MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Shubman Gill : ఏమయ్యా గిల్లూ.. నువ్వు చేసిన పనే మేం చేశామో తల్లులు తన్నడం ఖాయం..!

Shubman Gill : ఏమయ్యా గిల్లూ.. నువ్వు చేసిన పనే మేం చేశామో తల్లులు తన్నడం ఖాయం..!

టీమిండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ మైదానంలో చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇదే పని మనం చేశామో అమ్మలు తన్నేవారని యువత కామెంట్స్ చేస్తున్నారు. అంతపని గిల్ ఏం చేశాడో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 20 2026, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మా తల్లులు తిట్టేపని ఎందుకు చేశావయ్యా గిల్లూ...
Image Credit : Facebook/Shubman Gill Fans Club

మా తల్లులు తిట్టేపని ఎందుకు చేశావయ్యా గిల్లూ...

Shubman Gill : సాధారణంగా మనం ఏదైనా తప్పు చేశామో... అమ్మానాన్నలు తిట్టడం ఖాయం. ముఖ్యంగా ఫుడ్ విషయంలో అయితే అమ్మలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. మన తెలుగు తల్లులయితే ఏది తినాలి, ఎలా తినాలి అనేదానిపై మరింత స్ట్రిక్ట్. మనం కాదు వాళ్ల ఎదుట ఎవరు తప్పుగా తిన్నా సహించలేరు... వాళ్లతో చెప్పకున్నా మనముందు తిడుతుంటారు. అలాంటిది సెలబ్రిటీలు ఈ పని చేస్తే ''అందరికీ ఆదర్శంగా ఉండాల్సినవాళ్ళు ఇలా చేయవచ్చా..!'' అని తిడుతుంటారు. ఇలా మన తల్లులు తిట్టేపనే తాజాగా టీమిండియా ప్లేయర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ చేశాడు.

24
మైదానంలోనే గిల్ ఏం చేశాడో తెలుసా..?
Image Credit : Jio Hotstar

మైదానంలోనే గిల్ ఏం చేశాడో తెలుసా..?

సాధారణంగా క్రీడాకారులు అలసిపోయి బాగా నీరసంగా అనిపించినప్పుడు అరటిపండు తింటుంటారు. ఇది అప్పటికప్పుడు ఎనర్జీ ఇస్తుంది.. దీన్ని తినడంవల్ల మైదానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది. అందుకే చాలామంది క్రికెటర్లు కూడా మ్యాచ్ మధ్యలో తింటుంటారు... తాజాగా ఐపిఎల్ లో గుజరాత్ కెప్టెన్ కూడా ఇదే చేశాడు. అరటిపండు తినడంవరకు బాగానే ఉంది... కానీ ఆతర్వాత వెంటనే నీళ్ళు తాగడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇదే పని మనం చేశామో... తల్లులు తన్నడం ఖాయం.

అరటిపండు తిన్నాక నీళ్ళు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పెద్దలు ఇలా చేయకూడదని చెబుతారు. అసలు అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే ఏఏ ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

Related Articles

Related image1
IPL 2026: బ్యాటింగ్ చేయలేరు.. మళ్లీ వీరికి కెప్టెన్సీనా.? జట్టుకు భారంగా మారిన కెప్టెన్లు..
Related image2
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
34
అరటిపండు తిన్నవెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది..?
Image Credit : Getty

అరటిపండు తిన్నవెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది..?

1. జీర్ణక్రియ మందగించడం (Digestion Issues)

అరటిపండులో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. అరటిపండు తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబడతాయి. దీనివల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదించి, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

2. ఆయుర్వేదం ఏం చెబుతోంది.. (Ayurvedic Perspective)

ఆయుర్వేదం ప్రకారం... అరటిపండు శరీరానికి 'శీతల' (చలవ) గుణాన్ని ఇస్తుంది. దీనిపై మళ్లీ చల్లని నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి జలుబు లేదా దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం 20 నుండి 30 నిమిషాల విరామం తర్వాతే నీళ్లు తాగాలని పెద్దలు సూచిస్తారు.

3. శరీరానికి పోషకాల అందవు (Nutrient Absorption)

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఈ పోషకాలు సరిగ్గా ఒంటికి పట్టకుండానే విసర్జితమయ్యే అవకాశం ఉంటుందని కొందరు నిపుణుల అభిప్రాయం.

4. కడుపులో అసౌకర్యం

అరటిపండులోని పీచు పదార్థం నీటిని పీల్చుకుని కడుపులో గడ్డకట్టినట్లుగా అనిపించవచ్చు. దీనివల్ల కొంతమందికి వికారం లేదా అజీర్తిగా అనిపిస్తుంది.

44
శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్త...
Image Credit : Getty

శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్త...

అయితే అరటిపండు తిన్నాక దాహం వేస్తే ఒకటి లేదా రెండు గుటకల నీళ్లు తాగడంలో తప్పులేదు. కానీ గ్లాసుల కొద్దీ తాగడం మాత్రం మానుకోవడం మంచిది. అలాగే రాత్రిపూట అరటిపండు తిని వెంటనే నీళ్లు తాగితే శ్వాసవ్యవస్థకు ఇబ్బందులు తప్పవు… కఫం పేరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అరటిపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్లు మెండుగా ఉంటాయి. అందుకే ఇది తినాలనే మన తల్లులు కూడా చెబుతుంటారు... కానీ తిన్న వెంటనే నీళ్లు తాగవద్దని చెబుతారు. జీర్ణ సమస్యలు, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆరోగ్యం
క్రికెట్
క్రీడలు
శుభ్‌మన్ గిల్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
Recommended image2
Tilak Varma : తిలక్ వర్మ ఊచకోత.. గుజరాత్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలుగోడు !
Recommended image3
Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్‌కు ఏమైంది? CSK కెప్టెన్ మైండ్‌లో ఏం నడుస్తోంది?
Related Stories
Recommended image1
IPL 2026: బ్యాటింగ్ చేయలేరు.. మళ్లీ వీరికి కెప్టెన్సీనా.? జట్టుకు భారంగా మారిన కెప్టెన్లు..
Recommended image2
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved