- Home
- National
- కోమాలో ఉన్న భర్తతో తల్లి కావాలని కోరిన భార్య.. అనుమతిచ్చిన కోర్టు. ఇంతకి ఏంటీ ప్రాసెస్.?
కోమాలో ఉన్న భర్తతో తల్లి కావాలని కోరిన భార్య.. అనుమతిచ్చిన కోర్టు. ఇంతకి ఏంటీ ప్రాసెస్.?
Delhi High Court: ఢిల్లీ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. కోమాలో ఉన్న భారత సైనికుడి స్పెర్మ్‌ను సేకరించి భద్రపరచడానికి అనుమతి ఇచ్చింది. ఆ సైనికుడి భార్య తన కుటుంబాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పునిచ్చింది.

భార్య హక్కు నిరాకరించలేం
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పురుషేంద్ర కుమార్ కౌరవ్ ఈ కేసులో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. రాతపూర్వక అనుమతి లేకపోయినా, భార్య హక్కులను నిరాకరించలేమని పేర్కొన్నారు. దంపతులు ముందే IVF ద్వారా పిల్లల కోసం ప్రయత్నించినందున, దీనిని చట్టబద్ధమైన అంగీకారంగా పరిగణిం
కోమా పేషెంట్ నుంచి స్పెర్మ్ ఎలా తీస్తారు?
ఒక వ్యక్తి కోమాలో ఉన్నప్పుడు సహజంగా స్పెర్మ్ ఇవ్వలేడు. అప్పుడు డాక్టర్లు “సర్జికల్ స్పెర్మ్ రిట్రీవల్ (SSR)” అనే విధానాన్ని ఉపయోగిస్తారు. ఇది చిన్న శస్త్రచికిత్సలా ఉంటుంది. యూరాలజిస్ట్ నేరుగా పురుషుడి వృషణాల నుంచి స్పెర్మ్‌ను సేకరిస్తారు. ప్రమాదం లేదా అనారోగ్యం వల్ల స్పృహ కోల్పోయిన వ్యక్తులలో కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది.
PESA, TESA అంటే ఏమిటి?
స్పెర్మ్ సేకరణకు ప్రధానంగా రెండు విధానాలు ఉన్నాయి: PESA (Percutaneous Epididymal Sperm Aspiration) ఈ విధానంలో చిన్న సూదితో ఎపిడిడిమిస్ నుంచి స్పెర్మ్ తీస్తారు. ఇక TESA (Testicular Sperm Aspiration) విధానంలో నేరుగా టెస్టిస్ నుంచి సూదితో స్పెర్మ్ తీస్తారు. ఈ రెండు విధానాలు కూడా అనస్థీషియా ఇచ్చి నిర్వహిస్తారు. కాబట్టి రోగికి ఇబ్బంది తక్కువగా ఉంటుంది.
సమయం ఎందుకు చాలా ముఖ్యం?
కోమా లేదా బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లో సమయం చాలా కీలకం. డాక్టర్ల ప్రకారం, స్పెర్మ్ నాణ్యత కాపాడాలంటే 48 నుంచి 72 గంటలలోపే ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. ఆ సమయం దాటితే స్పెర్మ్ బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే కోర్టు అనుమతి, వైద్య ప్రక్రియలు త్వరగా పూర్తి కావడం అవసరం.
స్పెర్మ్‌ను ఎలా భద్రపరుస్తారు? ఖర్చెంత?
సేకరించిన స్పెర్మ్‌ను వెంటనే ఉపయోగించాల్సిన అవసరం లేదు. “క్రయోప్రిజర్వేషన్” ద్వారా చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రీజ్ చేసి నిల్వ చేస్తారు. ఇవి సంవత్సరాల పాటు సురక్షితంగా ఉంటాయి. తర్వాత IVF లేదా ICSI విధానంలో ఉపయోగిస్తారు.
ఖర్చు విషయానికి వస్తే సాధారణ PESA లేదా TESAకి రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు అవుతుంది. అదే అధునాతన Micro-TESE విధానానికి రూ. 1.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అవుతుంది. ఈ ఖర్చులో డాక్టర్ ఫీజు, ఆసుపత్రి చార్జీలు, అనస్థీషియా ఖర్చులు ఉంటాయి.
మొత్తం మీద మెడికల్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయ్యిందో ఈ ఉదాహరణ చెబుతోంది. కోమాలో ఉన్న వ్యక్తి నుంచి కూడా స్పెర్మ్ సేకరించడం సాధ్యమవుతోంది. ఇది కుటుంబాలకు కొత్త ఆశను ఇస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన చట్టపరమైన, నైతిక అంశాలు కూడా చాలా ముఖ్యంగా మారుతున్నాయి.

