Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటివరకు జరిగిన టాప్ 10 పరిణామాలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దూకుడుగా ముందుకు వెళుతోంది. తాజాగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత యుద్దవిమానాలు ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసాయి. ఇలా ఇప్పటిరకు ఆపరేషన్ సింధూర్ లో జరిగిన టాప్ 10 పరిణామాలివే.

Operation Sindoor
Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. మంగళవారం అర్ధరాత్రి నుండి పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఇప్పటికే భారత యుద్దవిమానాలు పాకిస్థాన్ భూభాగంలో బాంబులు కురిపించాయి.
Operation Sindoor
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత్ వైమానిక దాడులకు దిగింది. ఇలా లష్కర్-ఎ-తోయిబా స్థావరాలతో పాటు కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. అర్ధరాత్రి పాకిస్థాన్ పై దాడులు చేపట్టి ఉగ్రమూకల పనిపట్టింది భారత ఆర్మీ.
Operation Sindoor
ఆపరేషన్ సింధూర్ టాప్ 10 ముఖ్యాంశాలు
1. ఆపరేషన్ సింధూర్‌లో వైమానిక దళం, సైన్యం, నౌకాదళం కలిసి పనిచేశాయి.
2. డ్రోన్లు, రాఫెల్ యుద్ధ విమానాలతో పాకిస్థాన్ భూభాగంపై దాడులు జరిపారు.
3. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ సిందూర్ ను పర్యవేక్షించారు.
4. పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి విజయవంతమైందని సైన్యం ప్రకటించింది.
5. మురీద్కేలో లష్కర్-ఎ-తోయిబా స్థావరం పూర్తిగా ధ్వంసమయ్యింది.
Operation Sindoor
6. బహవల్పూర్‌లో జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం ధ్వంసం.
7. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా వంటి దేశాలకు భారత్ సమాచారం అందించింది.
8. దాడుల తర్వాత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అమెరికా ఎన్ఎస్ఏ, విదేశాంగ మంత్రితో మాట్లాడారు.
9. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ భారత్ దాడిని ఖండించారు.
10. శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు రద్దు.
Operation Sindoor
పాక్ ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ప్రకారం, కోట్లీ, మురీద్కే, బహావల్పూర్, ముజాఫ్ఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మురీద్కేలో లష్కర్-ఎ-తయిబా ప్రధాన కేంద్రం ఉంది, ఇది హఫీజ్ సయీద్ నిర్వహిస్తున్న సంస్థ. బహావల్పూర్‌లో మసూద్ అజహర్ ఆధ్వర్యంలోని జైషే మహమ్మద్ కు బేస్ ఉంది.
భారత దాడుల లక్ష్యం ఉగ్రవాద నిర్మూలన మాత్రమే. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం తలెత్తిందని స్పష్టం చేసింది.