MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • పాపం పండింది.. ఐబొమ్మ ర‌వికి ఏన్నేళ్ల శిక్ష ప‌డ‌నుందో తెలుసా?

పాపం పండింది.. ఐబొమ్మ ర‌వికి ఏన్నేళ్ల శిక్ష ప‌డ‌నుందో తెలుసా?

iBomma Ravi: ఐబొమ్మ ర‌వి కేసు విచార‌ణ‌లో ఎన్నో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. దమ్ముంటే ప‌ట్టుకోండ‌ని స‌వాల్ విసిరి ఇప్పుడు తగిన మూల్యం చెల్లిస్తున్నాడు. కాగా ర‌వికి ఎలాంటి శిక్ష ప‌డ‌నుంది.? అస‌లు చట్టం ఏం చెబుతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 18 2025, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భార‌త పౌర‌స‌త్వం వ‌దులుకున్న ర‌వి
Image Credit : Asianet News

భార‌త పౌర‌స‌త్వం వ‌దులుకున్న ర‌వి

ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ ర‌వి.. 2022లో భారత పౌరసత్వం వ‌దులుకున్నాడు. ఆ తర్వాత సుమారు 80 లక్షలు చెల్లించి కరీబియన్ దేశంలో పౌరసత్వం తీసుకున్నాడు. అప్పటి నుంచి అక్కడే జీవించాడు. ఆ ప్రాంతంలో లగ్జరీ జీవితం గడిపాడని పోలీసులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్, విశాఖలో ఉన్న తన ఆస్తులు అమ్మాలని నిర్ణయించాడు. ఆ పని కోసం మూడురోజుల క్రితం హైదరాబాద్‌కి వచ్చాడు. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే సమాచారం అందుకున్న పోలీసులు ర‌విని అదుపులోకి తీసుకున్నారు.

25
iBomma ఎలా నడిపాడు?
Image Credit : newsmeter

iBomma ఎలా నడిపాడు?

రవి టెక్నాలజీలో మంచి నిపుణుడు. DRM హ్యాకింగ్‌తో ఓటిటి కంటెంట్ కాపీ చేసేవాడు. iBomma అనే వెబ్‌సైట్‌ను రూపొందించి లక్షలాది మందికి అందుబాటులో ఉంచాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం రవి దాదాపు 60 పైరసీ సైట్లు నడిపాడు. ఈ అక్రమ పనితో వందల కోట్లు సంపాదించాడు. ఆ డబ్బుతో కరీబియన్‌లో భారీ ఖర్చులు పెట్టాడు.

Related Articles

Related image1
ibomma Ravi: ఐబొమ్మ రవి ఇలా మారడానికి ఆ అవమానమే కారణమా.? భార్య, అత్త చేసిన పనికి..
Related image2
పెళ్లికి ముందే శారీరకంగా కలవడం సహజంగా మారింది, దీనిని క్రిమినల్ కేసుగా చెప్పలేం: హైకోర్టు
35
హైదరాబాద్ వచ్చిన వెంటనే అరెస్ట్
Image Credit : Asianet News

హైదరాబాద్ వచ్చిన వెంటనే అరెస్ట్

నవంబర్ 15న నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రవిని కుకట్‌పల్లి ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉండి మొత్తం పైరసీ నెట్‌వర్క్ నడిపినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. స్థానికంగా కొంతమంది అతనికి సహాయం చేశారని, ఇప్పటికే వారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

45
ర‌వికి ఎలాంటి శిక్ష ప‌డ‌నుంది.?
Image Credit : Asianet News

ర‌వికి ఎలాంటి శిక్ష ప‌డ‌నుంది.?

రవిపై వేసే ప్రధాన కేసులు ఇవి:

1) కాపీరైట్ చట్టం సెక్షన్లు

Copyright Act 1957 – Sections 63, 63A

ఒరిజినల్ కంటెంట్‌ను దొంగిలించడం, అక్రమంగా పంచడం.

శిక్ష: 6 నెలలు నుంచి 3 సంవత్సరాలు జైలు.

జరిమానా: రూ. 50,000 నుంచి రూ. 2 లక్షల వరకు.

2) IT Act సెక్షన్లు

Section 66, 66B, 66C, 66D

హ్యాకింగ్, డేటా దోపిడీ, అనధికారిక యాక్సెస్.

శిక్ష: 3–7 ఏళ్ల జైలు.

3) IPC సెక్షన్లు

అబద్ధపు సమాచారంతో ఆదాయం పొందడం.

దోపిడీకి సహాయం చేసిన సహకారులు కూడా IPC సెక్షన్లలోకి వస్తారు.

4) మనీ లాండరింగ్ (ED విచారణ వచ్చే అవకాశం)

పైరసీ ద్వారా సంపాదించిన డబ్బును విదేశాలకు పంపితే:

PMLA చట్టం ప్రకారం ED కేసు పెట్టవచ్చు.

ఏళ్ల తరబడి విచారణ సాగుతుంది.

అక్రమ ఆస్తుల జప్తు చేసే అవకాశం ఉంటుంది.

55
పోలీసులు ఇక ఏం చేయనున్నారు?
Image Credit : Asianet News

పోలీసులు ఇక ఏం చేయనున్నారు?

పోలీసుల తదుపరి చర్యలు ఇలా ఉంటాయి:

* రవి నడిపిన మొత్తం నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడం.

* iBommaకి సంబంధించి ఉన్న సర్వర్లు, డొమెయిన్‌లు ఎవరు ఇచ్చారో గుర్తించడం.

* రవి సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఫాలో చేయడం.

* విదేశీ సహకారం ఉంటే ఇంటర్‌పోల్ సహాయం కోరడం.

* OTT కంపెనీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కొత్త కేసులు నమోదు చేసే అవకాశం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
వినోదం
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
ibomma Ravi: ఐబొమ్మ రవి ఇలా మారడానికి ఆ అవమానమే కారణమా.? భార్య, అత్త చేసిన పనికి..
Recommended image2
పెళ్లికి ముందే శారీరకంగా కలవడం సహజంగా మారింది, దీనిని క్రిమినల్ కేసుగా చెప్పలేం: హైకోర్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved