MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Oil prices: వంటింటి క‌ష్టాల‌కు చెక్‌.. భారీగా త‌గ్గ‌నున్న వంట నూనె ధ‌ర‌లు. ఎంతో తెలుసా.?

Oil prices: వంటింటి క‌ష్టాల‌కు చెక్‌.. భారీగా త‌గ్గ‌నున్న వంట నూనె ధ‌ర‌లు. ఎంతో తెలుసా.?

కేంద్ర ప్ర‌భుత్వం దిగుమ‌తి సుంకం పెంచిన నేప‌థ్యంలో వంట నూనె ధ‌ర‌లు భారీగా పెరిగిన విష‌యం తెలిసిందే. ఒక లీట‌ర్ నూనె ప్యాకెట్ ఏకంగా రూ. 150 వ‌ర‌కు చేరింది. అయితే తాజాగా పెరిగిన ధ‌ర‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తూ కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 12 2025, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వంట నూనె ధరల పెరుగుదల
Image Credit : stockPhoto

వంట నూనె ధరల పెరుగుదల

సెప్టెంబర్ 2024 తర్వాత వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచ‌డంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా చమురు ధరలు ఎగబాకాయి. ఫలితంగా సామాన్య కుటుంబాల వంటగదిలో ఖర్చు పెరిగిపోయింది. నూనె కొనాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది.

25
ముడి నూనెపై సుంకం తగ్గింపు
Image Credit : stockPhoto

ముడి నూనెపై సుంకం తగ్గింపు

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముడి వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 20% నుంచి 10%కి తగ్గించింది. ఈ తగ్గింపు పొద్దుతిరుగుడు నూనె, సోయాబీన్ ఆయిల్, పామాయిల్‌లపై వర్తిస్తుంది. ఇవి భారతదేశంలో ఎక్కువగా వినియోగించే నూనెలు కావడం వల్ల నూనె ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Related Articles

Related image1
Satya nadella: భ‌విష్య‌త్తులో ఐటీ ఉద్యోగాలు ఎలా ఉండ‌నున్నాయి.? మైక్రోసాఫ్ట్ సీఈఓ ఏం చెప్పారంటే
Related image2
Thalliki Vandanam: ఏపీలో తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు.. అమల్లోకి కొత్త పథకం
35
సామాన్యుల‌పై భారం
Image Credit : stockPhoto

సామాన్యుల‌పై భారం

సెప్టెంబర్‌లో తీసుకున్న దిగుమతి సుంకం పెంపు నిర్ణయం దేశీయ పరిశ్రమకు అండ‌గా నిలిచిన‌ప్ప‌టికీ అది వినియోగదారులపై ప్రభావం చూపింది. అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు పెరగడంతో, వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావంగా ధరలు అదుపు తప్పి సామాన్యులపై భారం పడింది.

45
సుంకాల్లో వ్యత్యాసం
Image Credit : stockPhoto

సుంకాల్లో వ్యత్యాసం

ముడి నూనె అంటే శుద్ధి చేయకుండా దిగుమతి చేసిన ఆయిల్‌. శుద్ధి చేసిన నూనె అంటే పూర్తిగా ప్రాసెస్ చేసి, వినియోగానికి సిద్ధంగా నూనె. ఇప్పటివరకు రెండింటి మధ్య దిగుమతి సుంకం వ్యత్యాసం 8.75% మాత్రమే ఉండేది. ఇప్పుడు ముడి నూనెపై సుంకం తగ్గడంతో ఆ వ్యత్యాసం 19.25%కి పెరిగింది.

55
ఈ నిర్ణ‌యంతో ఏం జ‌ర‌గ‌నుంది.?
Image Credit : stockPhoto

ఈ నిర్ణ‌యంతో ఏం జ‌ర‌గ‌నుంది.?

ఈ మార్పుతో భారతదేశంలో ముడి నూనెను దిగుమతి చేసుకుని ఇక్కడే శుద్ధి చేయడానికి కంపెనీలు మొగ్గు చూపుతాయి. ఇది దేశీయ ఆయిల్‌ రిఫైనింగ్ పరిశ్రమకు మేలు చేస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో శుద్ధి చేసిన నూనె దిగుమతి తగ్గుతుంది. ఈ మార్పులు కలిసివచ్చి వంట నూనె ధ‌ర‌లు కొంత‌మేర త‌గ్గే అవ‌కాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
భారత దేశం
వ్యాపారం

Latest Videos
Related Stories
Recommended image1
Satya nadella: భ‌విష్య‌త్తులో ఐటీ ఉద్యోగాలు ఎలా ఉండ‌నున్నాయి.? మైక్రోసాఫ్ట్ సీఈఓ ఏం చెప్పారంటే
Recommended image2
Thalliki Vandanam: ఏపీలో తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు.. అమల్లోకి కొత్త పథకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved