MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • క్రాక్స్ ధ‌రించి ఇంటికొచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అంత‌లోనే నోట్లో నుర‌గ‌తో అక్క‌డిక్క‌డే మృతి. అస‌లేం జ‌రిగిందంటే.

క్రాక్స్ ధ‌రించి ఇంటికొచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అంత‌లోనే నోట్లో నుర‌గ‌తో అక్క‌డిక్క‌డే మృతి. అస‌లేం జ‌రిగిందంటే.

చావు ఎప్పుడు, ఎలా సంభ‌విస్తుందో ఎవ‌రికీ చెప్ప‌లేం. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ప్ర‌మాదం ఏదో ఒక రంగా ముంచుకొస్తుంది. తాజాగా బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 01 2025, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం
Image Credit : Generated by google gemini AI

బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం

బెంగళూరులో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాముకాటు వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆయన చెప్పులో దాగి ఉన్న పాము కరిచడంతో ఈ ఘటన జరిగింది.

25
బాధితుడి వివరాలు
Image Credit : Asianet News

బాధితుడి వివరాలు

మృతుడు మంజు ప్రకాష్ (41), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ప‌నిచేస్తున్నారు. ఆయన బెంగళూరులోని బన్నేరఘట్టలో రంగనాథ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో బ‌య‌ట‌కు వెళ్లిన ప్ర‌కాష్‌ చెరకు రసం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో క్రాక్స్ శాండిల్స్ వేసుకున్నారు. ఇంటికి చేరాక చెప్పుల‌ను వ‌దిలి గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు.

Related Articles

Related image1
వైపర్ తయారీతో నెలకు రూ. 50 వేలు సంపాదించే ఛాన్స్.. అసలు ప్రాసెస్ ఏంటంటే.?
Related image2
భార్యాభ‌ర్త‌ క‌లిసి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే.. నెల‌కు రూ. 9 వేలు వ‌స్తాయి. ఎంత పెట్టుబ‌డి పెట్టాలంటే.
35
మూడు గంటల తర్వాత
Image Credit : Asianet News

మూడు గంటల తర్వాత

సుమారు గంట తర్వాత ఇంటికి వచ్చిన ఓ కార్మికుడు చెప్పుల దగ్గర చ‌నిపోయిన ఓ చిన్న పామును గమనించాడు. దీంతో కుటుంబ సభ్యులు అనుమానం వ‌చ్చి ప్రకాష్ గదిలోకి వెళ్లి చూశారు. అప్ప‌టికే ప్ర‌కాష్ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. నోటిలో నురుగు, కాలు నుంచి రక్తం రావడం గమనించారు.

45
ఆసుపత్రికి తరలించినా..
Image Credit : Asianet News

ఆసుపత్రికి తరలించినా..

తక్షణమే కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకునేలోపే ప్ర‌కాష్ మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. పాము చెప్పులో దాక్కుని ఉండగానే కరిచినట్లు వైద్యులు భావిస్తున్నారు. ఆ పాము కూడా ఊపిరాడక మృతిచెందినట్లు గుర్తించారు.

55
పాము కాటు వేసిన‌ట్లు ఎందుకు తెలియ‌లేదు.?
Image Credit : Asianet News

పాము కాటు వేసిన‌ట్లు ఎందుకు తెలియ‌లేదు.?

2016లో మంజు ప్రకాష్ ఓ బస్సు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దాంతో ఆయన కాలి నరాలు బలహీనపడి స్ప‌ర్శ‌ను కోల్పోయాడు. అందువల్ల పాము కాటు సమయంలో ఆయనకు నొప్పిగా అనిపించకపోవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంగానే ఆయన వెంటనే గుర్తించలేకపోయారని బంధువులు చెబుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
వైపర్ తయారీతో నెలకు రూ. 50 వేలు సంపాదించే ఛాన్స్.. అసలు ప్రాసెస్ ఏంటంటే.?
Recommended image2
భార్యాభ‌ర్త‌ క‌లిసి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే.. నెల‌కు రూ. 9 వేలు వ‌స్తాయి. ఎంత పెట్టుబ‌డి పెట్టాలంటే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved