MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Weather Alert: బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. మ‌ళ్లీ వ‌ర్షాలు. వ‌చ్చే వారం రోజులూ గ‌డ్డ‌క‌ట్టే చ‌లి ఖాయం

IMD Weather Alert: బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. మ‌ళ్లీ వ‌ర్షాలు. వ‌చ్చే వారం రోజులూ గ‌డ్డ‌క‌ట్టే చ‌లి ఖాయం

IMD Weather Alert: వాతావ‌ర‌ణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాతావ‌ర‌ణ శాఖ అధికారులు ముందు నుంచి చెబుతున్నట్లు ఈసారి చ‌లి ఓ రేంజ్‌లో ఉండ‌నుంది. కాగా మ‌రోసారి బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 13 2025, 06:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉత్తర తెలంగాణను వణికిస్తున్న చలి
Image Credit : Getty

ఉత్తర తెలంగాణను వణికిస్తున్న చలి

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతూ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 10.2°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత కఠినంగా ఉండగా, ఉదయం పొగమంచు, రాత్రి చలిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని అంచనా. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 4–5°C తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, నల్లగొండ‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, వరంగల్ వంటి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా నమోదవుతోంది.

25
ఈ సీజన్‌లో మొదటిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
Image Credit : Gemini AI

ఈ సీజన్‌లో మొదటిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగా పూర్‌లో అత్యల్పంగా 8.7°C నమోదై ఈ సీజన్‌లో తొలిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను ప్రభావం ముగిసిన కొద్ది రోజుల్లోనే చలి పెరగడంతో ప్రజలు భిన్న వాతావరణానికి అలవాటు పడలేక ఇబ్బంది పడుతున్నారు. జలుబు, గొంతునొప్పి, దగ్గు, జ్వరంతో ఆసుపత్రులకు వెళ్తున్న‌ వారి సంఖ్య పెరుగుతోంది.

Related Articles

Related image1
వాడి ప‌డేసిన కొబ్బ‌రి బోండాల‌తో కోట్లు కురుస్తాయి.. లైఫ్ సెట్ అయ్యే బిజినెస్
Related image2
5 గ్ర‌హాల్లో కీలక మార్పులు... ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే. కొందరికి మాత్రం ఇబ్బందులు
35
వైద్యారోగ్యశాఖ హెచ్చరిక
Image Credit : Asianet News

వైద్యారోగ్యశాఖ హెచ్చరిక

చలి తీవ్రత నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. డైరెక్టర్‌ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. చలి కారణంగా రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ వంటి వ్యాధులు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు. చలిని తట్టుకునేలా వెచ్చని దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీళ్లు తాగాల‌ని సూచిస్తున్నారు.

45
ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం
Image Credit : social media

ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం

తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నవంబర్ 13 నుంచి 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు మరింత బలపడతాయని అంచ‌నా వేశారు. ఉత్తర, మధ్య, పశ్చిమ జిల్లాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు ఉష్ణోగ్రతలు 8–10°C వరకు పడిపోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11–13°C వరకు నమోదయ్యే అవకాశముంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3°C తక్కువగా ఉండే అవకాశం ఉంది.

55
బంగాళాఖాతంలో అల్పపీడనం
Image Credit : PTI

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో 17, 18 తేదీల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15–17°C మధ్య కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
వాడి ప‌డేసిన కొబ్బ‌రి బోండాల‌తో కోట్లు కురుస్తాయి.. లైఫ్ సెట్ అయ్యే బిజినెస్
Recommended image2
5 గ్ర‌హాల్లో కీలక మార్పులు... ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే. కొందరికి మాత్రం ఇబ్బందులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved