MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Leftover Oil: పకోడీలు వేయించిన నూనె మిగిలిందా? పారేయకండి.. ఇలా చేస్తే మళ్లీ వాడుకోవచ్చు

Leftover Oil: పకోడీలు వేయించిన నూనె మిగిలిందా? పారేయకండి.. ఇలా చేస్తే మళ్లీ వాడుకోవచ్చు

Cooking Oil Reuse Ideas: ఇంట్లో వేడివేడిగా పకోడీలో, మిరపకాయబజ్జీలో, సమోసాలో తినాలనిపించి చేసుకుంటారు. ఆ తర్వాత మిగిలిన నూనె నల్లగా అయిపోయిందని, పనికిరాదని పారేస్తారు. కానీ ఆ నూనెతో బోల్డెన్నీ అద్భుతాలు చేయోచ్చు. పనికిరానిదే...ఇంటి పనులకు వాడుకోవచ్చు.

1 Min read
Author : Nandini Arava
Published : Apr 20 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మిగిలిపోయిన, నల్లగా అయిపోయిన నూనెతో అద్భుతాలు
Image Credit : Getty

మిగిలిపోయిన, నల్లగా అయిపోయిన నూనెతో అద్భుతాలు

ఇంట్లో బజ్జీలు, పకోడీలు, ఫిష్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ నల్లగా అయిపోతుంది. చాలా మంది ఆ మిగిలిపోయిన నూనెను బయట పారేస్తారు. నూనె నల్లగా అయిపోయిందని, జిడ్డుగా ఉందని పడేస్తారు. అలా కాకుండా కాస్త తెలివిగా ఆలోచిస్తే నల్లబడిన నూనెతోనే బోలెడన్ని అద్భుతాలు చేయోచ్చు. ఇంతకీ ఏమేం చేయోచ్చో...ఇక్కడ తెలుసుకుందాం. 

25
తుప్పు వదిలించొచ్చు
Image Credit : chatgpt

తుప్పు వదిలించొచ్చు

ఇంట్లో ఐరన్ వస్తువులు తుప్పుపడితే పక్కన పడేస్తాం. అలా కాకుండా మిగిలిపోయిన వంట నూనెను ఉపయోగించొచ్చు. ముందుగా నూనెలో ఉండే వ్యర్థాలను వేరు చేయడానికి దానిని ఒక సన్నని జల్లెడతో వడకట్టండి. ఈ నూనెను ఒక సీసాలో నిల్వ చేసుకోండి. తుప్పుపట్టిన ఐరన్ వస్తువులను శుభ్రం చేయవలసి వచ్చినప్పుడల్లా వాటికి కొద్దిగా నూనె రాసి ఒక గుడ్డతో తుడవండి. దానివల్ల తుప్పు పట్టకుండా నివారిస్తుంది. వాటిని చాలా కాలం పాటు కొత్తగా కనిపించేలా చేస్తుంది. 

Related Articles

Related image1
Altered oil: మీరు వాడుతోన్న నూనె పశువుల కొవ్వుతో చేసిందా.? ఎలా తెలుసుకోవాలంటే..
Related image2
Cooking Oil Usage: నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి?
35
నూనెతో స్టిక్కర్లు, లేబుల్స్ పోవడానికి ఉపయోగపడుతుంది
Image Credit : chatgpt

నూనెతో స్టిక్కర్లు, లేబుల్స్ పోవడానికి ఉపయోగపడుతుంది

కొత్త గిన్నెలు, సీసాలపై ఉండే స్టిక్కర్లు లేదా లేబుల్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఆ మరకలపై కొద్దిగా పాత నూనెను పూసి 5-10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత శుభ్రంగా తుడిస్తే స్టిక్కర్, దానికున్న జిగురు ఈజీగా పోతుంది. కష్టపడక్కర్లేదు. 

45
ఆవనూనె పారేయకండి
Image Credit : chatgpt

ఆవనూనె పారేయకండి

ఇంట్లో ఆవనూనె మిగిలిపోతే దాన్ని పారేయకండి. పాతబడిన ఫర్నిచర్‌కు తిరిగి మెరుపును తీసుకురావడానికి ఈ మిగిలిపోయిన ఆవనూనెను ఉపయోగించవచ్చు. నూనెలో మెత్తని క్లాత్ ముంచి చెక్కపై రుద్దండి. ఇది చెక్కకు తేమను అందించి, తళతళ మెరిసేలా చేస్తుంది. ఆ తర్వాత పొడి క్లాత్‍తో తుడవడం మర్చిపోవద్దు. 

55
తలుపులు శబ్ధం రాకుండా
Image Credit : chatgpt

తలుపులు శబ్ధం రాకుండా

ఇంట్లోని తలుపు లేదా కిటికీ గొళ్లేలు శబ్దం చేస్తుంటే, ఈ మిగిలిపోయిన నూనెను వాడొచ్చు. నూనెలో దూది ముంచి వాటిపై అద్దండి. శబ్దం వెంటనే ఆగిపోతుంది. బాగా పనిచేస్తాయి కూడా. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Apricots: ఇవి తింటే చాలు..చూస్తుండగానే బరువు తగ్గిపోతారు
Recommended image2
Food : హోటల్ ఫుడ్ లో ఎన్ని రసాయనాలుంటాయో తెలుసా..? తిన్నారో అంతే సంగతి
Recommended image3
Anger: చిన్న విషయానికి కోపం వస్తుందా? ఈ ట్రిక్‍తో క్షణంలో మాయం
Related Stories
Recommended image1
Altered oil: మీరు వాడుతోన్న నూనె పశువుల కొవ్వుతో చేసిందా.? ఎలా తెలుసుకోవాలంటే..
Recommended image2
Cooking Oil Usage: నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved