MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • SRH షాకింగ్ ట్విస్ట్.. సునామీ బ్యాటర్ ఔట్.. కావ్యా పాప సెన్సేషన్ నిర్ణయం !

SRH షాకింగ్ ట్విస్ట్.. సునామీ బ్యాటర్ ఔట్.. కావ్యా పాప సెన్సేషన్ నిర్ణయం !

SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టులో కీలక మార్పులు చేస్తోంది. జట్టులోని అత్యంత ఖరీదైన ప్లేయర్లను సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉందని సమాచారం. అసలు కావ్యా పాప వ్యూహాం ఏంటి?

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Nov 04 2025, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సంచలనం
Image Credit : SRH Instagram

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సంచలనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 వేలం ముందు సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టులో పెద్ద మార్పులు జరగనున్నాయనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ ఆధ్వర్యంలో జట్టు సమతుల్యతను మెరుగుపరచాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలో 23 కోట్ల భారీ రిటెన్షన్‌తో ఉన్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హైన్రిచ్ క్లాసెన్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో జట్టు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది షాకింగ్ నిర్ణయంగా చెప్పవచ్చు.

26
23 కోట్ల క్లాసెన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏం ఆలోచన చేస్తోంది?
Image Credit : ANI

23 కోట్ల క్లాసెన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏం ఆలోచన చేస్తోంది?

2025 మెగా వేలం ముందు హెన్రిచ్ క్లాసెన్‌ను 23 కోట్ల రూపాయల భారీ మొత్తంతో రిటైన్ చేసుకుంది హైదరాబాద్ టీమ్. ఈ మొత్తం జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (₹18 కోట్లు), అభిషేక్ శర్మ (₹14 కోట్లు) కంటే ఎక్కువ. అయితే 2025 సీజన్‌లో క్లాసెన్ వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన చేసినప్పటికీ, ఆరెంజ్ మెన్స్ ఫలితాలు నిరాశ కలిగించాయి. 2024లో రన్నరప్‌గా నిలిచిన ఎస్ఆర్హెచ్, 2025లో ఆరో స్థానంలో ముగించింది. అందుకే మేనేజ్‌మెంట్ ఇప్పుడు బడ్జెట్‌ సర్దుబాటు దిశగా నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం.

Related Articles

Related image1
ముంబై ఇండియన్స్ లో సునామీ ప్లేయర్లు.. ప్రత్యర్థులకు చెడుగుడే !
Related image2
రిచా ఘోష్ : భారత్ ప్రపంచ కప్పు గెలవడానికి కారణం ఈమెనే !
36
క్లాసెన్ విడుదల వ్యూహాత్మక నిర్ణయమేనా?
Image Credit : stockphoto

క్లాసెన్ విడుదల వ్యూహాత్మక నిర్ణయమేనా?

క్రికెట్ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. హెన్రిచ్ క్లాసెన్ విడుదల నిర్ణయం అతని ప్రతిభపై కాకుండా ఆర్థిక వ్యూహంపై ఆధారపడింది. జట్టులో బౌలింగ్ యూనిట్‌లో బలహీనతలు, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లోపాలు బయటపడ్డాయి. 23 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేస్తే, ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌లోని సభ్యులు ప్రస్తుతం రిటెన్షన్ జాబితాను ఫైనల్ చేయడానికి వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.

46
ధనాధన్ ఇన్నింగ్స్ లతో మ్యాచ్ ను మలుపుతిప్పగల ప్లేయర్ క్లాసెన్
Image Credit : ANI

ధనాధన్ ఇన్నింగ్స్ లతో మ్యాచ్ ను మలుపుతిప్పగల ప్లేయర్ క్లాసెన్

2025 సీజన్‌లో క్లాసెన్ 13 ఇన్నింగ్స్‌లలో 487 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 172.69గా నమోదైంది. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో జట్టుకు కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయినప్పటికీ, మిగతా బ్యాటర్లు పెద్దగా మద్దతు ఇవ్వలేకపోయారు. క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అతని ఫామ్ కూడా మిశ్రమంగా ఉంది. ది హండ్రెడ్ 2025లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున కేవలం 151 పరుగులు మాత్రమే చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ టీమ్ స్మార్ట్ మువ్‌గా క్లాసెన్‌ను విడుదల చేసి తిరిగి 15 కోట్ల వరకు కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చనే చర్చ సాగుతోంది.

56
బౌలింగ్ యూనిట్‌ మార్పులపై దృష్టిపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్
Image Credit : INSTA

బౌలింగ్ యూనిట్‌ మార్పులపై దృష్టిపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ 2025 సీజన్‌లో బౌలింగ్ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ చెందింది. మహ్మద్ షమీ (₹10 కోట్లు), హర్షల్ పటేల్ (₹8 కోట్లు) లాంటి ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. షమీ కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు, ఎకానమీ రేట్ 11 కంటే ఎక్కువగా ఉంది. హర్షల్ 16 వికెట్లు సాధించినా, ఓవర్‌కు 10 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో స్పిన్ విభాగంలోనూ మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. రాహుల్ చాహర్ స్థానంలో కొత్త స్పిన్నర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

66
ఐపీఎల్ 2026 వేలం ముందు SRH వ్యూహం ఏమిటి?
Image Credit : SRH Insta

ఐపీఎల్ 2026 వేలం ముందు SRH వ్యూహం ఏమిటి?

జట్టు సమతుల్యత, బౌలింగ్ డెప్త్, మిడిల్ ఆర్డర్ బలహీనతలు.. ఇవన్నీ SRH ముందున్న ప్రధాన సవాళ్లు. క్లాసెన్ లాంటి మ్యాచ్‌విన్నర్‌ను వదిలేయడం పెద్ద రిస్క్ అయినప్పటికీ, ఫ్రాంచైజీ దీన్ని రీసెట్ స్ట్రాటజీగా చూస్తోంది. పెద్ద బడ్జెట్‌తో వేలంలోకి వెళ్లడం ద్వారా పలు కీలక స్థానాలను భర్తీ చేయాలని ఆరెంజ్ ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది.

రాబోయే వారాల్లో దీనిపై తుది నిర్ణయం వెల్లడించనుంది. కానీ హైన్రిచ్ క్లాసెన్ భవిష్యత్తు సన్‌రైజర్స్ జట్టులో కొనసాగుతుందా లేదా అనేది IPL 2026 వేలం వరకు మిస్టరీగానే మిగిలే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
ముంబై ఇండియన్స్ లో సునామీ ప్లేయర్లు.. ప్రత్యర్థులకు చెడుగుడే !
Recommended image2
రిచా ఘోష్ : భారత్ ప్రపంచ కప్పు గెలవడానికి కారణం ఈమెనే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved