MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మీ పిల్లల్ని కూడా స‌న్‌రూఫ్ కార్ల‌లో తీసుకెళ్తున్నారా.? ఈ వీడియో చూస్తే ద‌డుసుకోవాల్సిందే.

మీ పిల్లల్ని కూడా స‌న్‌రూఫ్ కార్ల‌లో తీసుకెళ్తున్నారా.? ఈ వీడియో చూస్తే ద‌డుసుకోవాల్సిందే.

ఇటీవ‌ల స‌న్‌రూఫ్ కార్ల వినియోగం పెరిగింది. కారు వేగంగా వెళ్తున్న స‌మ‌యంలో పైకి నిల‌బ‌డి చూడ‌డం ఒక గొప్ప అనుభూతని తెలిసిందే. ముఖ్యంగా చిన్నారులు ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే తాజాగా నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం భ‌య‌ప‌డాల్సిందే. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 10 2025, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఊహించ‌ని ప్ర‌మాదం
Image Credit : Generated by google gemini AI

ఊహించ‌ని ప్ర‌మాదం

జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. కర్నాటకలో జరిగిన ఒక ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. బెంగళూరులో ఓ బాలుడు సన్‌రూఫ్ కారులో ఎంజాయ్ చేస్తూ బయటికి నిల‌బ‌డి నిల్చుండగా ఒక్కసారిగా అతడికి ఊహించని ప్రమాదం ఎదురైంది.

25
సన్‌రూఫ్‌లో నిల్చున్న బాలుడికి బారియర్ ఢీ
Image Credit : ThirdEye/X

సన్‌రూఫ్‌లో నిల్చున్న బాలుడికి బారియర్ ఢీ

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఎరుపు టీ-షర్ట్ వేసుకున్న బాలుడు మహీంద్రా కారులో సన్‌రూఫ్ నుంచి బయట నిల్చొని సంతోషంగా గాల్లో తేలినట్టుగా ఫీలవుతున్నాడు. అయితే కారు నడిపే వ్యక్తి ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారియర్‌ను గమనించలేదు. వేగంగా వెళ్లడంతో బాలుడి తలకు బారియర్ బలంగా తగిలింది. అతను కుప్పకూలి వెంటనే కారులో పడిపోయాడు.

Related Articles

Related image1
టారో జాతక ఫలాలు.. ఈ రాశుల వారు స్నేహితుల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి, ముఖ్యంగా..
Related image2
Home Rent: హైదరాబాద్‌లో ఇంటి అద్దె కోసం చూస్తున్నారా.? త‌క్కువ ధ‌ర‌లున్న ప్ర‌దేశాలివే
35
సీసీ కెమెరాల్లో రికార్డు
Image Credit : ThirdEye/X

సీసీ కెమెరాల్లో రికార్డు

ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఘటన చోటుచేసుకున్న ప్రదేశం బెంగళూరులోని విద్యారణ్యపురమని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారి తీస్తోంది.

45
నెటిజన్ల ఆగ్రహం
Image Credit : ThirdEye/X

నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియోను చూసిన నెటిజన్లు డ్రైవర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. రోడ్డుపై స్పష్టంగా బారియర్ ఉండగా కూడా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా పిల్లాడు సన్‌రూఫ్ నుంచి బయటకు చూస్తున్న స‌మ‌యంలో ప‌ట్టించుకోక‌పోవ‌డం తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని అంటున్నారు.

Next time when you leave your kids popping their heads out, think once again! pic.twitter.com/aiuHQ62XN1

— ThirdEye (@3rdEyeDude) September 7, 2025

55
నిపుణుల హెచ్చరిక
Image Credit : ThirdEye/X

నిపుణుల హెచ్చరిక

స‌న్‌రూఫ్ కార్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప‌లువురు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇవి ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నా ప్ర‌మాదాలు పొంచి ఉంటాయ‌ని అంటున్నారు. థ్రిల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టకూడదు. తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని హెచ్చ‌రిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
టారో జాతక ఫలాలు.. ఈ రాశుల వారు స్నేహితుల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి, ముఖ్యంగా..
Recommended image2
Home Rent: హైదరాబాద్‌లో ఇంటి అద్దె కోసం చూస్తున్నారా.? త‌క్కువ ధ‌ర‌లున్న ప్ర‌దేశాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved