MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Virat Kohli : మళ్లీ సింహాసనం ఎక్కిన కింగ్ కోహ్లీ.. రోహిత్ శర్మ ఔట్

Virat Kohli : మళ్లీ సింహాసనం ఎక్కిన కింగ్ కోహ్లీ.. రోహిత్ శర్మ ఔట్

Virat Kohli : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై 93 పరుగులతో చెలరేగడంతో అగ్రస్థానానికి చేరగా, రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 14 2026, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డు
Image Credit : Getty

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డు

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తన సహచర ఆటగాడు, భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి కోహ్లీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. మరోవైపు, ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైన రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సమయంలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రెండో స్థానానికి ఎగబాకాడు.

26
వరుసగా 5 అర్ధ సెంచరీలతో విరాట్ విధ్వంసం
Image Credit : AFP

వరుసగా 5 అర్ధ సెంచరీలతో విరాట్ విధ్వంసం

ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పవచ్చని, అదే అతని చివరి సిరీస్ కావచ్చని అనేక రిపోర్టులు వచ్చాయి. 37 ఏళ్ల వయసులో కోహ్లీ కెరీర్ ముగిసిపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, ఆ విమర్శలన్నింటికీ తన బ్యాట్‌తోనే కోహ్లీ గట్టి సమాధానం ఇచ్చాడు.

తనలోని ఛేజ్ మాస్టర్ ను మరోసారి బయటకు తీసి, అద్భుతమైన క్రికెట్ ఆడాడు. ఈ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ వరుసగా ఐదు సార్లు 50కి పైగా స్కోర్లు సాధించడం విశేషం.

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ 93 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను ర్యాంకింగ్స్ పట్టికలో రెండో స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకాడు. తన కెరీర్‌లో విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది 11వ సారి కావడం గమనార్హం. జూలై 2021 తర్వాత కోహ్లీ మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి.

కోహ్లీ గత ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల స్కోర్లు  74, 135, 102, 65, 93 గా ఉన్నాయి.

Related Articles

Related image1
IND vs NZ : ఏంటి సామి ఈ క్యాచ్? షాక్ లో బౌలర్, కెప్టెన్.. కుల్దీప్ చేసిన పనికి గ్రౌండ్ అంతా సైలెంట్ !
Related image2
Virat Kohli : అహంకారం కాదురా.. అది ఆటిట్యూడ్.. రహానే షాకింగ్ కామెంట్స్
36
గట్టి పోటీనిస్తున్న డారిల్ మిచెల్
Image Credit : X/BCCI

గట్టి పోటీనిస్తున్న డారిల్ మిచెల్

మరోవైపు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అతని ర్యాంకింగ్ పడిపోయింది. ఇదే అదనుగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శనతో రెండో స్థానానికి చేరుకున్నాడు. వడోదరలో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ 84 పరుగులు చేశాడు.

అయితే, భారత్ 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో అతని పోరాటం వృథా అయ్యింది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీకి (785 పాయింట్లు), డారిల్ మిచెల్ (784 పాయింట్లు) మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్రమే వ్యత్యాసం ఉంది. మిచెల్ గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

46
టాప్-10 ఐసీసీ వన్డే బ్యాటర్ల జాబితా
Image Credit : AFP

టాప్-10 ఐసీసీ వన్డే బ్యాటర్ల జాబితా

తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-10 బ్యాటర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

1. విరాట్ కోహ్లీ - 785 పాయింట్లు

2. డారిల్ మిచెల్ - 784 పాయింట్లు

3. రోహిత్ శర్మ - 775 పాయింట్లు

4. ఇబ్రహీం జద్రాన్ - 764 పాయింట్లు

5. శుభ్‌మన్ గిల్ - 725 పాయింట్లు

6. బాబర్ ఆజం - 722 పాయింట్లు

7. హ్యారీ హెక్టర్ - 708 పాయింట్లు

8. షాయ్ హోప్ - 701 పాయింట్లు

9. చరిత్ అసలంక - 690 పాయింట్లు

10. శ్రేయాస్ అయ్యర్ - 682 పాయింట్లు

56
825 రోజులు.. అగ్రస్థానంలో కోహ్లీ రికార్డు
Image Credit : BCCI

825 రోజులు.. అగ్రస్థానంలో కోహ్లీ రికార్డు

వన్డే క్రికెట్ చరిత్రలో నంబర్ 1 స్థానంలో ఎక్కువ రోజులు కొనసాగిన భారతీయ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కోహ్లీ అక్టోబర్ 2013లో తొలిసారి నంబర్ 1 ర్యాంక్ సాధించాడు. ఇప్పటివరకు అతను మొత్తం 825 రోజుల పాటు ఈ స్థానంలో కొనసాగాడు. బాబర్ ఆజం (1359 రోజులు), మైఖేల్ బెవన్ (1361 రోజులు), వివ్ రిచర్డ్స్ (2306 రోజులు) వంటి దిగ్గజాల సరసన కోహ్లీ నిలిచాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా కోహ్లీ ముందుకు సాగుతున్నాడు.

66
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ జోరు
Image Credit : AFP

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ జోరు

బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు మెరుగైన ర్యాంకులు సాధించారు. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు మెహదీ హసన్ మిరాజ్ కూడా ఇదే స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ భారత్‌పై 4 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతను ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 69వ స్థానానికి చేరుకున్నాడు. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఇదే ర్యాంకులో ఉన్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image2
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Recommended image3
Arjun Tendulkar Wedding : అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. మోదీ ఇంటికి సచిన్.. డేట్, వెన్యూ డీటెయిల్స్ ఇవే
Related Stories
Recommended image1
IND vs NZ : ఏంటి సామి ఈ క్యాచ్? షాక్ లో బౌలర్, కెప్టెన్.. కుల్దీప్ చేసిన పనికి గ్రౌండ్ అంతా సైలెంట్ !
Recommended image2
Virat Kohli : అహంకారం కాదురా.. అది ఆటిట్యూడ్.. రహానే షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved