MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips: పిల్లల కోపం తగ్గించాలంటే ఏం చేయాలో తెలుసా?

Parenting Tips: పిల్లల కోపం తగ్గించాలంటే ఏం చేయాలో తెలుసా?

పిల్లలకు వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. పేరెంట్స్ ఏదైనా చిన్న విషయం చెప్పినా.. వారికి వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 28 2025, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పేరెంటింగ్ టిప్స్...
Image Credit : ChatGpt AI

పేరెంటింగ్ టిప్స్...

ఈ మధ్యకాలంలో పిల్లలకు చిటికీ, మాటికీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. వారి కోపాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు.  చిన్న పని చెప్పినా పిల్లలు కోపంతో ఊగిపోతుంటారు. ఇక.. పిల్లలు చిన్న విషయానికీ, పెద్ద విషయానికి కోప్పడటం.. పేరెంట్స్ కి కూడా నచ్చదు.  కానీ, పిల్లల కోపం కేవలం కోపం మాత్రమే కాదు. ఇది వారి భావాల వ్యక్తీకరణ. 

పిల్లలు తమ ఎమోషన్ ని  ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు.  కొందరు అరుస్తూ, మరి కొందరు తమను తాము గాయపరుచుకుంటూ తమ కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి, పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

27
అంగీకారం
Image Credit : AI

అంగీకారం

పిల్లలు కోపంగా ఉన్నప్పుడు వారిని విస్మరించడం సరైన పరిష్కారం కాదు. దీనివల్ల వారి భావాలను వ్యక్తపరచడం సురక్షితం కాదనే అవగాహన పిల్లలకు కలుగుతుంది. తమ కోపాన్ని పేరెంట్స్ పట్టించుకోవడం లేదు అనే విషయం వారిని మరింత బాధపడుతుంది. అందుకే.. వారికి కోపం వచ్చినప్పుడు వారి కోపాన్ని అర్థం చేసుకోవాలి. అసలు.. వారికి కోపం ఎందుకు వచ్చింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 

Related Articles

Related image1
Parenting Tips: మీ పిల్లలు రోజూ ఫోన్ చూస్తున్నారా? భవిష్యత్తులో జరిగేది ఇదే..!
Related image2
Parenting Tips: పిల్లల ముందు పేరెంట్స్ గొడవలు పడితే ఏమౌతుంది?
37
హార్మోన్ల ఒత్తిడి...
Image Credit : stockPhoto

హార్మోన్ల ఒత్తిడి...

పిల్లలు ఎక్కువ సమయం ఒంటరిగా గడిపేటప్పుడు వారి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల వారి భావోద్వేగ నియంత్రణ ఆలస్యం అవుతుంది. దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వారితో తగినంత సమయం గడపాలి. ఒంటరితనం తగ్గినప్పుడు వారి గాయపడిన మనసు నయం అవుతుంది కోపం తగ్గుతుంది.

47
కోపాన్ని కంట్రోల్ చేయడం.
Image Credit : stockPhoto

కోపాన్ని కంట్రోల్ చేయడం.

పిల్లల కోపం తగ్గించడానికి వారికి నచ్చిన పనులు చేయించాలి. అంటే… వీలైనంత వరకు వారికి డ్రాయింగ్, కథల పుస్తకాలు చదవడం లాంటివి అలవాటు చేయాలి. ఇవి.. వారికి చాలా ఓదార్పునిస్తాయి. కోపం లాంటి సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. 

57
తల్లిదండ్రుల అవగాహన
Image Credit : stockPhoto

తల్లిదండ్రుల అవగాహన

పిల్లలు కోపంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా వారితో కలిసి అరవడం, తిట్టడం వంటివి చేయకుండా వారి కోపం తగ్గిన తర్వాత వారితో మాట్లాడాలి. వారి సానుకూల అంశాలను చెప్పిన తర్వాత, కోపం ఎలాంటి ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందో తెలియజేయాలి.

67
ముఖ్యమైన మార్పు
Image Credit : stockPhoto

ముఖ్యమైన మార్పు

కోపిష్టి పిల్లలను శాంతింపజేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించే ముందు, తమను తాము చూసుకోవాలి. శరీరాన్ని గట్టిగా కాకుండా వదులుగా ఉంచుకోవాలి. ముఖంలో చిరునవ్వుతో మృదువైన స్వరంతో మాట్లాడాలి. మాట్లాడే ముందు గాలిని లోతుగా పీల్చుకోవాలి. తర్వాత వారితో మాట్లాడాలి.

77
టాస్క్
Image Credit : pinterest

టాస్క్

పిల్లలకు కోపం వచ్చినప్పుడు అరవడం కాకుండా.. ఆ కోపాన్ని ఏదైనా బొమ్మ రూపంలో గీయడం లేదంటే.. కాగితంపై రాయడం లాంటివి చేయమని చెప్పాలి.  వారికి ఎంత కోపం వచ్చిందో దానితో చెప్పమని చెప్పాలి. తెలీకుండానే.. ఆ పనులు వారి కోపాన్ని కంట్రోల్ చేస్తాయి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Recommended image2
Girl Child: ఇంట్లో ఆడపిల్ల ఉందా? వంట-వార్పు కాదు,కచ్చితంగా నేర్పించాల్సిన 5 విషయాలు ఇవి..!
Recommended image3
Raising Sons: మీకు అబ్బాయి ఉన్నాడా? చిన్నప్పటి నుండే నేర్పాల్సినవి ఇవే..
Related Stories
Recommended image1
Parenting Tips: మీ పిల్లలు రోజూ ఫోన్ చూస్తున్నారా? భవిష్యత్తులో జరిగేది ఇదే..!
Recommended image2
Parenting Tips: పిల్లల ముందు పేరెంట్స్ గొడవలు పడితే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved