MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సెంచరీ కొట్టిన సంజూ శాంసన్.. గౌతమ్ గంభీర్ కు కొత్త తలనొప్పి

సెంచరీ కొట్టిన సంజూ శాంసన్.. గౌతమ్ గంభీర్ కు కొత్త తలనొప్పి

Sanju Samson: కేఎస్ఎల్‌లో సంజూ శాంసన్ సెంచరీతో అదరగొట్టాడు. తన సునామీ నాక్ తో తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. ఆసియా కప్ 2025 కి ముందు గౌతమ్ గంభీర్ కు కొత్త తలనొప్పి తీసుకొచ్చాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 25 2025, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెంచరీతో ఫామ్ లోకి తిరిగొచ్చిన సంజూ శాంసన్
Image Credit : Kerala Cricket Association

సెంచరీతో ఫామ్ లోకి తిరిగొచ్చిన సంజూ శాంసన్

ఆసియా కప్‌ 2025 కి ముందు కెరళ క్రికెట్ లీగ్‌లో (కేఎస్ఎల్) సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో నిరాశ పరిచిన అతను.. మూడో మ్యాచ్‌లో సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. కేవలం 42 బంతుల్లో 121 పరుగుల సూపర్ సెంచరీ నాక్ తో దుమ్మురేపాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ తో ఆసియా కప్ 2025కి ముందు టీమిండియా సెలెక్టర్లు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను ఒత్తిడిలోకి నెట్టాడు.

DID YOU
KNOW
?
సంజూ శాంసన్ టీ20ల సెంచరీ రికార్డు
2024లో సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. వరుస సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై ఒక సెంచరీ, దక్షిణాఫ్రికాపై వరుసగా మరో రెండు సెంచరీలు బాదాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
25
సంజూ శాంసన్ సెంచరీతో సెలెక్టర్లపై ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది?
Image Credit : Asianet News

సంజూ శాంసన్ సెంచరీతో సెలెక్టర్లపై ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది?

ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భారత్ జట్టులో శుభ్‌మన్ గిల్ కు చోటుదక్కింది. గిల్ వైస్ కెప్టెన్ గా ఉండగా, సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. భారత జట్టులో ఉన్న అభిషేక్ శర్మ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు.

గిల్, సంజూ, అభిషేక్ శర్మ.. ముగ్గురు ప్లేయర్ల కూడా ఓపెనింగ్ కోసం పోటీ పడుతున్నారు. సంజూ శాంసన్ సెంచరీ చేయడంతో అతనికి ఆసియా కప్ తుది జట్టులో స్థానం ఇవ్వాలని ఒత్తిడి పెరిగింది. సెలెక్టర్ అజిత్ అగార్కర్ మొదట సంజూను ఓపెనర్‌గా ఆలోచించారు. కానీ గిల్ రావడంతో మొదటి రెండు మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ ఫినిషర్‌గా ఆడించాలనుకున్నారు. తాజా సెంచరీతో ఓపెనర్‌ ప్లేస్ తనకే దక్కాలనే సంకేతాలు పంపాడు.

Related Articles

Related image1
ఈ బ్యాంకు బంగారం విలువలో 90 శాతం గోల్డ్ లోన్ ఇస్తోంది
Related image2
రోహిత్ తర్వాత టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ ఎవరు? శ్రేయాస్ అయ్యర్ పోటీలో ఉన్నారా?
35
గౌతమ్ గంభీర్‌కు కొత్త సవాలు
Image Credit : ANI

గౌతమ్ గంభీర్‌కు కొత్త సవాలు

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటినుంచే శుభ్‌మన్ గిల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా ప్రోత్సహిస్తున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో గిల్ 754 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఈ ఫామ్ చూసే అతన్ని టీ20 జట్టులోకి తీసుకున్నారు. అలాగే, వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. 

కానీ సంజూ శాంసన్ సెంచరీ చేయడంతో గంభీర్ ముందుకు కొత్త తలనొప్పి వచ్చింది. గిల్, అభిషేక్, సంజూ.. ఈ ముగ్గురిలో ఎవరికి స్థానం దక్కుతుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గత సిరీస్ లలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ చేశారు. ఇద్దరు అద్భుతంగా రాణించారు. సెంచరీల మోత మోగించారు.

45
కేఎస్ఎల్‌లో సంజూ శాంసన్ సూపర్ షో
Image Credit : ANI

కేఎస్ఎల్‌లో సంజూ శాంసన్ సూపర్ షో

కొచ్చి బ్లూ టైగర్స్ తరఫున సంజూ శాంసన్ మొదటి రెండు మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ లో ఆడి విఫలమయ్యాడు. రెండవ మ్యాచ్‌లో 22 బంతుల్లో కేవలం 13 పరుగులు చేశాడు. ఇక మూడో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 14 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. చివరి బంతికి బ్లూ టైగర్స్ గెలిచినా, సంజూ శాంసన్ ఇన్నింగ్స్ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది.

55
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు
Image Credit : Getty

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు

ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 15 మంది ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.

సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరు‍ణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
ఈ బ్యాంకు బంగారం విలువలో 90 శాతం గోల్డ్ లోన్ ఇస్తోంది
Recommended image2
రోహిత్ తర్వాత టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ ఎవరు? శ్రేయాస్ అయ్యర్ పోటీలో ఉన్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved