MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • సామాన్యులకు బిగ్ రిలీఫ్.. టమాట ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

సామాన్యులకు బిగ్ రిలీఫ్.. టమాట ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Tomato Prices: ట‌మాట ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. కిలో ధ‌ర ఏకంగా రూ. 80కి చేరింది. దీంతో మార్కెట్లో ట‌మాటను చూడాలంటేనే భ‌య‌పడే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ట‌మాట ధ‌ర‌ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Nov 28 2025, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీగా పెరిగిన ట‌మాట ధ‌ర
Image Credit : Asianet News

భారీగా పెరిగిన ట‌మాట ధ‌ర

టమాటా ధరలు దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరిగి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సాధారణంగా అందుబాటులో ఉన్న ట‌మాట‌, ఇప్పుడు ఒక్క‌సారిగా పెరిగి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కన్స్యూమర్ అఫైర్స్ శాఖ తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 26 నాటికి టమాట రిటైల్ ధర కిలోకు సగటుగా రూ. 52.87. ఒక నెల క్రితం ఇది రూ. 37 ఉండగా, కేవలం 30 రోజుల్లోనే 43 శాతం పెరిగినట్టు కనిపిస్తోంది.

25
దక్షిణం – ఉత్తరం ధరల్లో భారీ తేడా
Image Credit : Getty

దక్షిణం – ఉత్తరం ధరల్లో భారీ తేడా

ఉత్పత్తి ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా రేట్లు కొంత స్థిరంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కిలో టమాటా సుమారు రూ. 31, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 38. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి భిన్నంగా ఉంది. అండమాన్–నికోబార్‌లో రూ. 96, మిజోరాంలో రూ. 92, ఢిల్లీలో రూ. 80, మణిపూర్‌లో రూ. 78, సిక్కింలో రూ. 71గా ఉంది.

Related Articles

Related image1
మరోసారి మొంథాలాంటి తుపాను, ఈసారి దిత్వా పేరుతో అరాచకం.. వ‌చ్చే 4 రోజులు అత్యంత భారీ వర్షాలు
Related image2
మీన రాశిలోకి శని వక్రత్యాగం.. ఈ 5 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
35
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ మరింత ఎక్కువ‌
Image Credit : Getty

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ మరింత ఎక్కువ‌

డిమాండ్ పెరగడంతో ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లలో ధరలు మరింత ఎక్కువయ్యాయి. ఢిల్లీలో బ్లింకిట్‌లో టమాటా కిలో రూ. 110, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రూ. 96, జెప్టోలో రూ. 92కి వెళ్లాయి. ప్రజలపై పడుతున్న ఈ అదనపు భారం తగ్గించేందుకు NCCF కొన్ని ప్రాంతాల్లో రాయితీ ధరలకు టమాటాలు అందించడం ప్రారంభించింది.

45
ఢిల్లీలో రాయితీ టమాటాలు
Image Credit : Getty

ఢిల్లీలో రాయితీ టమాటాలు

దేశ రాజధానిలో ధరలు అదుపుతప్పడంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రవేశించింది. NCCF ద్వారా "జనతా బ్రాండ్" పేరుతో కిలోను రూ. 52కి టమాటాలను అమ్మాలని నిర్ణయించారు. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ఈ చర్య చేపట్టబడింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గత నెలలో వచ్చిన మొంథా తుపాను. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పంటకు భారీ నష్టం జరగడంతో మార్కెట్‌లో సరఫరా తీవ్రంగా తగ్గింది. ఢిల్లీలో అనేక మార్కెట్లలో ధరలు రూ. 80 దాటడానికి ఇది కారణమైంది.

55
త్వరలో ఇతర రాష్ట్రాలకూ..
Image Credit : Getty

త్వరలో ఇతర రాష్ట్రాలకూ..

హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో సరఫరా తగ్గడంతో టోకు, రిటైల్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. దీనికి పరిష్కారంగా ఢిల్లితో ప్రారంభించిన రాయితీ అమ్మకాలను త్వరలో మరిన్ని రాష్ట్రాల్లో అమ‌లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో కొరత ఎక్కువగా ఉండే ఆగస్టు–అక్టోబర్ సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కానీ ఈసారి నవంబర్‌లోనే తక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?
Recommended image2
Deccan odyssey: ఈ రైలు ఎక్కాలంటే రాసిపెట్టుండాలి.. టికెట్ ధ‌ర అక్ష‌రాల రూ. 9 ల‌క్ష‌లు, న‌డిచే ఇంద్ర‌భ‌వ‌నం.
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
మరోసారి మొంథాలాంటి తుపాను, ఈసారి దిత్వా పేరుతో అరాచకం.. వ‌చ్చే 4 రోజులు అత్యంత భారీ వర్షాలు
Recommended image2
మీన రాశిలోకి శని వక్రత్యాగం.. ఈ 5 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved