MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Toll Charges: బైక్‌ల‌కు కూడా టోల్ ట్యాక్స్.? కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న

Toll Charges: బైక్‌ల‌కు కూడా టోల్ ట్యాక్స్.? కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న

జాతీయ ర‌హ‌దారాలపై ప్ర‌యాణించాలంటే టోల్ ట్యాక్స్ చెల్లించాల‌నే విష‌యం తెలిసిందే. అయితే ఇది కేవ‌లం ఫోర్ వీల‌ర్‌తో పాటు లారీల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అయితే త్వ‌ర‌లో బైక్‌లు కూడా ట్యాక్స్‌లు చెల్లించాల‌నే ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 26 2025, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టూ వీల‌ర్స్‌కు టోల్ ట్యాక్స్
Image Credit : our own

టూ వీల‌ర్స్‌కు టోల్ ట్యాక్స్

జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్‌ అమలవుతుందన్న వార్తలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్త‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని కేంద్రం ఖండించింది. జాతీయ రహదారులపై టూ వీలర్స్‌కు ఎలాంటి టోల్ ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉన్న విధానమే కొనసాగుతుందని తెలియజేసింది.

25
నకిలీ ప్రచారాన్ని ఖండించిన నితిన్ గడ్కరీ
Image Credit : Google

నకిలీ ప్రచారాన్ని ఖండించిన నితిన్ గడ్కరీ

మీడియా చానెళ్లలో వస్తున్న తప్పుదారి పట్టించే కథనాలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. "భవిష్యత్‌లో కూడా టూ వీలర్స్‌పై టోల్ పన్ను విధించే ఉద్దేశం లేదు. అలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు" అని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించేలా వార్తలు ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

📢 महत्वपूर्ण 

कुछ मीडिया हाऊसेस द्वारा दो-पहिया (Two wheeler) वाहनों पर टोल टैक्स लगाए जाने की भ्रामक खबरें फैलाई जा रही है। ऐसा कोई निर्णय प्रस्तावित नहीं हैं। दो-पहिया वाहन के टोल पर पूरी तरह से छूट जारी रहेगी। बिना सच्चाई जाने भ्रामक खबरें फैलाकर सनसनी निर्माण करना स्वस्थ…

— Nitin Gadkari (@nitin_gadkari) June 26, 2025

Related Articles

Related image1
Hyderabad: ఈ ఏరియా మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొంటే కోట్లు కురుస్తాయి.
Related image2
Creditcard: క్రెడిట్ కార్డున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. ఆ బిల్లు ఎవ‌రు చెల్లించాలి? చ‌ట్టం ఏం చెబుతోంది.?
35
ఫాస్టాగ్ కూడా తప్పనిసరి కాదు
Image Credit : Gemini

ఫాస్టాగ్ కూడా తప్పనిసరి కాదు

ఇటీవల టూ వీలర్స్‌కు ఫాస్టాగ్ తప్పనిసరి అన్న ప్రచారం జరిగినప్పటికీ, అది సత్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఫోర్ వీలర్స్, లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ విధానం వర్తిస్తుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వివరించింది.

45
ఎక్స్‌ప్రెస్‌వేలలో ద్విచక్ర వాహనాలకు నిషేధం మాత్రం యథాతథం
Image Credit : META AI

ఎక్స్‌ప్రెస్‌వేలలో ద్విచక్ర వాహనాలకు నిషేధం మాత్రం యథాతథం

టోల్ మినహాయింపు ఉన్నా, కొన్ని యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు (Expressways)లో ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని చట్టం ద్వారా నిషేధించారు. అక్కడ భద్రతా కారణాల వల్ల మాత్రమే టూ వీలర్స్‌కు అనుమతించరు.

55
త‌ప్పులు స‌మాచారం న‌మ్మొద్దు
Image Credit : META AI

త‌ప్పులు స‌మాచారం న‌మ్మొద్దు

ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ ఉందన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, నకిలీ వార్తలను వ్యాపింపచేయకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ధృవీకరించని వార్తలతో ప్రజలు అయోమయానికి గురికావొద్దని, సోషల్ మీడియా వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

#FactCheck: Some sections of the media have reported that the Government of India plans to levy user fees on two-wheelers. #NHAI would like to clarify that no such proposal is under consideration. There are no plans to introduce toll charges for two-wheelers. #FakeNews

— NHAI (@NHAI_Official) June 26, 2025

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
Hyderabad: ఈ ఏరియా మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొంటే కోట్లు కురుస్తాయి.
Recommended image2
Creditcard: క్రెడిట్ కార్డున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. ఆ బిల్లు ఎవ‌రు చెల్లించాలి? చ‌ట్టం ఏం చెబుతోంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved