MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather : హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రత, వణికిస్తున్న చలి.. ఏ ప్రాంతంలో, ఎంత నమోదయ్యిందో తెలుసా?

Weather : హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రత, వణికిస్తున్న చలి.. ఏ ప్రాంతంలో, ఎంత నమోదయ్యిందో తెలుసా?

Cold Weather : వర్షకాలం ముగుస్తుండటంతో మెల్లిగా చలి పంజా విసురుతోంది. ఆరంభంలోనే ఉష్ణోగ్రతల పడిపోతూ చలితీవ్రత పెరుగుతోంది… తెలంగాణలో అత్యల్ఫ ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లో నమోదయ్యాయి.. ఎంతో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 11 2025, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల్లో చలికాలం షురూ...
Image Credit : X/Meteolorgical Centre

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం షురూ...

Cold Weather : ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దేశం నుండి నిష్క్రమిస్తున్నాయి... అంటే టెక్నికల్ గా వర్షాకాలం ముగిసినట్లే. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తుండటంతో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి... ఇదే సమయంలో చలి ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మెల్లిగా పడిపోతున్నాయి... ఆసక్తికర విషయం ఏమిటంటే పల్లెప్రాంతాల్లో కాకుండా పట్టణాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదై చలి ఎక్కువగా ఉంటోంది.

26
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లోనే..
Image Credit : Hyderabad University Website

తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లోనే..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శుక్రవారం (అక్టోబర్ 10) రాష్ట్రంలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం  తెలిపింది. పటాన్ చెరు పరిధిలోని బిహెచ్ఈఎల్, ఈక్రిశాట్ ప్రాంతాల్లో 19.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయయ్యింది. ఆ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ లో 19.3 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20-25 డిగ్రీ సెల్సియస్ లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికం మాత్రం ఆదిలాబాద్ లో 33.8 డిగ్రీ సెల్సియస్.

Related Articles

Related image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే
Related image2
Rain Alert : తెలుగు రాష్ట్రాలను వీడని వానలు... ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సం
36
ఆంధ్ర ప్రదేశ్ ను వణికిస్తున్న చలి
Image Credit : twitter

ఆంధ్ర ప్రదేశ్ ను వణికిస్తున్న చలి

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వణికించడం ప్రారంభించింది. దీంతో ప్రజలు ఇప్పటివరకు వర్షాల వల్ల అప్రమత్తంగా ఉంటే ఇప్పుడు చలి నుండి అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. చలికాలంలో శ్వాస, చర్మ సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉండాలని వాతావరణ, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

46
ఈ జిల్లాల్లో నేడు వర్షాలు
Image Credit : X/APSDMA

ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

ఇక వర్షాల విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆంధ్ర ప్రదేశ్ లో మెల్లిగా విస్తరిస్తోంది... ఇప్పటికే ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఇది విస్తరించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం(అక్టోబర్ 11న) అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ వర్షాలకు పిడుగులు, ఈదురుగాలులు తోడయి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని ప్రఖర్ జైన్ సూచించారు.

56
ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే...
Image Credit : Hyderabad Rains/X

ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే...

శుక్రవారం (అక్టోబర్ 10న) ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగాయి. సాయంత్రం 5 గంటలకు అత్యధికంగా కోనసీమ జిల్లా నగరంలో 46 మిమీ, మలికిపురంలో 36.2మిమీ, ప్రకాశం జిల్లా నర్సింగోలులో 27మిమీ, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 25.5మిమీ వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో మరికొన్నిచోట్ల కూడా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయని APSDMA తెలిపింది.

66
తెలంగాణను వీడని వానలు
Image Credit : X/Hyderabad Traffic Police

తెలంగాణను వీడని వానలు

తెలంగాణ వర్షాల విషయానికి వస్తే ద్రోణి, ఉపరతల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ(అక్టోబర్ 11) వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లోనే కాదు మరికొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే
Recommended image2
Rain Alert : తెలుగు రాష్ట్రాలను వీడని వానలు... ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved