- Home
- Telangana
- shakti cyclone: ముంచుకొస్తున్న శక్తి.. తెలుగు రాష్ట్రాల ప్రజలు అలర్ట్‌గా ఉండాల్సిందే
shakti cyclone: ముంచుకొస్తున్న శక్తి.. తెలుగు రాష్ట్రాల ప్రజలు అలర్ట్‌గా ఉండాల్సిందే
తెలుగు రాష్ట్రాలపై తుపాను ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పడ్డ అల్పపీడనం మరికొన్ని గంటల్లో తుపానుగా మారనుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Heavy Rain Alert
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు తీరానికి దగ్గరగా ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సోమవారం చేరనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం తీవ్రత పెరిగి తుపానుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Rain Alert
భారీ వర్షాలు:
ఈ వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలుండగా, గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Rain Alert
తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం:
తెలంగాణలో శనివారం సాయంత్రం తర్వాత వర్షాలు ఉధృతం కానున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్, బెల్లంపల్లి, జగిత్యాల, మహబూబ్ నగర్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురవచ్చు.
Rain Alert
ఏపీలో రాయలసీమ, కోస్తాలో భారీ వర్షాలు:
రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా ఇవాళ సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి సమయంలో కుండపోత వర్షాలు కొనసాగొచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్ధరాత్రి తర్వాత వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేస్తోంది.
Rain Alert
రుతుపవనాల చురుకుదనం:
మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ప్రస్తుతం అవి బంగాళాఖాతం వరకు చేరుకున్నాయి. ఈ నెల 27వ తేదీకి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది