- Home
- Life
- Pregnancy & Parenting
- Chicken During Pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా?
Chicken During Pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా?
చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో చికెన్ తినడానికి భయపడతారు. చికెన్ తింటే వేడిచేస్తుందనో.. లేదా ఇంకేదో అవుతుందనో అపోహ పడతుంటారు. కానీ చికెన్ గర్భిణులకు చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకో.. ఎలా తినాలో ఇక్కడ చూద్దాం.
15

గర్భిణీలు చికెన్ తినచ్చా?
గర్భిణులు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీలో చాలామంది చికెన్ తినడానికి భయపడతారు. మటన్ తింటే మంచిదని భావిస్తారు. కానీ గర్భిణీలు చికెన్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
25
చికెన్ తినడం వల్ల కలిగే లాభాలు
గర్భిణీలు చికెన్ తినడం వల్ల ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. కడుపులోని బిడ్డ వృద్ధికి ఇది చాలా అవసరం. అంతేకాదు చికెన్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. చికెన్ లో ఉండే B6, B12 వంటి విటమిన్లు.. శిశువు శరీర అభివృద్ధికి, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతాయి.
35
చికెన్ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- చికెన్ ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి. సరిగ్గా ఉడకని చికెన్ లో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంది.
- ఫ్రెష్ మాంసం వాడాలి. నిల్వ చేసిన ఫుడ్ తినకపోవడమే మంచిది. స్ట్రీట్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు.
- ఎక్కువ మసాలా వేసిన లేదా ఫ్రై చేసిన చికెన్ కాకుండా.. ఉడికిన లేదా గ్రిల్డ్ చికెన్ తినడం మంచిది.
- బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగడానికి రకరకాల ఇంజెక్షన్లు ఇస్తుంటారు. కాబట్టి అలాంటి చికెన్ తీసుకోవడం మంచిదికాదు. నాణ్యమైన చికెన్ లేదా నాటుకోడి మాంసం తినడం ఉత్తమం.
45
Image Credit : freepik
చికెన్ ఎప్పుడు తినకూడదు:
- మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉన్నపుడు చికెన్ తినకూడదు.
- ప్రెగ్నిన్సీ టైంలో ఎప్పుడైనా చికెన్ తిన్నాక వాంతులు, అలర్జీ వస్తే మరోసారి చికెన్ తినకపోవడమే మంచిది.
- డాక్టర్ నాన్ వెజ్ తినకూడదని చెప్పినప్పుడు.. చికెన్ కి దూరంగా ఉండటం మంచిది.
55
ఇవి గుర్తుంచుకోండి!
గర్భిణులు చికెన్ తినవచ్చు. కానీ మితంగా తినాలి. శుభ్రమైనది, సరిగ్గా ఉడికింది మాత్రమే తీసుకోవాలి. గైనకాలజిస్టు సూచనల ఆధారంగా ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.
Latest Videos