MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • 446 పరుగులు, 19 సిక్సర్లు.. SMAT లో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ విధ్వంసం

446 పరుగులు, 19 సిక్సర్లు.. SMAT లో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ విధ్వంసం

Mushtaq Ali Trophy : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో పంజాబ్ vs బరోడా మధ్య జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన కమ్‌బ్యాక్ తో అదరగొట్టాడు. అభిషేక్ శర్మ మరోసారి షేక్ చేశాడు. ఇద్దరూ పరుగుల వరద పారించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Dec 02 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గాయం తర్వాత హార్దిక్ పాండ్యా మెరుపులు
Image Credit : ANI

గాయం తర్వాత హార్దిక్ పాండ్యా మెరుపులు

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టి సత్తా చాటాడు. మంగళవారం జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025 టోర్నమెంట్‌లో దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చాడు. బరోడా జట్టు తరఫున ఆడిన హార్దిక్, పంజాబ్ జట్టుపై మెరుపు ఇన్నింగ్స్‌తో విజయం అందించాడు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.

25
బ్యాట్స్‌మెన్ల ధాటికి బౌలర్లకు చుక్కలు
Image Credit : BCCI\Twitter

బ్యాట్స్‌మెన్ల ధాటికి బౌలర్లకు చుక్కలు

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌లు చెలరేగిపోయారు. పరుగులు వరద పారింది. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 19 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించ లేదు.

పంజాబ్ ఇన్నింగ్స్‌లో యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనితో పాటు అన్‌మోల్‌ప్రీత్ సింగ్ కూడా 32 బంతుల్లో 69 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పంజాబ్ జట్టు బరోడా ముందు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Related Articles

Related image1
14 ఏళ్లకే 3 సెంచరీలు.. SMATలో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర
Related image2
ఐపీఎల్ మినీ వేలంలో 1355 మంది ప్లేయర్స్.. 45 మంది పోటుగాళ్ల పైనే ఫోకస్
35
లక్ష్య ఛేదనలో బరోడా మెరుపు ఆరంభం
Image Credit : Getty

లక్ష్య ఛేదనలో బరోడా మెరుపు ఆరంభం

223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు విష్ణు సోలంకి, శాశ్వత్ రావత్ కేవలం 5 ఓవర్లలోనే 66 పరుగుల తుపాను భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిన తర్వాత సీనియర్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగాడు. నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్, జట్టు విజయాన్ని భుజాన వేసుకున్నాడు.

45
పాండ్యా దెబ్బకు అభిషేక్ శర్మపై ఇన్నింగ్స్ కనిపించలేదు
Image Credit : X/BCCI, hardikpandya7

పాండ్యా దెబ్బకు అభిషేక్ శర్మపై ఇన్నింగ్స్ కనిపించలేదు

పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యా తన మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. శివాలిక్ శర్మతో కలిసి హార్దిక్ 62 బంతుల్లో 109 పరుగుల మ్యాచ్-విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పాండ్యా 42 బంతుల్లో 183.33 స్ట్రైక్ రేట్‌తో 77 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. హార్దిక్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ తరఫున అభిషేక్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కన్నా.. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసింది. తన ఈ నాక్ తో బరోడాకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్ తొలి బంతికే బరోడా లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

55
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హార్దిక్ పాండ్యా
Image Credit : Insta/hardikpandya93

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హార్దిక్ పాండ్యా

భారత జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025 లో గాయపడ్డాడు. ఆ గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. SMAT టోర్నీలో పంజాబ్‌పై బ్యాట్‌తో అజేయంగా 77 పరుగుల నాక్ ఆడాడు. అలాగే, బౌలింగ్ లో కూడా రాణించి ఒక వికెట్ కూడా తీశాడు.

తన కమ్‌బ్యాక్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు గాను హార్దిక్ పాండ్యా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో తను త్వరలోనే భారత జట్టుకు ఆడటానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Tendulkar Wedding : అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. మోదీ ఇంటికి సచిన్.. డేట్, వెన్యూ డీటెయిల్స్ ఇవే
Recommended image2
దబాంగ్.. దబాంగ్.. దొబ్బేయ్.. దొబ్బేయ్.. PCBకి ఇచ్చిపడేసిన ఐసీసీ, బీసీసీఐ..
Recommended image3
ఆ ఒక్క ఇన్నింగ్స్‌లోనే స్కైలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్ కనిపించారు.. వారెవరంటే.?
Related Stories
Recommended image1
14 ఏళ్లకే 3 సెంచరీలు.. SMATలో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర
Recommended image2
ఐపీఎల్ మినీ వేలంలో 1355 మంది ప్లేయర్స్.. 45 మంది పోటుగాళ్ల పైనే ఫోకస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved