MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తీవ్ర వాయుగుండంగా దిత్వా.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్

తీవ్ర వాయుగుండంగా దిత్వా.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్

IMD Rain Alert: భారీ విద్వంసాన్ని సృష్టిస్తుంది అని అనుకున్న దిత్వా తుపాను స్థాయి కోల్పోయి తీవ్ర వాయుగుండంగా మారింది. తుపాను అవ‌కాశం త‌గ్గినా వాయుగుండం కార‌ణంగా కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 02 2025, 06:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బంగాళాఖాతంలో దిత్వా బలహీనత
Image Credit : Getty

బంగాళాఖాతంలో దిత్వా బలహీనత

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా తీరాలకు సమీపంగా కొనసాగిన ‘దిత్వా’ తుపాను ఆదివారం సాయంత్రం బల హీనపడింది. ఇది తుపాను స్థాయి కోల్పోయి తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది.

26
చెన్నై, నెల్లూరు దిశలో కదలిక
Image Credit : stockPhoto

చెన్నై, నెల్లూరు దిశలో కదలిక

ఆదివారం రాత్రి నుంచి ఉత్తరదిశలో కదిలిన ఈ తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో మరింతగా కేంద్రీకృతమైంది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు దక్షిణ-ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది.

Related Articles

Related image1
వింట‌ర్‌లో ర‌మ్ తాగితే శ‌రీరం వేడేక్కుతుందా.? ఇందులో నిజ‌మెంతంటే..
Related image2
చాణక్య నీతి ప్రకారం.. ఈ 5 గుణాలున్న మహిళలు ఇంటికి నిజమైన లక్ష్మీ
36
మరింత బలహీనప‌డే అవ‌కాశం
Image Credit : X

మరింత బలహీనప‌డే అవ‌కాశం

వ‌చ్చే 12 గంటల్లో ఈ వాయుగుండం తీరం వెంట ప్రయాణిస్తూ మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా తీరాల సమీపంలో ఇది సాధారణ వాయుగుండ స్థాయికి చేరుతుందని తెలిపింది. తదుపరి దశలో చెన్నై తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో చేరుకునే అవకాశముందని పేర్కొంది.

46
ఈరోజు వ‌ర్షాలు
Image Credit : stockPhoto

ఈరోజు వ‌ర్షాలు

దిత్వా ప్రభావంతో మంగళవారం (ఈరోజు) తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే బుధవారం నుంచి పరిస్థితులు పూర్తిగా పొడిగా మారుతాయని అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు.

ఇక గడిచిన 24 గంటల్లో హనుమకొండ, నిర్మల్‌, ఖమ్మం, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. హనుమకొండలోని కొండపర్తిలో 5.8 మి.మీ, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో 3.3 మి.మీ, చర్లలో 3.0 మి.మీ, నిర్మల్‌ వాడ్యాల్‌లో 2.8 మి.మీ, బూర్గంపాడులో 2.3 మి.మీ, కామారెడ్డి మహ్మద్‌నగర్‌లో 2.1 మి.మీ వర్షం కురిసింది.

56
ఏపీలోనూ వర్షాలు
Image Credit : Generated by google gemini AI

ఏపీలోనూ వర్షాలు

దిత్వా తుపాను బలహీనపడినా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అన్నారు. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

66
పెరిగిన చ‌లి తీవ్ర‌త
Image Credit : Asianet News

పెరిగిన చ‌లి తీవ్ర‌త

దిత్వా ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర దిశ గాలులు బలంగా వీచుతున్నాయి. ఆదిలాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, నిజామాబాద్‌, కుమ్రంభీం జిల్లాల్లో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు పడిపోయాయి. మిగతా జిల్లాల్లో కూడా రాత్రి చలి స్వల్పంగా పెరిగింది. చలిగాలులు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
వింట‌ర్‌లో ర‌మ్ తాగితే శ‌రీరం వేడేక్కుతుందా.? ఇందులో నిజ‌మెంతంటే..
Recommended image2
చాణక్య నీతి ప్రకారం.. ఈ 5 గుణాలున్న మహిళలు ఇంటికి నిజమైన లక్ష్మీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved