MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Bus Accident: మ‌రో స్లీప‌ర్ బ‌స్సు ప్ర‌మాదం.. 17 మంది స‌జీవ ద‌హ‌నం

Bus Accident: మ‌రో స్లీప‌ర్ బ‌స్సు ప్ర‌మాదం.. 17 మంది స‌జీవ ద‌హ‌నం

Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఓ దారుణ ప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగిన ఈ రోడ్డు ప్ర‌మాదంలో 17 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 25 2025, 06:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కర్ణాటకలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం
Image Credit : Naik Kartik/X

కర్ణాటకలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం

కర్ణాటక రాష్ట్రంలో క్రిస్మస్ పండుగ రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.

25
లారీ ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన మంటలు
Image Credit : Naik Kartik/X

లారీ ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన మంటలు

వేకువ జామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఓ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్ర‌మాదం జ‌రిగిన‌ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతి అయింది. లారీ కూడా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది.

Related Articles

Related image1
సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులను అలాగే వదిలేయకండి.. ఇలా చేస్తే రూ. 2 ల‌క్ష‌ల వ‌డ్డీ పొందొచ్చు
Related image2
OTT: పూజ ఎవ‌రు? ఆ ప‌ర్సుతో ఆమెకు సంబంధం ఏంటి.? ఓటీటీని షేక్ చేస్తున్న మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్
35
సజీవ దహనమైన ప్రయాణికులు
Image Credit : Naik Kartik/X

సజీవ దహనమైన ప్రయాణికులు

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు బయటకు రాలేకపోయారు. ఇప్పటివరకు 17 మంది సజీవ దహనమైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొందరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి.

45
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది
Image Credit : Naik Kartik/X

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్ర‌మించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సు పూర్తిగా దగ్ధమై ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire#chitradurga#karnatakapic.twitter.com/Fdpe5Tg999

— Naik Kartik (@mekartiknaik) December 24, 2025

55
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Image Credit : Naik Kartik/X

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బస్సు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నేరాలు, మోసాలు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులను అలాగే వదిలేయకండి.. ఇలా చేస్తే రూ. 2 ల‌క్ష‌ల వ‌డ్డీ పొందొచ్చు
Recommended image2
OTT: పూజ ఎవ‌రు? ఆ ప‌ర్సుతో ఆమెకు సంబంధం ఏంటి.? ఓటీటీని షేక్ చేస్తున్న మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved