MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణ‌లో మొంథా బీభ‌త్సం.. 16 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌, స్కూళ్ల‌కు సెల‌వులు

తెలంగాణ‌లో మొంథా బీభ‌త్సం.. 16 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌, స్కూళ్ల‌కు సెల‌వులు

Cyclone montha: వాతావ‌ర‌ణ శాఖ ముందు నుంచి వేస్తున్న అంచ‌నాల ప్ర‌కారమే మొంథా తుఫాను బీభ‌త్సం చూపించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అల్ల‌క‌ల్లోలం సృష్టించిన తుఫాను ఇప్పుడు తెలంగాణ‌పై త‌న ప్ర‌భావాన్ని చూపిస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 30 2025, 06:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొంథా తుఫాను విధ్వంసం
Image Credit : Getty

మొంథా తుఫాను విధ్వంసం

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన మొంథా తుఫాను ఇప్పుడు తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తోంది. కోస్తా ఆంధ్ర, తూర్పు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి జనజీవనం అస్తవ్యస్తమైంది. మొదట తుఫాను ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తుందని అంచనా వేసినా, అది మార్గం మార్చి ఉత్తరాంధ్ర–తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. ఈ మార్పు వల్ల ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

25
తెలంగాణలో ఉగ్రరూపం
Image Credit : Asianet News

తెలంగాణలో ఉగ్రరూపం

తెలంగాణ‌లో బుధ‌వారం రాత్రి నుంచి వర్షాలు ఆగడం లేదు. వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు వర్ష బీభత్సంతో వణికుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, చెట్లు కూలిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం సాయంత్రానికి తుఫాను వాయుగుండంగా బలహీనపడినా, వాతావరణ శాఖ ప్రకారం గురువారం కూడా ప‌లు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయి.

Related Articles

Related image1
UPIకి క్రెడిట్ కార్డును ఎలా లింక్ చేయాలో తెలుసా.? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం
Related image2
నెల‌కు రూ. 6 వేలు పొదుపు చేస్తే రూ. 20 ల‌క్ష‌లు మీ సొంతం.. వ‌డ్డీనే రూ. 9 ల‌క్ష‌లు వ‌స్తుంది
35
స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Image Credit : Getty

స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

భారీ వర్షాల కారణంగా ములుగు, వరంగల్, జనగామ, కరీంనగర్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట‌ జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో రహదారులు దెబ్బతిన్నాయి. రైళ్లను నిలిపివేశారు, కొన్నింటినీ దారి మ‌ళ్లించారు. శ్రీశైలం హైవేలో డిండి వాగు పొంగి రోడ్డు కొట్టుకుపోవడంతో హైదరాబాద్–శ్రీశైలం రూట్‌పై వాహనాలను మళ్లించారు.

45
16 జిల్లాలకు వరద ముప్పు
Image Credit : Telangana Weatherman/x

16 జిల్లాలకు వరద ముప్పు

వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ప్రమాదం ఉంది. ప్రాజెక్టులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పర్వతగిరిలో 34.8 సెం.మీ., రెబర్తిలో 17.4 సెం.మీ., దూల్మిట్టలో 15.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

55
సహాయక చర్యలు
Image Credit : iSTOCK

సహాయక చర్యలు

హనుమకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో NDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. అధికారులు ప్రజలకు “ఇళ్లలోనే ఉండండి, వాగులు–వంకల దగ్గరికి వెళ్లకండి” అని హెచ్చరికలు జారీ చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
UPIకి క్రెడిట్ కార్డును ఎలా లింక్ చేయాలో తెలుసా.? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం
Recommended image2
నెల‌కు రూ. 6 వేలు పొదుపు చేస్తే రూ. 20 ల‌క్ష‌లు మీ సొంతం.. వ‌డ్డీనే రూ. 9 ల‌క్ష‌లు వ‌స్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved