మే ఫస్ట్ నుండి రైల్వే రూల్స్ ఛేంజ్ ... ఆ టికెట్ తో అలా ప్రయాణిస్తే భారీ జరిమానాలు
Indian Railway New Rules: 1 మే, 2025 నుండి ఇండియన్ రైల్వే ప్రయాణీకుల టిక్కెట్లకు సంబంధించి పెద్ద మార్పు చేసింది. దీనివల్ల ప్రయాణీకులకు ప్రయాణంలో అసౌకర్యం నుండి ఉపశమనం లభిస్తుంది.

Indian Railways
1 మే 2025 నుండి రైల్వే పెద్ద మార్పు చేయనుంది. దీని ప్రకారం వెయిటింగ్ టికెట్ తో ఎవరూ ఏసీ లేదా స్లీపర్ బోగీలోకి ప్రవేశించలేరు.
Indian Railways
కొత్త నియమాల ప్రకారం, వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులు జనరల్ బోగీలో మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఎవరైనా స్లీపర్ లేదా ఏసీలోకి బలవంతంగా ప్రవేశిస్తే, వారికి భారీ జరిమానా విధించబడుతుంది.
Indian Railways
మే 1 నుండి వెయిటింగ్ టికెట్ తో స్లీపర్ బోగీలో ప్రయాణిస్తే కనీసం 250 రూపాయలు జరిమానా విధించబడుతుంది. దూరాన్ని బట్టి నిర్ణయించిన ఛార్జీలు వేరుగా వసూలు చేస్తారు.
Indian Railways
వెయిటింగ్ టికెట్ తో సెకండ్ లేదా థర్డ్ ఏసీ బోగీలో ప్రయాణిస్తే కనీసం 440 రూపాయలు జరిమానా, దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. టిటిఇ మిమ్మల్ని జనరల్ బోగీకి పంపించే అధికారం కలిగి ఉంటారు.
Indian Railways
ఆన్‌లైన్ వెయిటింగ్ టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. కానీ కౌంటర్ నుండి తీసుకున్న టికెట్లతో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తారు, దీనివల్ల ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది.
Indian Railways
అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నియమాల్లో కూడా రైల్వే మార్పులు చేసింది. ముందు 4 నెలలు అంటే 120 రోజుల ముందు బుక్ చేసుకునేవారు, ఇప్పుడు 2 నెలలు అంటే 60 రోజులకు తగ్గించారు.