MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips: మీ పిల్లలు చదివింది మర్చిపోతున్నారా? ఇలా చేస్తే మతిమరుపు ఉండదు

Parenting Tips: మీ పిల్లలు చదివింది మర్చిపోతున్నారా? ఇలా చేస్తే మతిమరుపు ఉండదు

Parenting Tips: కొంతమంది పిల్లలు చదివింది చాలా రోజుల వరకు గుర్తుంచుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఎన్ని సార్లు చదివినా అప్పుడే మర్చిపోతుంటారు. ఇది తల్లిదండ్రులను కలవరపెడుతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 17 2025, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
జ్ఞాపకశక్తి
Image Credit : Social Media

జ్ఞాపకశక్తి

 ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదవాలని కోరకుంటారు. కొంతమంది పిల్లలు చదివిన విషయాన్ని ఎన్నిరోజులైనా గుర్తుంచుకుంటే మరికొంతమంది పిల్లలు మాత్రం ఎంత చదివినా అప్పుడే మర్చిపోతుంటారు. దీనివల్లే పిల్లలకు పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తాయి. 

28
మెమోరీ పవర్
Image Credit : Instagram

మెమోరీ పవర్

పిల్లలు ఇలా మర్చిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో నిద్రలేమి, పోషకాహార లోపం ఉన్నాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల మెమోరీ పవర్ ను ఎలా పెంచాలో తెలియదు. కానీ తిడుతుంటారు.కానీ తిట్టినంత మాత్రానా పిల్లలకు చదివింది గుర్తుండదు. అందుకే పిల్లల మెమోరీ పవర్ ను ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Related Articles

Related image1
Kitchen Hacks: ఇలా చేస్తే బెండకాయ కూర జిగటగా కాదు
Related image2
Chia Seeds vs Sabja Seeds: చియా సీడ్స్ vs సబ్జా సీడ్స్.. బరువు తగ్గడానికి ఏవి మంచివి
38
నిద్ర
Image Credit : Instagram

నిద్ర

పిల్లల జ్ఞాపకశక్తి ని పెంచడానికి కంటినిండా నిద్ర ఉండాలి. సరిగ్గా నిద్రపోయే పిల్లల మెమోరీ పవర్ బాగుంటుంది. సరిగ్గా నిద్రపోతే వారి మెదడు నిన్న చదివిన దాన్ని కూడా గుర్తుకు తెస్తుంది.  3 నుంచి 5 ఏండ్ల పిల్లలు పగలు కూడా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పిల్లలు నిద్రపోయే ముందు టీవీ, ఫోన్ ను చూడనివ్వకూడదు. అలాగే పిల్లలు 9 నుంచి 12 గంటలు నిద్రపోవాలి. పిల్లల నిద్రగంటలు వయసును బట్టి మారుతాయి. 

48
ఏరోబిక్ వ్యాయామం
Image Credit : Instagram

ఏరోబిక్ వ్యాయామం

పిల్లలుకూడా ఏరోబిక్ వ్యాయామం చేయొచ్చు. ఇది వారు నేర్చుకునే దాన్ని మెరుగుపరుస్తుంది.  రోజూ గంట పాటు సైకిల్రో తొక్కడం, ఈత కొట్టడం వంటి వ్యాయామాలు చేస్తే మెమోరీ పవర్ బాగుంటుంది. పిల్లలు హోం వర్క్ చేయడానికి ముందు ఒక 10 నుంచి 15 నిమిషాలు జంపింగ్ చేయడం, గుంజీలు తీయడం వంటివి చేసినా మంచిదే.

58
 జ్ఞాపకశక్తి
Image Credit : unsplash

జ్ఞాపకశక్తి

పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి క్విజ్ పోటీలు కూడా బాగా ఉపయోగపడతాయి. వారి మెమోరీ పవర్ ను తెలుసుకోవడానికి మీరు ప్రశ్నలు అడగండి. ఇది వారి మెదడును చురుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. వారు చదివిన దాన్నుంచి క్వచ్చన్స్ అడగండి. తర్వాత రోజు కూడా వారు చదివిన టాపిక్ నుంచే ప్రశ్నలు అడగండి. 

68
ఇలా చదివించండి
Image Credit : Social Media

ఇలా చదివించండి

కష్టమైన లెసెన్స్ ను ఒకేరోజు మొత్తం చదివించొచ్చు. రెండు మూడు రోజులు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి చదివించండి. దీనివల్ల వారికి కష్టంగా అనిపించదు. అలాగే చదివిన విషయాలు కూడా గుర్తుంటాయి. 

78
బొమ్మలు
Image Credit : Freepik

బొమ్మలు

పిల్లలు చదివింది మర్చిపోకూడదంటే వారు చదివిన పదాలను బొమ్మలుగా గీయించండి. దీనివల్ల బాగా గుర్తుంటుంది. డూడుల్ వంటి బొమ్మల ద్వారా బోధించండి. రాసిన పదాల కన్నా గీసిన బొమ్మలే పిల్లలకు ఎక్కువగా గుర్తుంటాయి. 

88
ఉదయం ఇవి పెట్టండి
Image Credit : unsplash

ఉదయం ఇవి పెట్టండి

మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్, ప్రోటీన్లు ఉన్న ఆహారాలను బాగా పెట్టండి. ఇవి పిల్లల ఏకాగ్రతను పెంచుతాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. గుడ్లు, తృణధాన్యాల దోశ, పండ్లను పెట్టండి. మర్చిపోకుండా ఇంటి నుంచే వాటర్ బాటిల్ ను ఇవ్వండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Recommended image2
Girl Child: ఇంట్లో ఆడపిల్ల ఉందా? వంట-వార్పు కాదు,కచ్చితంగా నేర్పించాల్సిన 5 విషయాలు ఇవి..!
Recommended image3
Raising Sons: మీకు అబ్బాయి ఉన్నాడా? చిన్నప్పటి నుండే నేర్పాల్సినవి ఇవే..
Related Stories
Recommended image1
Kitchen Hacks: ఇలా చేస్తే బెండకాయ కూర జిగటగా కాదు
Recommended image2
Chia Seeds vs Sabja Seeds: చియా సీడ్స్ vs సబ్జా సీడ్స్.. బరువు తగ్గడానికి ఏవి మంచివి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved