MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Appliances: భారీగా పెర‌గనున్న టీవీ, ఫ్రిడ్జ్‌, ఏసీల ధ‌ర‌లు.. కార‌ణం ఏంటో తెలుసా.?

Appliances: భారీగా పెర‌గనున్న టీవీ, ఫ్రిడ్జ్‌, ఏసీల ధ‌ర‌లు.. కార‌ణం ఏంటో తెలుసా.?

భార‌త ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే కొత్త ఈ వేస్ట్ పాల‌సీని తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ నిర్ణ‌యంపై పలు ఎల‌క్ట్రానిన్ సంస్థ‌లు న్యాయ పోరాటానికి దిగాయి. ప్ర‌భుత్వం కొత్త పాల‌సీని తీసుకొస్తే వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా పెంచాల్సి వ‌స్తాయ‌ని చెబుతున్నాయి.

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 04 2025, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్ర‌భుత్వ తీరును వ్య‌తిరేకిస్తున్న కంపెనీలు
Image Credit : our own

ప్ర‌భుత్వ తీరును వ్య‌తిరేకిస్తున్న కంపెనీలు

భారత ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త ఈ-వేస్ట్ పాలసీపై దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీలు ఎల్జీ (LG), సామ్‌సంగ్ వంటి కంపెనీలు న్యాయపరంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పాలసీ ప్రకారం, ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసే సంస్థలకు కంపెనీలు కిలోకు రూ. 22 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

25
మూడింత‌లు కానున్న వ్య‌యం
Image Credit : freepik

మూడింత‌లు కానున్న వ్య‌యం

ఈ విధానం అమ‌ల్లోకి వ‌స్తే కంపెనీలపై రీసైక్లింగ్ వ్యయం మూడు రెట్లు పెరగనుందని, దీని ప్రభావం ఉత్పత్తుల ధరలపై పడే అవకాశం ఉందని కంపెనీలు కోర్టు ముందుకు వెళ్లాయి. మ‌రీ ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ పై సంస్థ‌లు భారీగా ధ‌ర‌లు పెంచే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ-వేస్ట్ దేశంగా

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. కానీ ఇందులో ఎక్కువ శాతం అనధికార రీసైక్లింగ్‌ ద్వారా జరుగుతుంది. కొత్త పాలసీలో ఈ నిబంధనల వల్ల వ్యయ భారం కంపెనీలపై పడుతుంది కానీ, నిషిద్ధ రీసైక్లింగ్‌పై మాత్రం ప్రభావం తక్కువగా ఉంటుందని కంపెనీలు వాదిస్తున్నాయి.

Related Articles

Related image1
Metro train: ఏపీ ప్ర‌జ‌ల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. ఆ రెండు న‌గ‌రాల్లో మెట్రో ట్రైన్‌, తొలి అడుగు ప‌డింది..
Related image2
Tata altroz facelift: రూ. 13 వేల EMIతో ఈ స్ట‌న్నింగ్ కారును సొంతం చేసుకోండి.. డౌన్ పేమెంట్ ఎంతంటే
35
ధ‌ర‌లు ఎంత పెర‌గ‌నున్నాయి.?
Image Credit : Freepik

ధ‌ర‌లు ఎంత పెర‌గ‌నున్నాయి.?

కొత్త ఈ వేస్ట్ పాల‌సీ అమ‌ల్లోకి వ‌స్తే టీవీల ధ‌రలు గ‌రిష్టంగా రూ. 3 వేల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది. ఇక ఫ్రిజ్‌ల విష‌యానికొస్తే రూ. 1500 నుంచి రూ. 3 వేల వ‌ర‌కు పెరుగుతాయి. వాషింగ్ మెషీన్లు, ఏసీలు రూ. 2 వేల‌కిపైగా ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

వ‌చ్చే 2 నుంచి 3 నెల్లో ఈ ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు. ద‌స‌రా, దీపావ‌ళి సీజ‌న్‌లో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు కొనుగోలు చేసే వారి జేబుల‌కు చిల్లు

45
కంపెనీల వాద‌న ఏంటంటే.?
Image Credit : Getty

కంపెనీల వాద‌న ఏంటంటే.?

కొత్త పాలసీ వల్ల కస్టమర్లపై ఆర్థిక భారం పడుతుందని ఎల్జీ, సామ్‌సంగ్ వంటి కంపెనీల‌తో పాటు డైకిన్, టాటా వోల్టాస్, హావెల్స్, బ్లూస్టార్ వంటి కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే కోర్టులో పిటిష‌న్స్ వేశాయి కూడా. కంపెనీలు త‌మ లాభాలు త‌గ్గించుకోవాలి లేదా వినియోగ‌దారులపై భారం మోపాల్సి వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

55
ప్రభుత్వం ఏమంటోంది?
Image Credit : Asianet News

ప్రభుత్వం ఏమంటోంది?

భారత ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఈ-వేస్ట్ నిర్వహణ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, కంపెనీల వ్యాజ్యాలపై అధికారిక స్పందన ఇంకా రాలేదు. మ‌రి ఎల‌క్ట్రానిక్ సంస్థ‌ల వాద‌న‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందా.? అస‌లేం జ‌ర‌గ‌నుందో చూడాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?
Recommended image2
Deccan odyssey: ఈ రైలు ఎక్కాలంటే రాసిపెట్టుండాలి.. టికెట్ ధ‌ర అక్ష‌రాల రూ. 9 ల‌క్ష‌లు, న‌డిచే ఇంద్ర‌భ‌వ‌నం.
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
Metro train: ఏపీ ప్ర‌జ‌ల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. ఆ రెండు న‌గ‌రాల్లో మెట్రో ట్రైన్‌, తొలి అడుగు ప‌డింది..
Recommended image2
Tata altroz facelift: రూ. 13 వేల EMIతో ఈ స్ట‌న్నింగ్ కారును సొంతం చేసుకోండి.. డౌన్ పేమెంట్ ఎంతంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved