MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం

హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. కోర్ సిటీ ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు నేరుగా చేరేలా ఎలివేటెడ్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్ వేలు రూపుదిద్దుకుంటున్నాయి.  

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 23 2025, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోర్ సిటీ నుంచి ఔటర్‌కు కొత్త దారులు
Image Credit : Generated by google gemini AI

కోర్ సిటీ నుంచి ఔటర్‌కు కొత్త దారులు

ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, మాసాబ్‌ట్యాంక్, మెహదీపట్నం, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరడం ప్రస్తుతం పెద్ద సవాల్. ఇప్పటికే ఉన్న రోడ్లు ట్రాఫిక్‌తో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలివేటెడ్ కారిడార్లు నేరుగా ఔటర్‌కు కనెక్టివిటీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడం వల్ల నగర కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలకూ డిమాండ్ పెరగనుంది.

25
బంజారాహిల్స్–గచ్చిబౌలి ఎక్స్‌ప్రెస్ వే
Image Credit : Getty

బంజారాహిల్స్–గచ్చిబౌలి ఎక్స్‌ప్రెస్ వే

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ-హబ్ ప్రాంతం మీదుగా గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ వరకు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే ప్రతిపాదన వచ్చింది. దాదాపు పది కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణం జరగనుంది. ఇందులో ఎక్కువ భాగం స్టీల్ బ్రిడ్జి రూపంలో ఉండనుంది. ఈ మార్గం ఐటీ కారిడార్‌కు వేగంగా చేరే అవకాశాన్నిక‌ల్పిస్తాయి.

Related Articles

Related image1
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Related image2
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
35
గండిపేట - కాండూట్ రోడ్
Image Credit : Google Gemini AI

గండిపేట - కాండూట్ రోడ్

మెహదీపట్నం నుంచి ఔటర్ వైపు వెళ్లే ఓల్డ్‌ ముంబై హైవేపై ట్రాఫిక్ పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా షేక్‌పేట నాలా నుంచి గండిపేట కాండూట్ వెంట మణికొండ దిశగా కొత్త రోడ్ అభివృద్ధి చేయనున్నారు. 200 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేప‌ట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ దాదాపు ఏడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డిజైన్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మణికొండ, అల్కాపూర్, నర్సింగి పరిసరాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.

45
శామీర్‌పేట కారిడార్‌
Image Credit : Google Gemini AI

శామీర్‌పేట కారిడార్‌

సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు 18.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ బాధ్యత బెకెమ్ ఇన్‌ఫ్రాకు దక్కింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.2,232 కోట్లు. ఇందులో ఆరు లైన్ల ప్లైఓవర్, గ్రౌండ్ లెవల్ రోడ్, హకీంపేట వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటాయి. ఈ మార్గం సిద్ధమైతే కరీంనగర్, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ వైపు నుంచి నగరానికి సులువుగా చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా శామీర్‌పేట, ఆల్వాల్, మేడ్చల్ ప్రాంతాల్లో ప్లాట్లు, విల్లా ప్రాజెక్టుల ధరలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

55
ఎలివేటెడ్ కారిడార్లతో రియల్ ఎస్టేట్ బూమ్
Image Credit : Google Gemini AI

ఎలివేటెడ్ కారిడార్లతో రియల్ ఎస్టేట్ బూమ్

ఎలివేటెడ్ కారిడార్లు కేవలం రవాణా సదుపాయాలు మాత్రమే కాదు. ఇవి నగర విస్తరణకు దిశానిర్దేశం చేసే సాధనాలు. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కొత్త పెట్టుబడుల కేంద్రాలుగా మారుతున్నాయి. ట్రావెల్ టైమ్ తగ్గడం, ఐటీ హబ్‌లకు వేగంగా చేరడం, లాజిస్టిక్స్ సౌలభ్యం పెరగడం వల్ల డెవలపర్లు ఈ మార్గాల చుట్టూ భారీ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ కారిడార్ల వెంట భూముల ధరలు, అద్దెలు, కమర్షియల్ స్పేస్ విలువలు వేగంగా పెరిగే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image2
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image3
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Related Stories
Recommended image1
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Recommended image2
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved