MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad: ఇక్క‌డ పెట్టుబ‌డి పెడితే మీ ఫ్యూచ‌ర్ బిందాస్‌.. రూ. 15వేల‌కే గ‌జం, హైద‌రాబాద్‌కు అత్యంత చేరువలో

Hyderabad: ఇక్క‌డ పెట్టుబ‌డి పెడితే మీ ఫ్యూచ‌ర్ బిందాస్‌.. రూ. 15వేల‌కే గ‌జం, హైద‌రాబాద్‌కు అత్యంత చేరువలో

భూమిపై పెట్టుబ‌డి పెట్టిన వారు ఎప్ప‌టికీ న‌ష్ట‌పోర‌ని చెబుతుంటారు. అందుకే ఎక్క‌డో ఒక చోట కొంత మొత్తాన్ని కొనుగోలు చేయాల‌ని చూస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉండి, మంచి ఫ్యూచ‌ర్ ఉన్న ఓ ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 20 2025, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంద‌రి దృష్టి హైదరాబాద్ శివారులపైనే
Image Credit : Meta Ai

అంద‌రి దృష్టి హైదరాబాద్ శివారులపైనే

ఇప్పుడు మధ్య తరగతి వర్గాలు సొంత ఇల్లు కలల్ని హైదరాబాద్ నగర కేంద్రంలో కాకుండా శివారులో నెరవేర్చుకోవాల‌నే దిశగా అడుగులు వేస్తున్నారు. అధిక ఖర్చులు, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో నగరానికి కాస్త దూరంగా తక్కువ ఖర్చుతో స్థలాలు, ఇళ్లు లభించే ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై హైవేపై ఉన్న రుద్రారం గ్రామం కీలకంగా మారింది.

25
అభివృద్ధి చెందుతున్న ప్రాంతం
Image Credit : Getty

అభివృద్ధి చెందుతున్న ప్రాంతం

రుద్రారం గ్రామం పటాన్‌చెరును దాటి, సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే ముందు కనిపిస్తుంది. నేష‌న‌ల్ హైవేకి అనుకొని ఉండ‌డం ఈ ప్రాంతానికి క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే ఐఐటీ హైదరాబాద్, జాతీయ పరిశోధన సంస్థలు, విద్యాసంస్థలు చుట్టూ ఉండ‌డం కూడా ఈ ప్రాంతానికి భ‌విష్య‌త్తులో మంచి డిమాండ్ ఏర్ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారణంగా నివాస అవసరాలు, పెట్టుబడి అవకాశాలు పెరిగాయి. ప్రాజెక్టుల డెవలప్‌మెంట్ రేటు గణనీయంగా పెరిగింది.

Related Articles

Related image1
Fact: ఆవులు మాంసాహారం తింటే ఎక్కువ పాలు ఇస్తాయా.? అమెరికాలో ఎందుక‌లా చేస్తారు.?
Related image2
MMTS Train: హైద‌రాబాద్ టూ యాద‌గిరిగుట్ట‌.. రూ. 20 టికెట్‌, గంట‌లోపే ప్ర‌యాణం. ట్రాఫిక్ స‌మ‌స్య కూడా ఉండ‌దు
35
ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే
Image Credit : our own

ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే

రుద్రారం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్తృతంగా విస్తరిస్తోంది. ప్లాట్ల ధరలు చదరపు గజానికి రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు ఉన్నాయి. ఇది లొకేషన్, రోడ్డు వెడల్పు, లేఅవుట్‌కు HMDA లేదా DTCP అప్రూవల్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే హైవేకి అనుకొని ఉన్న ధ‌ర‌లు మాత్రం కాస్త ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక ఈ ప్రాంతంలో రూ. 20 ల‌క్ష‌ల పెట్టుబడితో సుమారు 120 గ‌జాల ప్లాట్‌ను సొంత చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

45
రీజిన‌ల్ రింగ్ రోడ్ రాక‌తో
Image Credit : Getty

రీజిన‌ల్ రింగ్ రోడ్ రాక‌తో

రుద్రారం ప్రాంత అభివృద్ధిలో కీలకంగా మారబోయే అంశం రీజినల్ రింగ్ రోడ్ (RRR). ఇది సంగారెడ్డి, నర్సాపూర్ వంటి ప్రధాన ప్రాంతాలను కలుపుతూ రుద్రారం ద్వారా వెళ్లనుంది. రహదారి అనుసంధానం మెరుగవడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు మెరుగుపడి, భవిష్యత్‌లో స్థలాల విలువలు భారీగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే గత ఏడాదిలో ధరలు సగటున 10% నుంచి 30% వరకు పెరిగాయని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి.

55
రుద్రారంలో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిదేనా.?
Image Credit : X/Hyderabad1st

రుద్రారంలో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిదేనా.?

సాధారణంగా, ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని ఇళ్లు తీసుకోవడం వల్ల మిగతా ప్రాంతాల కంటే తక్కువ ముడిపడుతుంది. కానీ రుద్రారం ప్రత్యేకత మాత్రం అదే కాదు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు దగ్గరగా ఉండడం, రింగ్ రోడ్ అనుసంధానం వంటి అంశాలు దీన్ని పెట్టుబడికి అనుకూలంగా మార్చుతున్నాయి. భ‌విష్య‌త్తులో నివాస అవ‌స‌రానికి ఉప‌యోగించుకోవ‌డానికి లేదా విక్ర‌యించ‌డానికి ఇక్క‌డ పెట్టుబ‌డి పెట్ట‌డం సుర‌క్షిత‌మైన ఎంపిక‌గా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
Fact: ఆవులు మాంసాహారం తింటే ఎక్కువ పాలు ఇస్తాయా.? అమెరికాలో ఎందుక‌లా చేస్తారు.?
Recommended image2
MMTS Train: హైద‌రాబాద్ టూ యాద‌గిరిగుట్ట‌.. రూ. 20 టికెట్‌, గంట‌లోపే ప్ర‌యాణం. ట్రాఫిక్ స‌మ‌స్య కూడా ఉండ‌దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved