- Home
- National
- India Pakistan War: భారత్ POKని తిరిగి తీసుకోగలదా.? దీని వెనకాల ఉన్న సమస్యలు ఏంటి
India Pakistan War: భారత్ POKని తిరిగి తీసుకోగలదా.? దీని వెనకాల ఉన్న సమస్యలు ఏంటి
1971 తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఈ స్థాయి ఉద్రిక్తతలు నెలకొనడం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. భారత్ పీఓకేను తిరిగి తీసుకోవాలనే డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో ఇది ఎంత వరకు సాకారమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మే 8వ తేదీ అర్థరాత్రి పాకిస్తాన్ పలు భారత రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా, భారత్ కూడా దీన్ని తక్షణమే ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని పలు నగరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. ఈ సమయంలో దేశ ప్రజలంతా ఒకే మాట చెబుతున్నారు ఇప్పుడు POKను తిరిగి స్వాధీనం చేసుకునే సరైన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
POK అంటే ఏమిటి? ఎంత విస్తీర్ణంలో ఉంది?
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు. గిల్గిట్ – బాల్టిస్తాన్: ఇది సుమారు 64,817 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. POK (అజాద్ కాశ్మీర్): ఇది 13,297 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.
POKపై పాక్ ఆక్రమణ ఎలా జరిగింది?
1947లో స్వాతంత్య్ర సమయంలో జమ్మూ కాశ్మీర్ రాజు హరి సింగ్ పాలనలో ఉండేది. ఆర్థిక భారం పెరగడంతో స్థానిక ముస్లింలలో అసంతృప్తి చెలరేగింది. ఇదే సమయంలో పాక్ష్టూన్లు కాశ్మీర్‌లోకి చొచ్చుకొచ్చారు. భయపడిన రాజు హరి సింగ్ భారతదేశాన్ని ఆశ్రయించి, విలీన ఒప్పందంపై సంతకం చేశాడు. దీంతో భారత సైన్యం పాకిస్తాన్ మద్దతుదారులను వెనక్కు పంపింది.
అయితే అప్పటికే పాకిస్తాన్ గిల్గిట్, బాల్టిస్తాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించేసింది. తర్వాత నెహ్రూ ఐక్యరాజ్యసమితికి వెళ్లారు. అక్కడ సదరు దేశాలు తమ సైనిక దళాలు ఉపసంహరించుకోవాలని తీర్మానం తీసుకున్నా పాకిస్థాన్ అమలు చేయలేదు.
POKని బలవంతంగా తీసుకోలేమా?
POKపై హక్కు భారతదేశానిదే అయినా, ఇది ఒక అంతర్జాతీయంగా ఉన్న వివాదం. దాన్ని బలవంతంగా తిరిగి తీసుకోవడం అనేది చాలా సంక్లిష్టం. భారత్ తరఫున శాంతియుతంగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి కూడా మధ్యవర్తిత్వం చేసింది కానీ స్పష్టమైన పరిష్కారం రాలేదు.
పాకిస్తాన్ నుంచి స్వతంత్రంగా వెనక్కు వచ్చే అవకాశముందా?
పాకిస్తాన్ స్వయంగా POKను భారత్‌కు అప్పగించే అవకాశం చాలా తక్కువ. గతంలో ఎన్నో ఒప్పందాలు, చర్చలు విఫలమయ్యాయి. శాంతియుత మార్గాలన్నీ దాదాపు విఫలమవుతున్న తరుణంలో, భారత్‌కు యుద్ధం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.
India Pakistan War Tension
యుద్ధం చివరి దశగా మారుతుందా?
భారత్‌ను ఉద్దేశించి పాక్ రెచ్చగొట్టే చర్యలు చేస్తున్న నేపథ్యంలో, దేశ భద్రత దృష్ట్యా యుద్ధం ద్వారా POKను స్వాధీనం చేసుకోవడం అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పౌరులు, విశ్లేషకులు, రక్షణ నిపుణులంతా ఇది ఇప్పుడు సరైన సమయమని భావిస్తున్నారు. మరి ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.