MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert: బంగాళఖాతంలో అల్పపీడనంతో పాటు ద్రోణీ.. ఇటు వర్షాలు, అటు చలి. జాగ్రత్త సుమీ..

IMD Rain Alert: బంగాళఖాతంలో అల్పపీడనంతో పాటు ద్రోణీ.. ఇటు వర్షాలు, అటు చలి. జాగ్రత్త సుమీ..

IMD Rain Alert: మొన్న‌టి వ‌ర్షాల‌తో ఇబ్బందులు ప‌డ్డ తెలుగు ప్ర‌జ‌లు ఇప్పుడు చ‌లికి సిద్ధం కావాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. వ‌చ్చే మూడు రోజులు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 09 2025, 06:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వాతావరణ మార్పులు
Image Credit : Generated by google gemini AI

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వాతావరణ మార్పులు

మొంథా తుఫాన్ ప్రభావం తగ్గినా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మార్పు దిశగా సాగుతోంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, వచ్చే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అదేవిధంగా, దిగువ ట్రోపోస్థాయిలో ఉత్తర–ఈశాన్య గాలులు వీస్తుండటంతో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది.

25
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల అవకాశం
Image Credit : Generated by google gemini AI

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల అవకాశం

వాతావరణ శాఖ ప్రకారం, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో శనివారం నుంచి సోమవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా & యానాం: జల్లులు, మోస్తరు వర్షాలు రెండు రోజుల పాటు నమోదయ్యే అవకాశం.

దక్షిణ కోస్తా: మధ్యాహ్నం నుంచి రాత్రివేళ వరకు కొన్ని చోట్ల జల్లులు పడవచ్చు.

రాయలసీమ: తేలికపాటి వర్షాలు, చల్లని గాలులు కొనసాగుతాయని IMD తెలిపింది.

వీటి ప్రభావంతో పగటిపూట ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గి, రాత్రిపూట చలి మరింత పెరగవచ్చని అంచనా.

Related Articles

Related image1
మందు బాబుల‌కు ఈ ప్ర‌దేశాలు స్వ‌ర్గం.. త‌క్కువ ధ‌ర‌కు ఆల్క‌హాల్ దొరికే ప్రాంతాలివే
Related image2
ఒకే గ‌దిలో అమ్మాయి, అబ్బాయి.. ఇష్టారాజ్యంగా ఉండొచ్చు. హైద‌రాబాద్‌లో పెరుగుతోన్న‌ కో లివింగ్ క‌ల్చ‌ర్‌
35
తెలంగాణలో చలి పంజా
Image Credit : social media

తెలంగాణలో చలి పంజా

తెలంగాణ రాష్ట్రంలో వర్షాల దశ ముగిసిపోయి చలి మొదలైంది. రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుండి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నవంబర్ 10 తర్వాత చలి మరింతగా పెరుగుతుందని IMD హెచ్చరించింది. అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడే అవకాశం ఉందని తెలిపింది.

45
బంగాళాఖాతం ప్రభావం
Image Credit : Getty

బంగాళాఖాతం ప్రభావం

ప్రస్తుతం బంగాళాఖాతం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. దీంతో పగటిపూట ఎండ కొనసాగుతుండగా, రాత్రివేళల్లో చలి పెరుగుతోంది. ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో చలి ఒక్కసారిగా పెరగడంతో, ఆ ప్రభావం కోస్తా ప్రాంతాలపై కూడా పడుతోంది. ఇక ఈ నెల రెండో వారం తర్వాత బంగాళాఖాతం లోతట్టు ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. దాని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

55
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Getty

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల నేపథ్యంలో చలి తీవ్రత పెరుగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు ధరించాలి.

శరీరాన్ని వేడి ఉంచేందుకు గోరువెచ్చని నీరు, సూప్‌లు, పోషకాహారం తీసుకోవాలి.

వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసర ప‌రిస్థితుల్లో త‌ప్ప‌, రాత్రి బయటకు వెళ్లకూడదు.

చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్‌లు వాడాలి.

రైతులు పంటలను చలిగాలుల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాలి.

వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం, రానున్న రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు చేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
మందు బాబుల‌కు ఈ ప్ర‌దేశాలు స్వ‌ర్గం.. త‌క్కువ ధ‌ర‌కు ఆల్క‌హాల్ దొరికే ప్రాంతాలివే
Recommended image2
ఒకే గ‌దిలో అమ్మాయి, అబ్బాయి.. ఇష్టారాజ్యంగా ఉండొచ్చు. హైద‌రాబాద్‌లో పెరుగుతోన్న‌ కో లివింగ్ క‌ల్చ‌ర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved