MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Free Train: భారత్‌లోని ఈ రైలులో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు.. టికెట్ అవ‌స‌రం లేదు, ఎక్క‌డంటే

Free Train: భారత్‌లోని ఈ రైలులో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు.. టికెట్ అవ‌స‌రం లేదు, ఎక్క‌డంటే

Free Train: రైలు ప్రయాణం అంటే టికెట్ తప్పనిసరి అని తెలిసిందే. కానీ రైలు మాత్రం ప్రయాణికుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయ‌కుండా గ‌త 75 ఏళ్లుగా సేవ‌లందిస్తోంది. ఇంత‌కీ ఏంటా ట్రైన్‌, ఎక్క‌డ న‌డుస్తుంది.? ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 04 2026, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ ఉచిత రైలు ఎక్కడ నడుస్తుంది?
Image Credit : Gemini AI

ఈ ఉచిత రైలు ఎక్కడ నడుస్తుంది?

ఈ రైలు పంజాబ్ రాష్ట్రం నాంగల్ – భాఖ్రా మధ్య నడుస్తుంది. మొత్తం దూరం సుమారు 13 కిలోమీటర్లు. ఇప్పటికీ ఈ రైలు డీజిల్ ఇంజిన్‌తోనే నడుస్తోంది. పాత తరహా చెక్క బోగీలను ఉపయోగిస్తుండటం ఈ రైలు ప్రత్యేకత.

24
అసలు కారణం ఏంటి?
Image Credit : Getty

అసలు కారణం ఏంటి?

ఈ ఉచిత రైలు సేవ 1948లో ప్రారంభమైంది. ఆ స‌మ‌యానికి భాఖ్రా నాంగల్ డ్యామ్ నిర్మాణం జరుగుతోంది. కార్మికులు, ఇంజినీర్లు, భారీ యంత్రాలు డ్యామ్ ప్రాంతానికి చేరుకోవడానికి ఈ రైలును ఉపయోగించారు. డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఈ సేవ అవసరంగా మారింది.

Related Articles

Related image1
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సెన్సిటివ్‌.. బాధ‌, కోపం రెండూ ఎక్కువే
Related image2
తెలంగాణ‌లోని ఈ న‌గ‌రం మ‌రో హైద‌రాబాద్ కావ‌డం ఖాయం.. ఎయిర్‌పోర్ట్ స‌హా కీల‌క ప్రాజెక్టులు
34
డ్యామ్ పూర్తయ్యాక కూడా ఉచితంగా
Image Credit : Asianet News

డ్యామ్ పూర్తయ్యాక కూడా ఉచితంగా

డ్యామ్ నిర్మాణం తర్వాత భాఖ్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు (BBMB) ఈ రైలును ఉచితంగానే కొనసాగించాలని నిర్ణయించింది. దీనికి ప్ర‌ధాన కార‌ణాలు భాఖ్రా డ్యామ్ చుట్టూ పర్యాటకాన్ని పెంచడం, దేశం నలుమూలల నుంచి వచ్చే వారు డ్యామ్‌ను సులభంగా చూడగలగడం కోస‌మే.

44
ఈ రైలు ఖర్చులు ఎవరు భరిస్తున్నారు?
Image Credit : stockPhoto

ఈ రైలు ఖర్చులు ఎవరు భరిస్తున్నారు?

ఇండియన్ రైల్వేలా ఈ రైలు టికెట్ల ఆదాయంపై ఆధారపడదు. మొత్తం నిర్వహణ ఖర్చును BBMB భరిస్తోంది. ఈ రైలును ఆదాయ వనరుగా కాకుండా ప్రజలకు అవసరమైన సేవగా చూస్తోంది. ఈ రైలు BBMB ఉద్యోగులు, స్కూల్, కాలేజ్ విద్యార్థులు, పరిసర గ్రామాల ప్రజల కోసం నిత్య ప్రయాణ సాధనంగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సెన్సిటివ్‌.. బాధ‌, కోపం రెండూ ఎక్కువే
Recommended image2
తెలంగాణ‌లోని ఈ న‌గ‌రం మ‌రో హైద‌రాబాద్ కావ‌డం ఖాయం.. ఎయిర్‌పోర్ట్ స‌హా కీల‌క ప్రాజెక్టులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved