MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Arattai: వాట్సాప్‌కి పోటీగా దూసుకొస్తున్న మేడ్ ఇన్ ఇండియా యాప్‌.. అస‌లేంటీ అర‌ట్టై

Arattai: వాట్సాప్‌కి పోటీగా దూసుకొస్తున్న మేడ్ ఇన్ ఇండియా యాప్‌.. అస‌లేంటీ అర‌ట్టై

Arattai: మెసేజింగ్ యాప్ అన‌గానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ పేరుగాంచింది. అయితే తాజాగా ఈ యాప్‌కు పోటీగా ఒక కోత్త యాప్ వ‌చ్చేస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 29 2025, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అరట్టై యాప్‌ డౌన్‌లోడ్స్‌లో సెన్సేషన్
Image Credit : Arattai

అరట్టై యాప్‌ డౌన్‌లోడ్స్‌లో సెన్సేషన్

స్వదేశీ టెక్‌ దిగ్గజం జోహో కార్పొరేషన్ రూపొందించిన మెసేజింగ్ యాప్‌ అరట్టై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ యాప్‌ డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయి. ప్రారంభంలో రోజువారీగా 3 వేల వరకు మాత్రమే సైన్‌అప్స్‌ ఉండగా, ఇప్పుడు అవి ఒక్కసారిగా 3.5 లక్షలకు చేరాయి. ఈ సమాచారం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

25
అరట్టై యాప్‌ ప్రత్యేకతలు
Image Credit : our own

అరట్టై యాప్‌ ప్రత్యేకతలు

‘అరట్టై’ అంటే తమిళంలో మాట్లాడుకోవడం అన్న అర్థం. ఈ యాప్‌ను 2021లో లాంచ్‌ చేసినప్పటికీ, ఇప్పుడు విపరీతమైన ఆదరణ పొందుతోంది. వ్యక్తిగత చాట్స్‌, గ్రూప్‌ సంభాషణలు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసే సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వాయిస్‌ నోట్స్‌, స్టోరీస్‌, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్‌ కూడా ఇందులో భాగం కావడంతో ఇది పూర్తి స్థాయి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది.

Related Articles

Related image1
Renault kwid: నెల‌కు రూ. 5వేల ఈఎమ్ఐతో కొత్త కారు.. డౌన్‌పేమెంట్ ఎంత క‌ట్టాలంటే.
Related image2
Movie Piracy: సినిమా పైర‌సీ చేసే వారికి డ‌బ్బులెలా వ‌స్తాయో తెలుసా? దేశంలోనే అతిపెద్ద పైర‌సీ ముఠాను ప‌ట్టుకున్న తెలంగాణ పోలీసులు
35
ఎన్నో ఫీచ‌ర్లు
Image Credit : Playstore

ఎన్నో ఫీచ‌ర్లు

అరట్టై యాప్‌లో టెక్స్ట్‌, మీడియా, ఫైల్‌ షేరింగ్‌ వంటి ప్రాథమిక ఫీచర్లతో పాటు, ఆడియో-వీడియో కాల్స్‌ కూడా (ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో) అందుబాటులో ఉన్నాయి. డెస్క్‌టాప్‌, ఆండ్రాయిడ్‌-టీవీ ఇంటిగ్రేషన్‌తో మల్టీ డివైజ్‌ సపోర్ట్‌ ఉండటం ప్రత్యేకత. అంతేకాకుండా, వ్యాపారుల కోసం అవసరమైన టూల్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా, ప్రైవసీ రక్షణపై కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ మోనిటైజ్‌ చేయబోమని జోహో స్పష్టం చేసింది.

45
డౌన్‌లోడ్‌ల సంఖ్య పెర‌గ‌డానికి కార‌ణం ఏంటంటే.?
Image Credit : Playstore

డౌన్‌లోడ్‌ల సంఖ్య పెర‌గ‌డానికి కార‌ణం ఏంటంటే.?

2021 నుంచే ఈ యాప్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ప్రోత్సహించడంతో ఇది ప్రజాదరణ పొందింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే అరట్టై యాప్‌ డౌన్‌లోడ్లు 100 రెట్లు పెరిగాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్లలో నెట్‌వర్కింగ్‌ విభాగంలో టాప్‌ పొజిషన్‌లో నిలిచింది. అయితే వినియోగదారుల పెరుగుదలతో పాటు కొన్ని సాంకేతిక సమస్యలు – ఓటీపీ ఆలస్యం, కాంటాక్ట్‌ సింక్‌ లోపాలు, కాల్‌ ఫెయిల్యూర్లు – ఎదురవుతున్నాయి. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని జోహో తెలిపింది.

55
వాట్సప్‌కు పోటీనిస్తుందా.?
Image Credit : Playstore

వాట్సప్‌కు పోటీనిస్తుందా.?

ప్రస్తుతం భారత్‌లో వాట్సప్‌ యూజర్లు 50 కోట్లకు పైగా ఉన్నారు. కుటుంబం, ఆఫీస్‌, వ్యాపార లావాదేవీల్లో వాట్సప్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో అరట్టైకి ఇది పెద్ద సవాలు. ప్రస్తుతం అరట్టైలో కాల్స్‌ మాత్రమే ఎన్‌క్రిప్టెడ్‌గా ఉన్నా, చాట్స్‌ మాత్రం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కలిగి లేవు. ఇదే వాట్సప్‌కి ప్లస్ పాయింట్‌. అయితే, జోహో తన ప్రైవసీ వాగ్దానాన్ని త్వరగా అమలు చేసి, సర్వర్ సామర్థ్యాన్ని పెంచితే, భారతీయ యాప్‌ అరట్టై భవిష్యత్తులో వాట్సప్‌కి గట్టి పోటీగా మారే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphone Tricks : మీ ఫోన్‌లో వైరస్ ఉందా..? ఈ లక్షణాలతో వెంటనే కనిపెట్టేయండి
Recommended image2
AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image3
Indias Sarvam AI : తగ్గేదే లే.. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినిని మడతపెట్టేసిన మన సర్వం ఏఐ !
Related Stories
Recommended image1
Renault kwid: నెల‌కు రూ. 5వేల ఈఎమ్ఐతో కొత్త కారు.. డౌన్‌పేమెంట్ ఎంత క‌ట్టాలంటే.
Recommended image2
Movie Piracy: సినిమా పైర‌సీ చేసే వారికి డ‌బ్బులెలా వ‌స్తాయో తెలుసా? దేశంలోనే అతిపెద్ద పైర‌సీ ముఠాను ప‌ట్టుకున్న తెలంగాణ పోలీసులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved