MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?

Hyderabad: సొంతిల్లు ప్ర‌తీ ఒక్క‌రి క‌ల, అందులోనూ హైద‌రాబాద్ లాంటి న‌గ‌రంలో ఓ ఫ్లాట్ ఉండాల‌ని కోరుకుంటారు. అయితే క‌నీసం రూ. 60 ల‌క్ష‌లు పెడితే కానీ ఇల్లు దొర‌క‌ని హైద‌రాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లకే అపార్ట్‌మెంట్ సొంతం చేసుకునే అవ‌కాశం ల‌భిస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 23 2026, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్‌లో తక్కువ ధర ఇళ్లకు ప్రభుత్వం మరో అవకాశం
Image Credit : swagruha.telangana.gov.in

హైదరాబాద్‌లో తక్కువ ధర ఇళ్లకు ప్రభుత్వం మరో అవకాశం

తెలంగాణలో సొంతింటి కల నెరవేర్చాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర పరిధిలో రెడీ-టు-మూవ్ ఫ్లాట్ల విక్రయానికి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫ్లాట్లను ఆన్‌లైన్ లాటరీ విధానంలో కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

25
పోచారం, బండ్లగూడ ప్రాంతాల్లో 289 ఫ్లాట్లు
Image Credit : swagruha.telangana.gov.in

పోచారం, బండ్లగూడ ప్రాంతాల్లో 289 ఫ్లాట్లు

ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 289 ఫ్లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిలో పోచారం ప్రాంతంలో 274 ఫ్లాట్లు అందుబాటులో ఉండగా, బండ్లగూడలో 15 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉండటంతో ఈ ప్రాజెక్టులకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Related Articles

Related image1
Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు
Related image2
Business Ideas: ప‌నికి రాని పాత వైర్లతో ల‌క్ష‌ల సంపాద‌న‌.. మీ జీవితాన్ని మార్చే బిజినెస్‌
35
ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?
Image Credit : swagruha.telangana.gov.in

ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ల విస్తీర్ణం సుమారు 523 నుంచి 645 చదరపు అడుగుల మధ్య ఉంటుంది. వీటి ధరలు రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు నిర్ణయించారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 761 చదరపు అడుగుల విస్తీర్ణంతో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరను రూ.19 లక్షలుగా నిర్ణయించారు. మోడల్ ఫ్లాట్లకు చదరపు అడుగు ధర ఆధారంగా స్వల్పంగా ఎక్కువ మొత్తం నిర్ణయించారు. అన్ని ఫ్లాట్లకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

45
లాటరీ తేదీలు, టోకెన్ అడ్వాన్స్ వివరాలు
Image Credit : swagruha.telangana.gov.in

లాటరీ తేదీలు, టోకెన్ అడ్వాన్స్ వివరాలు

ఈ ఫ్లాట్లకు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో లైవ్ లాటరీ డ్రా నిర్వహించనున్నారు. యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారులు జనవరి 31 సాయంత్రం 5 గంటల లోపు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు రూ.1 లక్ష, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు రూ.2 లక్షలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. లాటరీలో ఎంపిక కాకపోతే ఈ మొత్తం తిరిగి చెల్లిస్తామని కార్పొరేషన్ స్పష్టం చేసింది.

55
అర్హతలు, లాక్-ఇన్ నిబంధనలు ఇవే
Image Credit : swagruha.telangana.gov.in

అర్హతలు, లాక్-ఇన్ నిబంధనలు ఇవే

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి స్పష్టమైన అర్హతలు విధించారు.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో దరఖాస్తుదారుడికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఇల్లు లేదా ప్లాట్ ఉండకూడదు.

* నెలవారీ ఆదాయం 1BHK కోసం రూ.35,000 లోపు, 2BHK కోసం రూ.50,000 లోపు ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తుకు మాత్రమే అనుమతి ఉంది.

* కేటాయించిన ఫ్లాట్‌ను ఐదేళ్ల పాటు ఇతరులకు బదిలీ చేయడానికి వీలు ఉండదు. ఈ లాక్-ఇన్ పీరియడ్ పూర్తైన తర్వాత మాత్రమే అమ్మకం లేదా బదిలీకి అవకాశం ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు
Recommended image2
Business Ideas: ప‌నికి రాని పాత వైర్లతో ల‌క్ష‌ల సంపాద‌న‌.. మీ జీవితాన్ని మార్చే బిజినెస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved