MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Nano Banana Scam: వామ్మో ఈ 3డీ బొమ్మ‌ల వెన‌కాల ఇంత మోసం ఉందా.? జాగ్ర‌త్త‌గా ఉండండి

Nano Banana Scam: వామ్మో ఈ 3డీ బొమ్మ‌ల వెన‌కాల ఇంత మోసం ఉందా.? జాగ్ర‌త్త‌గా ఉండండి

Nano Banana Scam: సోష‌ల్ మీడియాలో నానో బ‌నానా పేరుతో ఓ ట్రెండ్ న‌డుస్తోన్న విష‌యం తెలిసిందే. సాధార‌ణ‌ ఫొటోల‌ను 3డీ ప్రింట్ రూపంలోకి మార్చుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ నానో బ‌నానా ట్రెండ్ వెన‌కాల ఒక మోసం దాగుంద‌ని తెలుసా?  

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 16 2025, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నానో బనానా స్కామ్ ఎలా జరుగుతుంది?
Image Credit : google gemini

నానో బనానా స్కామ్ ఎలా జరుగుతుంది?

ప్ర‌తీ విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే సైబ‌ర్ మోస‌గాళ్లు నానో బ‌నానా ట్రెండ్‌ను సైతం వాడుకుంటున్నారు. అస‌లు వెబ్‌సైట్‌ను పోలిన న‌కిలీ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. ఈ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఫిషింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్క‌డ మీ ఫొటో అప్‌లోడ్ చేయ‌మ‌ని లేదా ఏదైనా ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయ‌మ‌ని అడుగుతారు. ఒకవేళ ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశారో అంతే సంగ‌తులు.. మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటా, మెసేజ్‌లు, బ్యాంకింగ్ యాప్స్ వివ‌రాలు ఇలా అన్ని స్కామ‌ర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.

25
నకిలీ వెబ్‌సైట్స్‌ను ఎలా గుర్తించాలి.?
Image Credit : google

నకిలీ వెబ్‌సైట్స్‌ను ఎలా గుర్తించాలి.?

ఇవి దాదాపు అస‌లు వెబ్‌సైట్స్‌ని పోలి ఉంటాయి. అయితే యూఆర్ఎల్‌లో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఫేక్ డొమైన‌ల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఒక వెబ్‌సైట్ క్లిక్ చేస్తే మ‌రో వెబ్‌సైట్‌కి రీ డైరెక్ట్ కావ‌డం. ఓటీపీలు వంటివి అడ‌గ‌డం లేదా మీ ఫోన్‌ను రిమోట్ యాక్సిస్ రిక్వెస్ట్ చేయ‌డం వంటివి కూడా ఈ స్కామ్‌లో జ‌రుగుతుంటాయి.

Related Articles

Related image1
Beer Bath: మ‌హిళ‌లు, పురుషులు క‌లిసి బీరుతో స్నానం.. అస‌లేంటీ బీర్ బాత్ ట్రెండ్‌. ఎందుకిలా చేస్తున్నారు.?
Related image2
GST: జీఎస్టీ త‌గ్గింపుతో రూ. 72 వేల‌కే బైక్‌.. 70 కి.మీల మైలేజ్, మ‌రెన్నో ఫీచ‌ర్లు
35
ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?
Image Credit : Google

ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

లింక్ చూసినపుడు డొమైన్ పేరు జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న స్పెల్లింగ్ లేదా అదనపు పదాలు ఉంటే సందేహించండి. నానో బ‌నానో వంటి వాటిలో ఎలాంటి ఓటీపీల‌ను అడ‌గ‌ర‌నే విష‌యాన్ని గుర్తుంచుకోండి. ఒక‌వేళ ఎవ‌రైనా అలా అడిగితే అది ఫేక్ అని అర్థం. అనవసరంగా SMS, కాల్ లేదా ఫైల్ యాక్సెస్ అడిగితే ఇవ్వద్దు. యూజర్ రివ్యూలు, డెవలపర్ సమాచారం పరిశీలించండి. యాప్‌కి సంబంధించి ఫీడ్‌బ్యాక్‌ను చ‌ద‌వండి. ఎక్కువ మంది యూజ‌ర్లు స్కామ్ అని పేర్కంటే అలాంటి వాటికి దూరంగా ఉండండి.

45
సందేహం వ‌చ్చిన వెంట‌నే ఇలా చేయండి.
Image Credit : Freepik

సందేహం వ‌చ్చిన వెంట‌నే ఇలా చేయండి.

ఒక‌వేళ మీరు మోస‌పోయిన‌ట్లు అనుమానం వ‌స్తే వెంట‌నే అల‌ర్ట్ అవ్వండి. ఈ బ్యాంకింగ్ వివ‌రాలు లీక్ అయ్యాయ‌ని అనుమానం వ‌చ్చినా, అమౌంట్ క‌ట్ అయినా వెంట‌నే సైబ‌ర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నెంబ‌ర్ 1930కి కాల్ చేయండి. మీ కార్డుల‌ను బ్లాక్ చేసుకోండి. ఫోన్‌లో అనుమానాస్పద యాప్ ఇన్‌స్టాల్ అయితే వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి. అవసరమైతే రీబూట్ చేసి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి.

55
ఏఐ విష‌యంలో జాగ్ర‌త్త‌లు..
Image Credit : social media

ఏఐ విష‌యంలో జాగ్ర‌త్త‌లు..

ఏఐ ఇమేజ్ జెనరేటర్ ఉపయోగించేటప్పుడు ఆఫీషియల్ వేదిక లేదా పెద్ద బ్రాండ్‌ల‌ను మాత్ర‌మే ఉప‌యోగించుకోవాలి. ఓటీపీలు ఎవ‌రితో షేర్ చేయ‌కూడ‌దు. మెసేజ్‌ల రూపంలో వ‌చ్చే లింక్‌ల‌ను క్లిక్ చేసే ముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఫోన్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయండి. మీ వ్య‌క్తిగ‌త ఫొటోల‌ను పంపే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోండి. అవ‌స‌ర‌మైతే యాంటీ వైర‌స్ టూల్స్‌ని ఉప‌యోగించుకోండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image2
Indias Sarvam AI : తగ్గేదే లే.. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినిని మడతపెట్టేసిన మన సర్వం ఏఐ !
Recommended image3
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్
Related Stories
Recommended image1
Beer Bath: మ‌హిళ‌లు, పురుషులు క‌లిసి బీరుతో స్నానం.. అస‌లేంటీ బీర్ బాత్ ట్రెండ్‌. ఎందుకిలా చేస్తున్నారు.?
Recommended image2
GST: జీఎస్టీ త‌గ్గింపుతో రూ. 72 వేల‌కే బైక్‌.. 70 కి.మీల మైలేజ్, మ‌రెన్నో ఫీచ‌ర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved