MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Modi Birthday: మొస‌లిని ఇంటికి తీసుకొచ్చిన న‌రేంద్ర మోదీ.. ప్ర‌ధాని జీవితంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Modi Birthday: మొస‌లిని ఇంటికి తీసుకొచ్చిన న‌రేంద్ర మోదీ.. ప్ర‌ధాని జీవితంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Modi Birthday: న‌రేంద్ర మోదీ బుధవారం 75వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. న‌వ‌భార‌త నిర్మాణమే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పే మోదీ గారు ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మోదీ జీవితంలోని కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 17 2025, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్ననాటి జీవితం, కుటుంబ నేపథ్యం
Image Credit : Generated by google gemini AI (Representative image)

చిన్ననాటి జీవితం, కుటుంబ నేపథ్యం

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 1950 సెప్టెంబర్ 17న వాద్ నగర్ (అప్పట్లో బాంబే స్టేట్, ప్రస్తుతం గుజరాత్‌లో) జన్మించారు. ఆయన కుటుంబం చాలా సాధారణ స్థితిలో ఉండేది. తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ ఒక టీ దుకాణం నడిపేవారు. చిన్ననాటి నుంచి నరేంద్ర మోదీ కూడా ఆ దుకాణంలో సహాయం చేసేవారు. ఆరుగురు పిల్లల్లో ఆయన మూడో సంతానం. సాధారణ కుటుంబంలో పెరిగిన ఈ అనుభవం ఆయనలో కష్టపడి పని చేసే మనస్తత్వాన్ని, సూటిగా మాట్లాడే శైలిని, సాధారణ ప్రజలతో కలిసిపోయే స్వభావాన్ని పెంచింది.

25
మొస‌లిని ఇంటికి తీసుకొచ్చిన మోదీ
Image Credit : Getty

మొస‌లిని ఇంటికి తీసుకొచ్చిన మోదీ

నరేంద్ర మోదీ చిన్ననాటి నుంచే ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయన కూడా చాలా సార్లు స్వయంగా తెలిపారు. 2019లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మోదీ పంచుకున్న తన చిన్ననాటి జ్ఞాప‌కం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మోదీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చిన్నప్పుడు ఒకసారి కొలనులో ఈత కొడుతూ ఉండగా, అక్కడ ఒక చిన్న మొసలిని గమనించారు. ఆ జంతువును పట్టుకుని ఇంటికి తీసుకువెళ్లారు. కానీ, తల్లి చూసి గట్టిగా మందలించడంతో, వెంటనే తిరిగి ఆ మొసలిని కొలనులో వదిలిపెట్టారని ఆయన గుర్తుచేసుకున్నారు. మోదీ చిన్న‌నాటి అనుభవం విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తమిళనాడులోని ఒక ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం, మొదటి తరగతి పిల్లల కోసం ఆయన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను పాఠంలో చేర్చింది.

Related Articles

Related image1
GST: జీఎస్టీ మార్పుతో ఇంటి నిర్మాణం చ‌వ‌క‌.. 60 గ‌జాల్లో ఇల్లు క‌డితే ఎంత అవుతుందో తెలుసా?
Related image2
NPCI: మ‌నీ విత్‌డ్రా చేయ‌డానికి ఏటీఎమ్ అవ‌స‌రం లేదు.. ఫోన్‌పేతో డ‌బ్బులు వ‌చ్చేస్తాయ్
35
మోదీకి ఇష్ట‌మైన ఆహారం ఏంటి.?
Image Credit : Getty

మోదీకి ఇష్ట‌మైన ఆహారం ఏంటి.?

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పూర్తిగా శాఖాహారాన్ని తీసుకుంటారు. త‌క్కువ మోతాదులోనే త‌న భోజ‌నం ఉండేలా చూసుకుంటారు. 75 ఏళ్ల‌లోనూ ఇంత యాక్టివ్‌గా ఉండ‌డానికి త‌న ఫుడ్ స్టైల్ కార‌ణ‌మ‌ని చెబుతుంటారు. ఇక మోదీకి ఫూల్ మ‌ఖానా, మిల్లెట్స్‌, బ్రౌన్ రైస్‌, మున‌గాకు ప‌రాటా, కిచిడీ, శ్రీఖండ్‌, డోక్లా, లిట్టి చొఖానిని ఎంతో ఇష్టంగా తింటారు. ఆహారాన్ని రోజూ ఒకే మోతాదులో తీసుకోవ‌డం మోదీ అల‌వాటు.

45
మోదీ అల‌వాట్లు ఏంటి.?
Image Credit : Getty

మోదీ అల‌వాట్లు ఏంటి.?

రాజ‌కీయంగా ఎంత బిజీగా ఉన్నా ప్ర‌ధాని కొన్ని ఇష్టాల‌ను మాత్రం కొన‌సాగిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ల వ‌య‌సు నుంచే మోదీకి ఫొటోగ్ర‌ఫీ అంటే ఇష్టం. ఏమాత్రం ఖాళీ స‌మ‌యం దొరికినా కెమెరా ప‌ట్టుకుని వెళ్లేవారు. ఇప్ప‌టికీ పలు జాతీయ పార్కుల్లో మోదీ కెమెరాతో ద‌ర్శ‌న‌మిచ్చిన ఫొటోలు క‌నిపిస్తుంటాయి. ఇక మోదీకి క‌విత్వంపై కూడా చాలా ఆస‌క్తి. ఖాళీ స‌మ‌యం దొరికితే చాలు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, క‌విత‌లు రాస్తుంటారు.

55
వీధి నాట‌కాలు కూడా
Image Credit : Getty

వీధి నాట‌కాలు కూడా

మోదీ గురించి చాలా మందికి తెలియని విష‌యాల్లో ఇదీ ఒక‌టి. న‌రేంద్ర మోదీ చిన్న‌త‌నంలో వీధి నాట‌కాలు కూడా వేసేవారు. చ‌దువు, ఆట‌ల‌తో పాటు స్టేజీ నాట‌కాలు అంటే కూడా మోదీకి ఇష్టం. అయితే నాట‌కాల ద్వారా వ‌చ్చే డ‌బ్బును కూడా స‌మాజానికే ఉప‌యోగించే వారు మోదీ. నాట‌కం వేయంగా వ‌చ్చిన డ‌బ్బుతో దెబ్బ‌తిన్న స్కూల్ గోడ‌ను బాగు చేయించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నరేంద్ర మోదీ
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
GST: జీఎస్టీ మార్పుతో ఇంటి నిర్మాణం చ‌వ‌క‌.. 60 గ‌జాల్లో ఇల్లు క‌డితే ఎంత అవుతుందో తెలుసా?
Recommended image2
NPCI: మ‌నీ విత్‌డ్రా చేయ‌డానికి ఏటీఎమ్ అవ‌స‌రం లేదు.. ఫోన్‌పేతో డ‌బ్బులు వ‌చ్చేస్తాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved