MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Cafe Niloufer: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మించిన జీతం.. నిలోఫర్ లో ఉద్యోగం చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఇదే

Cafe Niloufer: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మించిన జీతం.. నిలోఫర్ లో ఉద్యోగం చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఇదే

Cafe Niloufer: హైదరాబాద్ లోని కేప్ నిలోఫర్ కేవలం టీ, బిస్కెట్లకు మాత్రమే కాదు, అక్కడ పనిచేసే ఉద్యోగుల క్రమశిక్షణ, సేవాభావానికి కూడా పెట్టింది పేరు. మరి, అక్కడ పనిచేసే ఉద్యోగుల జీతాలు ఎలా ఉంటాయో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 15 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కేఫ్ నిలోఫర్..
Image Credit : Gemini ai

కేఫ్ నిలోఫర్..

హైదరాబాద్ లో చార్మినార్ ఎంత ఫేమసో.. నిలోఫర్ కేప్ కూడా అంతే ఫేమస్. సామాన్యులకు అందుబాటు ధరలో చాయ్, బిస్కెట్, మస్కా బన్ లాంటి ఎన్నో ఫుడ్స్ అందిస్తోంది ఈ కేప్. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే.. ఈ కేఫ్ ఎప్పుడు చూసినా జనాలతో కలకలలాడుతూ ఉంటుంది. నిత్యం వేలాది మంది కష్టమర్లతో రద్దీగా ఉండే ఈ నిలోఫర్ కేఫ్ లో వందలాది మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పని చేస్తుంటారు. అసలు.. ఇక్కడ జీతాలు ఎలా ఉంటాయి? ఏయే హోదాల్లో వారికి అవకాశాలు ఉంటాయి? ఏం చదివితే ఎలాంటి ఉద్యోగం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం...

23
 నిలోఫర్ లో పనిచేసే స్టాఫ్ జీతాలు వారి అనుభవం, బాధ్యతలపై ఆధారపడి ఉంటాయి..
Image Credit : X/RizGandotra

నిలోఫర్ లో పనిచేసే స్టాఫ్ జీతాలు వారి అనుభవం, బాధ్యతలపై ఆధారపడి ఉంటాయి..

నిలోఫర్ కేఫలో ఉద్యోగం అంటే... చాలా తక్కువ అని భావించే వారు చాలా మంది ఉంటారు. కానీ.. ఈ కేఫ్ లో పని చేస్తూ సంవత్సరానికి 60లక్షలకు పైగా జీతం అందుకుంటున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని నిలోఫర్ కేఫ్ యాజమాన్యం స్వయంగా ప్రకటించింది. ఐటీ ఉద్యోగులకు కూడా ఈ రోజుల్లో అంత జీతం రావడం లేదు. అయితే.. అందరికీ ఇలాంటి జీతమే రాదు. కానీ.. అంత జీతం అందుకుంటున్నవారు కూడా కేఫ్ లో ఉన్నారు. సాధారణ ఉద్యోగులకు వారు చేస్తున్న పని ఆధారంగా జీతం, ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.

సర్వీస్ విభాగం: ఇక్కడ కస్టమర్లకు రిసీవ్ చేసుకున్న స్టీవార్డ్స్, సర్వర్లకు నెలకు రూ.12 వేల నుంచి 16 వేల వరకు జీతం ఉంటుంది. సీనియర్ సర్వర్లు అయితే నెలకు రూ.17వేల వరకు జీతం అందుకుంటారు.

కిచెన్ విభాగం: రుచికరమైన వంటకాలు, చాయ్ తయారు చేసే చెఫ్స్, వారి సహాయకులకు నెలకు రూ.16వేలు నుంచి 20 వేల మధ్యలో జీతం ఉంటుంది.

నిర్వహణ విభాగం : కేఫెను పర్యవేక్షించే ఫ్లోర్ మేనేజర్లు నెలకు రూ.22వేల నుంచి రూ.25 వేలకు వరకు, ఇక మార్కెటింగ్ లేదా అడ్మిషన్ విభాగాల్లో ఉండే వారు సుమారు రూ.35వేలపైన సంపాదిస్తున్నారు.

కౌంటర్ స్టాఫ్.. బిల్లింగ్ చేసే క్యాషియర్లు సుమారు రూ.15వేల నుంచి రూ.18 వేల వరకు జీతం అందుకుంటున్నారు.

Related Articles

Related image1
Watermelon: సమ్మర్ లో పుచ్చకాయ తింటున్నారా? ఈ టైమ్ లో తింటే చాలా డేంజర్..!
Related image2
Mukesh Ambani: ముఖేష్ అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్.. బాంబు దాడి చేసినా చెక్కుచెదిరే అవకాశమే లేదు
33
2. అదనపు ప్రయోజనాలు (Benefits):
Image Credit : Gemini ai

2. అదనపు ప్రయోజనాలు (Benefits):

జీతంతో పాటు నిలోఫర్ యాజమాన్యం తమ ఉద్యోగులకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది..

భోజన సదుపాయం: డ్యూటీలో ఉన్న సమయంలో ఉద్యోగులకు భోజనం , టీ ఉచితంగా అందిస్తారు.

వసతి: కొన్ని బ్రాంచ్‌లలో దూర ప్రాంతాల నుండి వచ్చే స్టాఫ్ కోసం వసతి (Accommodation) సౌకర్యం కూడా ఉండే అవకాశం ఉంది.

బోనస్: పండుగల సమయంలో లేదా పనితీరు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఉంటాయి.

3. ఉద్యోగంలో చేరాలంటే కావాల్సిన అర్హతలు:

విద్యార్హత: బేసిక్ స్టాఫ్ లేదా హెల్పర్స్ కోసం 10వ తరగతి చదివితే సరిపోతుంది. మేనేజర్లు లేదా క్యాషియర్ల కోసం ఇంటర్ లేదా డిగ్రీ తప్పనిసరి.

భాష: హైదరాబాద్ వంటి నగరంలో కస్టమర్లతో మాట్లాడటానికి తెలుగుతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ వస్తే అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.

మర్యాద: నిలోఫర్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేలా కస్టమర్లతో చాలా వినయంగా నడుచుకోవాల్సి ఉంటుంది.

4. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

మీరు కెఫే నిలోఫర్‌లో చేరాలనుకుంటే, నేరుగా వారి లక్డీకాపూల్ (Main Branch) లేదా బంజారాహిల్స్, రాయదుర్గం బ్రాంచ్‌లకు వెళ్లి మేనేజర్‌ను కలవవచ్చు. కొన్నిసార్లు వారు పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు లేదా 'Indeed' వంటి వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Alcohol : మగువలు మందుకొట్టే టాప్ 7 రాష్ట్రాలివే.. తెలంగాణ స్థానమెంత..?
Recommended image2
తెలంగాణలో కేసీఆర్ కులపోళ్లకు ఎంత భూమి ఉందో తెలుసా..?
Recommended image3
Mangli : సింగర్ మంగ్లీ అరెస్ట్ ఖాయమేనా..?
Related Stories
Recommended image1
Watermelon: సమ్మర్ లో పుచ్చకాయ తింటున్నారా? ఈ టైమ్ లో తింటే చాలా డేంజర్..!
Recommended image2
Mukesh Ambani: ముఖేష్ అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్.. బాంబు దాడి చేసినా చెక్కుచెదిరే అవకాశమే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved