MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Tamil Nadu Assembly Election 2026 : తమిళనాడు ఎన్నికల డేట్ ఫిక్స్.. స్టాలిన్ పీఠం దక్కేది ఎవరికి? పూర్తి షెడ్యూల్ ఇదే

Tamil Nadu Assembly Election 2026 : తమిళనాడు ఎన్నికల డేట్ ఫిక్స్.. స్టాలిన్ పీఠం దక్కేది ఎవరికి? పూర్తి షెడ్యూల్ ఇదే

Tamil Nadu Assembly Election 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2026ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 15 2026, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే?
Image Credit : our own

ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే?

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం (మార్చి 15) తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించింది. తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

25
తమిళనాడు ఎన్నికల ముఖ్య తేదీలు ఇవే
Image Credit : ChatGPT

తమిళనాడు ఎన్నికల ముఖ్య తేదీలు ఇవే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ స్పష్టమైన కాలక్రమాన్ని విడుదల చేసింది. మార్చి 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది:

• ఎన్నికల నోటిఫికేషన్ (గెజిట్): మార్చి 30, 2026 (సోమవారం)

• నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఏప్రిల్ 6, 2026 (సోమవారం)

• నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7, 2026 (మంగళవారం)

• నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2026 (గురువారం)

• పోలింగ్ తేదీ (ఒకే విడత): ఏప్రిల్ 23, 2026 (గురువారం)

• ఓట్ల లెక్కింపు (ఫలితాలు): మే 4, 2026 (సోమవారం)

• ఎన్నికల ప్రక్రియ ముగింపు: మే 6, 2026 (బుధవారం)

Related Articles

Related image1
Tamil Nadu Assembly Election 2026: మినీ కురుక్షేత్రం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలివే !
Related image2
FASTag : వాహనదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు
35
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు.. 17.4 కోట్ల మంది ఓటర్లు
Image Credit : stockPhoto

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు.. 17.4 కోట్ల మంది ఓటర్లు

ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లలో కలిపి మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాజా ఓటరు జాబితా సవరణల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 5 రాష్ట్రాల్లో 824 నియోజకవర్గాలకు గానూ, 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 25 లక్షల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.

45
రాజకీయ సమరం: స్టాలిన్ వర్సెస్ కూటమి
Image Credit : Asianet News

రాజకీయ సమరం: స్టాలిన్ వర్సెస్ కూటమి

తమిళనాడులోని 234 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు బలమైన కూటముల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని 'సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్' (DMK కూటమి) రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు, బీజేపీ-ఏఐఏడీఎంకే నేతృత్వంలోని 'నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్' (NDA) అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 సీట్లతో విజయం సాధించగా, ఏఐఏడీఎంకే 66, కాంగ్రెస్ 18 స్థానాలను గెలుచుకున్నాయి. అప్పట్లో 76.6 శాతం ఓటింగ్ నమోదైంది.

55
తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
Image Credit : Asianet News

తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

ఎన్నికల తేదీలను ప్రకటించిన నిమిషం నుంచే తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు కొత్త పథకాలను ప్రకటించడం లేదా ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడంపై నిషేధం ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణకు, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషన్ తెలిపింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Modi Speech on Delimitation in Parliament డీ లిమిటేషన్ పైపార్లమెంటులో మోదీ స్పీచ్ | Asianet Telugu
Recommended image2
Now Playing
ఆడపిల్లల్ని కూడా వదల్లేదు బైరెడ్డి శబరి స్పీచ్ కి దద్దరిల్లిన పార్లమెంట్| Asianet News Telugu
Recommended image3
8th Pay Commission : ఉద్యోగుల శాలరీ డబుల్ కాదు ట్రిపుల్.. ఇప్పుడు ఎంతుంటే పెరిగాక ఎంతొస్తుంది..? కొత్త లెక్కలివే
Related Stories
Recommended image1
Tamil Nadu Assembly Election 2026: మినీ కురుక్షేత్రం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలివే !
Recommended image2
FASTag : వాహనదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved