MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఎల్ నినో ఎఫెక్ట్ .. ఫిబ్రవరిలో అకాల వర్షాలు తప్పవా..?

IMD Rain Alert : ఎల్ నినో ఎఫెక్ట్ .. ఫిబ్రవరిలో అకాల వర్షాలు తప్పవా..?

Weather Alert : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలేమీ లేవు… ప్రశాంత వాతావరణం ఉంది. కానీ మరికొద్దిరోజుల్లో అకాల వర్షాలు మొదలవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాలకు కారణమేంటో తెలుసా..?  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 03 2026, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మళ్లీ వర్షాలు..?
Image Credit : X/APSDMA

మళ్లీ వర్షాలు..?

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలేమీ లేవు... కానీ రాబోయే రోజుల్లో అకాల వర్షాలుంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు వాతావరణం కాస్త చల్లగానే ఉండి అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో వేసవిలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

25
ఈ నెలలోనే వర్షాలు..
Image Credit : Getty

ఈ నెలలోనే వర్షాలు..

ఈ ఫిబ్రవరి సెంకండ్ వీక్ నుండి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... వాతావరణం కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి పెద్దగా వేడి అనిపించకపోవచ్చు. ఏప్రిల్ వరకు ఇలా సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయని... తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోతాయని తెలిపారు. సమ్మర్ సెకండ్ హాఫ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని... భరించలేని వేడి, ఉక్కపోత ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మర్ 2023 ఎండలను తలపిస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.

Related Articles

Related image1
Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...
Related image2
Weather Report: ఇక కాస్కోండి.. ఒక్క‌సారిగా మారుతోన్న వాతావ‌ర‌ణం.
35
ఏపీలో ఆహ్లాదరక వాతావరణం
Image Credit : @chetansabnis/X

ఏపీలో ఆహ్లాదరక వాతావరణం

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి, పొగమంచు కొనసాగుతుండగా... మధ్యాహ్నం ఎండలు కాస్తున్నాయి. అత్యల్పంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ముఖ్యంగా అరకు, చింతపల్లి ప్రాంతాల్లో ప్రస్తుతం ఆహ్లాదకర వాతావరణం ఉంది. అటు పూర్తిగా చలి, ఇటు పూర్తిగా వేడిగా కాకుండా మధ్యస్థంగా పర్యాటకానికి అనుకూల వాతావరణం ఉంది. ఫిబ్రవరి సెకండాఫ్ నుండి అకాల వర్షాలుంటాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

45
తెలంగాాణ వాతావరణం
Image Credit : Generated by google gemini AI

తెలంగాాణ వాతావరణం

తెలంగాణ విషయానికి వస్తే చలి తీవ్రత తగ్గింది... ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఏం లేవు. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 13.7, మెదక్ లో 14 డిగ్రీలు నమోదవుతోంది. అలాగే హన్మకొండలొ 17, నిజామాబాద్ లో 17.6, రామగుండంలో 17.6, నల్గొండలొ 18.4, మహబూబ్ నగర్ లో 17.7, ఖమ్మంలో 18.6, భద్రాచలంలో 20.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ లో 32.3 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి.

55
హైదరాబాద్ వాతావరణం
Image Credit : Getty

హైదరాబాద్ వాతావరణం

హైదరాబాద్ లో కూడా చలి సాధారణ స్థాయిలోనే ఉంది... అత్యల్పంగా పటాన్ చెరులో 13.2 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. ఇక రాజేంద్ర నగర్ లో 14, హయత్ నగర్ లో 14.6, బేగంపేటలో 17.5, హకీంపేట 18.1, దుండిగల్ 17.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా హకీంపేటలో 29.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...
Recommended image2
Weather Report: ఇక కాస్కోండి.. ఒక్క‌సారిగా మారుతోన్న వాతావ‌ర‌ణం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved