- Home
- National
- operation Sindoor: ఉగ్రవాదులు భారత్ లోకి రావాలంటే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి..భారత సైన్యం
operation Sindoor: ఉగ్రవాదులు భారత్ లోకి రావాలంటే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి..భారత సైన్యం
పహల్గాం దాడిలో 25 మంది భారతీయులను, ఒక నేపాలీని చంపేశారు. ముంబైలోనూ 9/11 ఘటనలోనూ చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇప్పటి వరకు భారత్ లో జరిగిన అతి పెద్ద ఘటన ఇదే అని కేంద్ర ప్రకటించింది.

అతి పెద్ద ఘటన ఇదే
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ… ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని ఇంటెలిజెన్స్ శాఖ ఇప్పటికే గుర్తించినట్టు వెల్లడించారు.
ఈ దాడి, జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ఉద్దేశించిందేనని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడే మొదలైనదని, ఇది ఇంకా కొనసాగుతుందని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించామని వారు తెలిపారు.
పహల్గాం దాడిలో 25 మంది భారతీయులను, ఒక నేపాలీని చంపేశారు. ముంబైలోనూ 9/11 ఘటనలోనూ చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇప్పటి వరకు భారత్ లో జరిగిన అతి పెద్ద ఘటన ఇదే అని కేంద్ర ప్రకటించింది.
ముఖ్యంగా పహల్గాం దాడిలో కుటుంబ సభ్యుల మధ్యనే అత్యంత దారుణంటా.. చంపేశారని కేంద్ర వివరించింది. ఇకపై ఇలాంటి ఉగ్ర వాదుల ఆగడాలను ఏమాత్రం సహించేది లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు.
ఉగ్రవాదుల పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలను తప్పుదోవ పట్టించిందని మిశ్రా పేర్కొన్నారు.పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తు ఉన్నా..దానిని ఆపేయాలని చాలాశాంతంగా ,అనేక సార్లు పలు దౌత్యమార్గాల ద్వారా అడిగినప్పటికీ వారి తీరు మారలేదు. పాక్ వినకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందన్నారు.తీవ్ర వాదులు భారత్ లోకి రావడానికి భయపడే విధంగా తాజా దాడులను తీవ్రవాదుల స్థావరాల పై నిర్వహించమని తెలిపారు.
తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యం చేసుకుని వాటిని ధ్వంసం చేశామని .. కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు. ఈ క్యాంపులు పాకిస్తాన్, పీవోకేలో ఉన్నాయని తెలిపారు. ట్రైనింగ్ క్యాంపుల వివరాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఇలాంటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వివరించారు. విశ్వసనీయ ఇంటెలిజెన్స్ ఇచ్చిన వివరాల ఆధారంగా.. ఈ దాడులు చేశామన్నారు. సామన్య పౌరులకు వారి ఆస్తులకు ఏమాత్రం నష్టం జరుగకుండా దాడులు చేశామని వివరించారు.
మురిడ్కేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతం. మాలిక్‌తో పాటు మరో ఉగ్ర నేత ముదాసిర్ కూడా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
ఆపరేషన్ సింధూర్"
బుధవారం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ లక్ష్యంగా దాడి చేసింది. దీనికి "ఆపరేషన్ సింధూర్" అని పేరు పెట్టారు.ఉదయం 1:44 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను "లక్ష్యపూర్వకమైనవి, ఉద్రిక్తతను పెంచనివి" అని అభివర్ణించింది. కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని ఈ దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది.
అంధకారంలో పాక్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది. "ఆపరేషన్ సింధూర్" పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి.భారత్ విరుచుకుపడిన తరువాత పాక్ ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.దీంతో ప్రస్తుతం పాక్ ప్రజలంతా అంధకారంలో ఉన్నారు.
విజయమే ఎదురుగా
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం మే 6-7 మధ్య రాత్రి 1:13 గంటలకు భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడి చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ దాడిలో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు.దాడి జరిగిన మరుసటి రోజే భారత సైన్యం సోషల్ మీడియాలో ఒక సందేశం పోస్టు చేసింది:“ప్రహారాయ సన్నిహిత, జయ ప్రక్షిత”అంటే — దాడి సమీపంలో ఉంది, విజయమే ఎదురుగా ఉంది అని అర్థం
సింధూరానికి ప్రత్యేక ప్రాధాన్యత
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత వైమానిక దళం దాడులకు దిగి ఉగ్రస్థావరాలను లేపేసింది.ఈ దాడుల్లో ఇప్పటి వరకు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.పహల్గాంలో జరిగిన దాడిలో ఉగ్రవాదులు మతాన్ని ఆధారంగా చేసుకుని 26 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందువులపై దాడి జరిగినందున, సింధూరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు.
సింధూరం హిందూ మహిళలకు పవిత్రమైనది. హైందవ మహిళలు నిత్యం తమ నుదుటన సింధూరాన్ని ధరిస్తారు. ఆ దాడిలో భర్తలను కోల్పోయిన ఎంతో మంది మహిళలు ఉన్నారు. ఇది సంఘటనకు ఒక భావోద్వేగ కోణాన్ని ఇస్తోంది. దీనిని ప్రధానంగా తీసుకునే ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా పహల్గాం దాడిలో కుటుంబ సభ్యుల మధ్యనే అత్యంత దారుణంటా.. చంపేశారని కేంద్ర వివరించింది. ఇకపై ఇలాంటి ఉగ్ర వాదుల ఆగడాలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.