిరుపతి ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉండ‌నుంది. తెలంగాణలో 29–31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
ల‌క్ష‌ల్లో జీతం వ‌చ్చే కోర్సులు.. ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Recommended image2
హైదరాబాద్‌లో ఇంట‌ర్నెట్ వైర్ల‌ను ఎందుకు తెంపేస్తున్నారు? అస‌లేం జ‌రుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved